మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

మత్స్య ఆక్వా రంగాలకు బీమా సౌకర్యం అనే అంశంపై జాతీయ వెబ్‌నార్‌ నిర్వహించిన మత్స్య శాఖ

Posted On: 31 DEC 2022 4:25PM by PIB Hyderabad

1.వెబ్‌నార్‌ లో పాల్గొన్న దేశం వివిధ ప్రాంతాలకు చెందిన 170 కి పైగా ప్రతినిధులు 

2. వివిధ అంశాలపై సాంకేతిక సదస్సుల నిర్వహణ 

3. ప్రశ్నోత్తరాల సదస్సులో ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, సమస్యల పరిష్కారానికి ఆచరణ సాధ్యమైన సలహాలు అందించిన నిపుణులు. మరిన్ని రంగాలను బీమా పరిధిలోకి తెచ్చే అవకాశంపై చర్చలు 

.. 

మత్స్య ఆక్వా రంగాలకు బీమా సౌకర్యం అనే అంశంపై 2022 డిసెంబర్ 29న మత్స్య శాఖ, మత్స్య విభాగం, పాడి పరిశ్రమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ  జాతీయ వెబ్‌నార్‌ నిర్వహించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ లో  వెబ్‌నార్‌ జరిగింది. కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ  శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షతన జరిగిన   వెబ్‌నార్‌ లో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన 170 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మత్స్యకారులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, మత్స్యకారుల సంఘాల ప్రతినిధులు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మత్స్య శాఖ సీనియర్ అధికారులు, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల  అధ్యాపకులు, మత్స్య పరిశోధనా సంస్థలు, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు మత్స్య పశుసంవర్ధక రంగం వర్గాల ప్రతినిధులు వెబ్‌నార్‌ కు హాజరయ్యారు. 

బీమాపై స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని  కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అన్నారు. సంబంధిత వర్గాలకు బీమా పై అవగాహన కల్పించేందుకు ప్రచార, అవగాహన కార్యక్రమాలు అమలు జరగాలని అన్నారు. మత్స్య రంగానికి  బీమా సౌకర్యం అందించే విధంగా ప్రైవేటు, విదేశీ బీమా సంస్థలు ముందుకు వచ్చేలా చూసేందుకు చర్యలు అమలు జరగాలన్నారు. మెరైన్ రంగానికి చెందిన వారు బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారని శ్రీ  స్వైన్ తెలిపారు.మెరైన్ రంగం కోసం కేంద్ర మత్స్య శాఖ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GAIS) అమలు చేస్తున్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. మత్స్య రంగంలో బీమా సౌకర్యం మరింత ఎక్కువగా అమలు జరిగేలా చూసేందుకు మెరైన్ ఫిషరీస్ నియంత్రణ చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందని శ్రీ స్వైన్ అన్నారు. 

పారిశ్రామిక మరియు చిన్న చేపలు పట్టే నౌకలు మరియు పెద్ద ఆక్వాకల్చర్ కార్యకలాపాల కోసం ఆసియా, ఆఫ్రికా, యూరప్ మరియు అమెరికా వంటి వివిధ దేశాల్లో అమలు జరుగుతున్న  క్యాప్చర్ ఫిషరీస్ బీమా మరియు ఆక్వాకల్చర్ బీమా పాలసీల వివరాలను  కేంద్ర మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా వివరించారు. దేశంలో అందుబాటులో ఉన్న బీమా సౌకర్యం వివరాలను ఆయన తెలిపారు. ఆక్వా రంగంలో బీమా సౌకర్యం అమలు చేసే అంశంలో ఎదురవుతున్న సవాళ్లు ప్రస్తావించిన శ్రీ మెహ్రా బీమా పరిధిని విస్తరించడానికి సాంకేతిక, ఐసీటీ/ఐటీ, రిమోట్ సెన్సింగ్ సౌకర్యాలను ఉపయోగించాలని సూచించారు. మత్స్య రంగంలో ఉన్న వివిధ వర్గాలను సమీకరించడానికి చర్యలు అమలు జరగాలని అన్నారు.  


సాంకేతిక సదస్సులో  కొచ్చి ఐసిఏఆర్- సీఎంఎఫ్ఆర్ఐ  సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ షినోజ్ పరప్పురతు “భారతదేశంలో ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్: అవకాశాలు మరియు సవాళ్లు” అనే అంశంపై ప్రదర్శనను అందించారు. లోతట్టు మరియు సముద్ర రంగాల్లో  మత్స్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించిన డాక్టర్ షినోజ్ పరప్పురతు ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఫిషింగ్ గేర్లు మరియు ఇతర పరికరాల కోసం అందుబాటులో ఉన్న బీమా సౌకర్యాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఐసిఏఆర్- సీఎంఎఫ్ఆర్ఐ నిర్వహించిన అధ్యయనంలో బీమా పట్ల మత్స్యకారులు,ఆక్వా రైతులకు రైతులకు సరైన అవగాహన లేదని వెల్లడయ్యిందని  డాక్టర్ షినోజ్ పరప్పురతు తెలిపారు. 

"మత్స్య పరిశ్రమలో బీమా అవసరాలు" అనే అంశంపై ఎన్ఎఫ్ డిబి  సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  డాక్టర్ ఎల్.ఎన్.మూర్తి మాట్లాడారు.  ఈ రంగంలోని అందుబాటులో ఉన్న  అవకాశాల గురించి ఆయన వివరించారు.  సముద్రంలో చేపల వేట సమయంలో  మత్స్యకారులు మరియు మత్స్యకారులకు ఎదురవుతున్న బెదిరింపులు, సంస్కృతి సంబంధ అంశాలను ఆయన వివరించారు. మత్స్యకారులకు ప్రయోజనం కలిగించే  బీమా సౌకర్యాలను ఆయన  వివరించారు. విశ్వవిద్యాలయాలు మరియు విద్యాసంస్థలు బీమా అంశంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. మత్స్య రంగం  "సుస్థిరత, లాభదాయకత మరియు ఉత్పాదకత"  విధానాన్ని అనుసరించాలని ఆయన అన్నారు. 

ఆక్వాకల్చర్ (రొయ్యలు మరియు రొయ్యలు) బీమా పాలసీ అనే అంశంపై  మెస్సర్స్  ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, న్యూఢిల్లీ చీఫ్ మేనేజర్ శ్రీ బి.కే.  సిన్హా మాట్లాడారు.  వివిధ రకాల జాతుల ఆక్వాకల్చర్ కోసం అందుబాటులో ఉన్న బీమా సౌకర్యాలు,  మరియు అటువంటి ఉత్పత్తులకు అందిస్తున్న  బీమా కవరేజీ పరిధిపై వివరణాత్మక ప్రదర్శన అందించారు.  పాలసీ వ్యవధి, బేసిక్ పాలసీ వాల్యుయేషన్ మరియు లబ్ధిదారులకు అందించే రాయితీల  సమాచారాన్ని ఆయన అందించారు.   బీమా పాలసీలకు సంబంధించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అమలు చేస్తున్న   నిబంధనలు మరియు షరతులను  ఆయన వివరించారు. 

సాంకేతిక సదస్సు తర్వాత నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పలువురు నిపుణులు పాల్గొన్నారు.  సమస్యల పరిష్కారానికి ఆచరణ సాధ్యమైన సలహాలు నిపుణులు అందించారు.నూతన  బీమా సౌకర్యాల కల్పనపై నిపుణులు ప్రసంగించారు. 

***



(Release ID: 1887819) Visitor Counter : 162