ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఉజ్బెకిస్థాన్-మరియన్ బయోటెక్ దగ్గు మందు విషయంలో పత్రిక ప్రకటన
ఉజ్బెకిస్థాన్ ఔషధ నియంత్రణ సంస్థతో సీడీఎస్‌సీవో సంప్రదింపులు
మరియన్ బయోటెక్‌కు చెందిన నోయిడా తయారీ కేంద్రంలో యూపీ ఔషధ నియంత్రణ అధికారులు, సీడీఎస్‌సీవో బృందం సంయుక్త తనిఖీ
దగ్గు మందు నమూనాలను చండీగఢ్‌లోని ప్రాంతీయ ఔషధ పరీక్ష కేంద్రానికి (ఆర్‌డీటీఎల్) పంపిన అధికారులు
Posted On:
29 DEC 2022 1:30PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో, భారతీయ కంపెనీ మరియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు మందు 'డాక్1 మ్యాక్స్' మీద ఉజ్బెకిస్థాన్ నుంచి కొన్ని నివేదికలు వచ్చాయి. భారత ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాల మేరకు, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) డిసెంబర్ 27, 2022 నుంచి ఉజ్బెకిస్థాన్ ఔషధ నియంత్రణ సంస్థతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోంది.
సమాచారం అందిన వెంటనే, మరియన్ బయోటెక్‌కు చెందిన నోయిడా తయారీ కేంద్రంలో యూపీ ఔషధ నియంత్రణ అధికారులు, సీడీఎస్‌సీవో బృందం సంయుక్త తనిఖీ నిర్వహించింది. తనిఖీ నివేదిక ఆధారంగా తగిన తదుపరి చర్యలు తీసుకుంటారు.
మరియన్ బయోటెక్, లైసెన్స్ పొందిన తయారీ సంస్థ. 'డాక్1 మ్యాక్స్' దగ్గు మందు, మాత్రల ఎగుమతుల కోసం ఉత్తరప్రదేశ్ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి లైసెన్స్ పొందింది.
మరియన్ బయోటెక్ తయారీ కేంద్రం నుంచి దగ్గు మందు నమూనాలను అధికారులు తీసుకుని, చండీగఢ్‌లోని ప్రాంతీయ ఔషధ పరీక్ష కేంద్రానికి (ఆర్‌డీటీఎల్) పంపారు.
****
(Release ID: 1887318)
Visitor Counter : 172