ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వాధీనం చేసుకున్న 538 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసిన ముంబై కస్టమ్స్

Posted On: 30 DEC 2022 3:19PM by PIB Hyderabad

  నవీ ముంబై తలోజా లో ఉన్న మెస్సర్స్  ముంబై వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (MWML)  దహన కేంద్రంలో  140.57 కిలోల బరువున్న మాదక ద్రవ్యాలను ముంబై కస్టమ్స్, జోన్-III అధికారులు  ఈరోజు దగ్ధం చేశారు.అధికారులు దగ్ధం చేసిన మాదక ద్రవ్యాల . అంతర్జాతీయ అక్రమ మార్కెట్‌లో 538 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 

దీనికి సంబంధించిన వివరాలను  ముంబై కస్టమ్స్, జోన్-III ముఖ్య కమిషనర్ వెల్లడించారు.  ముంబై కస్టమ్స్, జోన్-III పరిధిలో ఉన్న మూడు కమిషనరేట్‌లు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నాశనం చేశామని తెలిపారు. వివరాలు.

 i . 14 కేసుల్లో ముంబై విమానాశ్రయ కమిషనరేట్‌ స్వాధీనం చేసుకున్న 56.06 కేజీల హెరాయిన్, 33.81 కేజీల హషీష్‌

ii. ఎయిర్ కార్గో ఎక్స్‌పోర్ట్ కమిషనరేట్‌లో నమోదు  చేసిన కేసులో స్వాధీనం చేసుకున్న 21.70 కిలోల హషీష్‌
iii.  ఒక కేసులో డీఆర్ఐ స్వాధీనం చేసుకున్న 29 కిలోల హెరాయిన్‌.  అయితే ముంబై కస్టమ్స్ జోన్-III  ప్రివెంటివ్ కమిషనరేట్ ద్వారా దీనిని నాశనం చేయడం జరిగింది. 

 నిషేధిత మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న  వ్యక్తులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) 1985 చట్టం లోని సెక్షన్ ప్రకారం శిక్షార్హులు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం సెక్షన్ 21, 23 లు, కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం వీరికి శిక్ష విధించబడుతుంది.

కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కెన్యా, ఉగాండా, జాంబియా మరియు జింబాబ్వే వంటి దేశాలకు చెందిన ప్రజల ద్వారా మాదక ద్రవ్యాల  స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది.  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల వివరాలు ఈ అంశాన్ని తెలియజేస్తున్నాయి. వస్తువులు తీసుకు వెళ్ళడానికి ఉపయోగిస్తున్న సూట్ కేసులకు    ప్రత్యేకంగా  తయారు చేసిన అరల్లో  దాచిపెట్టడం ద్వారా మాదక ద్రవ్యాల  స్మగ్లింగ్‌ జరుగుతోంది. క్యారియర్లు ఆహార రూపంలో  మాదకద్రవ్యాలను తీసుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కూడా అధికారులు గుర్తించారు.  ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ కేసులను గుర్తించడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన శునకాలను కూడా  సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. 

 స్వాధీనం చేసుకున్న హానికరమైన  వస్తువులను ఇతర పద్ధతుల్లో నాశనం చేస్తే పర్యావరణానికి హాని కలుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని  ప్రామాణిక కాలుష్య నియంత్రణ పరికరాలు అమర్చిన దహన యంత్రాలలో అధికారులు మాదక ద్రవ్యాలను దగ్ధం చేస్తున్నారు. 
నిషిద్ధ వస్తువులు వివిధ మార్గాల్లో  దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి.  అయితే  కస్టమ్స్ శాఖ అక్రమ రవాణా అరికడుతూ మాదక ద్రవ్యాలను  లేదా జప్తు చేస్తోంది.  ముంబై కస్టమ్స్ నార్కోటిక్ డ్రగ్స్‌పై ఐక్యరాజ్యసమితి 1961 ఆమోదించిన తీర్మానానికి  కట్టుబడి ఉంది, తీర్మానంపై భారతదేశం సంతకం చేసింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా  అరికట్టేందుకు, అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి శిక్షించేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.

***


(Release ID: 1887768) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Marathi , Hindi