బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ. 300 కోట్ల అంగుళ- బలరాం రైల్ లింక్ ప్రారంభం రోజూ అదనంగా మరో 40 వేల టన్నుల కోచ్ ల సరకు రవాణా

Posted On: 29 DEC 2022 4:00PM by PIB Hyderabad

అంగుల్ -బలరాం  రైల్ లింక్ వలన తాల్చేర్ నుంచి బొగ్గు తరలింపుకు మరింత సానుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం సిద్ధం కావటంతో మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఇక మీదట రోజువారీ బొగ్గు తరలింపు దాదాపు 40 వేల టన్నులు పెంచగలుగుతుంది. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన మొదటి దశ  అంగుల్ – బలరాం లింక్ వలన రోజుకు 10 రేక్ ల బొగ్గు బట్వాడా పెరిగింది.

ఎంసీఎల్,  ఇర్కాన్  ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇడ్కో  జాయింట్ వెంచర్ గా ప్రారంభించిన  మహానది కోల్ రైల్వే లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. దీన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ,  పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, విద్య, నైపుణ్య శిక్షణ ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖా మంత్రి శ్రీ అశ్వని వైష్ణవ ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 

 

ఒడిశా అంగుల్ జిల్లాలోని తాల్చేర్ బొగ్గు గనుల అవసరం తీర్చే  68 కిలోమీటర్ల అంగుల్ -బలరాం-పుతుగాడియా జరపడా – టెంటులోయి - ఇన్నర్ కారిడార్ అమలు బాధ్యత ఎం సి ఆర్ ఎల్ చేపట్టింది. మొదటి దశలో 14 కిమీ పొడవైన అంగుల్ –బలరాం రైల్  లింక్ నిర్మాణం జరిగింది. రెండో దశ 54 కిలోమీటర్ల బలరాం – పుతుగాడియా-జరపడ- టెంటులోయి రైల్ లింక్ త్వరలో నిర్మాణం జరుగుతుంది.  ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు చేపట్టింది. దీనికి రూ.1700 ఖర్చవుతుంది.

బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా; కోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ ప్రమోద్ కుమార్ అగర్వాల్, ఎంసీఎల్  ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఓపీ సింగ్ ఎంసీఎల్ డైరెక్టర్ శ్రీ కేశవ రావు టెక్నికల్ డైరెక్టర్ శ్రీ జుగల్ కుమార్ బోరా, ఫైనాశ డైరెక్టర్  శ్రీ  అజిత్ కుమార్ బెహురయా కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.  

ఈ రైల్ లింక్ వలన తాల్చేర్ కోల్ ఇండియా కేటాయించిన  గణిం తవ్వకం దారులు మినహా బొగ్గు  బ్లాక్ ల నుంచి గని యజమానులకు కేటాయించిన పొడి ఇంధనాన్ని తొలగించటం  కూడా సాధ్యమవుతుంది. 

 

***


(Release ID: 1887391) Visitor Counter : 128


Read this release in: Odia , English , Urdu , Tamil