ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సార్వత్రిక ఆరోగ్య రక్షణ రంగంలో మరో మైలు రాయి అధిగమించిన భారతదేశం పనిచేయడం ప్రారంభించిన 1,50,000 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు
134 కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ 86.90 మందికి పైగా ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు
1.60 కోట్లకు పైగా టెలీ సంప్రదింపులు అందించిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు
వ్యాధి నిర్ధారణ సేవలు, అత్యవసర మందులు అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు
Posted On:
30 DEC 2022 1:05PM by PIB Hyderabad
దేశ ప్రజలందరికి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని సాగుతున్న ప్రయత్నాల్లో భారతదేశం మరో ముందడుగు వేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు దేశం అన్ని ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏర్పాటైన 1,50,000 పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు 2022 డిసెంబర్ 31 నాటికి పని చేయడం ప్రారంభించాయి. గడువుకు ముందుగా లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. లక్ష్య సాధనలో సహకరించిన వారిని ప్రధానమంత్రి అభినందించారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాయని అన్నారు.
నిర్ణయించుకున్న లక్ష్యాన్ని దేశం సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. లక్ష్య సాధనకు సహకరించిన ప్రతి ఒక్కరినీ మంత్రి అభినందించారు. ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణ అందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల సాకారం అవుతుందని అన్నారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా పనిచేయడం వల్ల ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించే అంశంలో ప్రపంచానికి భారతదేశం మార్గదర్శకంగా నిలిచింది అని డాక్టర్ మాండవీయ అన్నారు.
ఎవరిని విస్మరించకుండా ప్రతి ఒక్కరికి సహకారం అందించాలి అన్న అంత్యోదయ స్పూర్తితో దేశంలో ఏర్పాటైన 1,50,000 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు ప్రజలందరికీ ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చాయి. అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు పుట్టినప్పటి నుండి మరణం వరకు సమగ్ర నిరంతర ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. వివిధ కార్యక్రమాల ద్వారా దేశంలో మారుమూల ప్రాంతాలకు ఆరోగ్య సేవలు విస్తరించడానికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు ద్వారా కృషి జరుగుతోంది. టెలీ సంప్రదింపుల రంగంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు 8.5 కోట్లకు పైగా టెలీ సంప్రదింపులు అందించాయి. ఈ- సంజీవని ద్వారా రోజుకు సరాసరిన దాదాపు 4 లక్షల టెలీ సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాల ద్వారా దేశంలో 134 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందారు. వివిధ వ్యాధుల నిర్ధారణ కోసం 86.90 మందికి పరీక్షలు నిర్వహించారు. 29.95 కోట్ల హైపర్‌టెన్షన్, 25.56 కోట్ల మధుమేహం, 17.44 కోట్ల క్యాన్సర్, 17.44 కోట్ల రొమ్ము క్యాన్సర్, 5.66 కోట్ల గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలను నెలకొల్పడం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు- హెల్త్ వెల్ నెస్ కేంద్రాల్లో 172 రకాల అత్యవసర ఔషదాలు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు- హెల్త్ వెల్ నెస్ కేంద్రాల్లో లభిస్తున్న అత్యవసర ఔషదాల సంఖ్య 105 కి చేరింది.63 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు- హెల్త్ వెల్ నెస్ కేంద్రాల్లో 63 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు- హెల్త్ వెల్ నెస్ కేంద్రాల్లో 14 రకాల పరీక్షలు జరుగుతున్నాయి. యోగా, జుంబా, సైక్లాథాన్‌లు, వాకథాన్‌లపై ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. సమాజ శ్రేయస్సు కోసం మనస్తత్వాన్ని అలవరచుకోవడానికి ఆహారం, శారీరక శ్రమ, సానుకూల సంతాన సాఫల్యం, పొగాకు, మద్యపానం మానడం వంటి ఇతర అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు అందిస్తాయి .
ఇప్పటి వరకు, ఈ కేంద్రాలలో 1.60 కోట్లకు పైగా వెల్‌నెస్ సదస్సులు నిర్వహించబడ్డాయి.
పట్టణ ప్రాంతాల్లో కూడా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి. 2-3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ వెల్ నెస్ కేంద్రాలను ఒక పరిధిలోకి తీసుకొని వచ్చి మెరుగైన ఔట్ పేషెంట్ సేవలు అందించడం జరుగుతుంది. దీనివల్ల ఒక ఆరోగ్య కేంద్రం పరిధిలో 15,000 నుంచి 20,000 మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు.
***
(Release ID: 1887561)
Visitor Counter : 213