రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో 743 జిల్లాలను కవర్ చేస్తూ 9000 కంటే ఎక్కువ దుకాణాలతో ప్రభుత్వం పీ ఎం బీ జే పీ పరిధిని మరింతగా పెంచింది.


అందరికీ సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందజేయాలనే గౌరవ ప్రధానమంత్రి ఆశయాన్ని జన్ ఔషధి నెరవేరుస్తుంది

బ్రాండెడ్ ఔషధాల కంటే 50%-90% తక్కువ ధర తో మందులు

సుమారు రూ. 18,000 కోట్లు గత 8 సంవత్సరాలలో ఈ పరియోజన ద్వారా ఆదా

Posted On: 31 DEC 2022 2:29PM by PIB Hyderabad

నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటు ధరల్లో అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన ని ఫార్మాస్యూటికల్స్ శాఖ, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నవంబర్, 2008లో ప్రారంభించింది.  డిసెంబర్ 2017లో 3000 కేంద్రాలు తెరవడం లక్ష్యం  సాధించారు. ఇంకా, మార్చి, 2020లో మొత్తం 6000 అవుట్‌లెట్‌ల సవరించిన లక్ష్యం కూడా సాధించబడింది.  గత ఆర్థిక సంవత్సరంలో 8610 ఉన్న కేంద్రాల సంఖ్య ఇప్పుడు 9000కి పెరిగింది. అందువల్ల, దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో 743ని కవర్ చేసే 9000 కంటే ఎక్కువ దుకాణాలతో ప్రభుత్వం పీ ఎం బీ జే పీ పరిధిని మరింతగా పెంచింది. మార్చి 2024 నాటికి ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల సంఖ్యను 10,000కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పీ ఎం బీ జే పీ ఉత్పత్తి బాస్కెట్ లో 1759 మందులు మరియు 280 సర్జికల్ పరికరాలు ఉన్నాయి. యాంటీకాన్సర్‌లు, యాంటీ డయాబెటిక్స్, యాంటీఇన్‌ఫెక్టివ్‌లు, యాంటీఅలెర్జిక్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ మందులు, న్యూట్రాస్యూటికల్స్ ఉత్పత్తులు మరియు కొన్ని ఆయుష్ ఉత్పత్తులు ఆయురక్ష కిట్, బాల్రక్ష కిట్ మరియు ఆయుష్-64 టాబ్లెట్‌లు ఇమ్యూనిటీ బూస్టర్‌లుగా పరియోజన ఉత్పత్తి బాస్కెట్‌లో జోడించబడ్డాయి.

 

పీ ఎం బీ జే పీ కింద లభించే ఔషధాల ధర బ్రాండెడ్ ఔషధాల కంటే 50%-90% తక్కువ. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 893.56 కోట్లు అమ్మకాలు సాధించాయి, దీని వల్ల దాదాపు రూ. బ్రాండెడ్ మందులతో పోలిస్తే పౌరులకు 5300 కోట్లు ఆదా అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23లో, పీ ఎం బీ ఐ అమ్మకాలు రూ. 758.69 కోట్లు 30.11.2022 వరకు  దాదాపు రూ 4500 కోట్లు పౌరులకు ఆదా అయ్యింది. మొత్తం అమ్మకాలు జన్ ఔషధి విస్తృత ఆమోదాన్ని నిరూపిస్తూ అసాధారణ వృద్ధిని కనబరిచాయి.

 

ఈ పథకం సుస్థిరమైన మరియు క్రమమైన ఆదాయాలతో స్వయం ఉపాధికి మంచి అవకాశాలను అందిస్తోంది. పీ ఎం బీ జే పీ పధకం కింద, జనౌషధి కేంద్రాలకు రూ. 5.00 లక్షలు ప్రోత్సాహకం  ఆర్థిక సహాయంగా  అలాగే అదనపు ప్రోత్సాహకంగా ఒక్క సారే రూ. 2.00 లక్షలు ( ఐ టీ మరియు ఇన్‌ఫ్రా ఖర్చులకు రీయింబర్స్‌మెంట్‌గా) నీతి అయోగ్ ద్వారా ఆశావహ జిల్లాలు ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాలు, ద్వీప ప్రాంతాలు మరియు వెనుకబడిన ప్రాంతాలు  మహిళా పారిశ్రామికవేత్తలు, మాజీ సైనికులు దివ్యాంగ్, ఎస్ సీ & ఎస్ టీ  ప్రారంభించబడిన జనౌషధి కేంద్రాలకు ప్రోత్సాహక  ఆర్థిక సహాయం అందించారు.

 

జన్ ఔషధి సువిధ శానిటరీ న్యాప్‌కిన్‌లను ఒక్కో ప్యాడ్‌కు రూ. 1/- ధరకు దేశవ్యాప్తంగా ఉన్న ఈ 9000 PMBJP కేంద్రాల ద్వారా అమ్మారు. ప్రారంభం నుండి 30.11.2022 వరకు,దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలలో 31.40 కోట్ల జనౌషధి సువిధ శానిటరీ ప్యాడ్‌లు విక్రయించబడ్డాయి. వీటి సరఫరా కోసం గురుగ్రామ్, చెన్నై, గౌహతి మరియు సూరత్‌లలో నాలుగు గిడ్డంగులు ఉన్నాయి.  సుదూర మరియు గ్రామీణ ప్రాంతాలకు నిరంతరాయంగా వేగంగా మందులు సరఫరా చేయడానికి ఎస్ ఏ పీ ఆధారిత మందుల జాబితా నిర్వహణ వ్యవస్థ ద్వారా మద్దతునిస్తుంది.

***



(Release ID: 1887895) Visitor Counter : 153