హోం మంత్రిత్వ శాఖ

జమ్మూ & కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత భద్రతా పరిస్థితి మరియు అభివృద్ధి అంశాలపై కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Posted On: 28 DEC 2022 8:27PM by PIB Hyderabad

జమ్మూ & కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత భద్రతా పరిస్థితి మరియు అభివృద్ధి అంశాలపై కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర హోం కార్యదర్శి, డైరెక్టర్ (ఐ బీ), రా చీఫ్ మరియు జమ్మూ & కాశ్మీర్ యూ టీ అధికారులతో సహా భారత ప్రభుత్వ ఇతర సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

శ్రీ అమిత్ షా భద్రతా గ్రిడ్ పనితీరును మరియు భద్రతకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా  సహన రహిత విధానాన్ని అనుసరించడానికి అవసరమైన ఆదేశాలు ఇచ్చారు.

 

కేంద్ర హోం మంత్రి జమ్మూ కాశ్మీర్‌లోని యూ టిలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులను సమీక్షించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు నూరు శాతం సంతృప్తిని సాధించేలా కృషి చేయాలని, అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

 

సామాన్యుల శ్రేయస్సును దెబ్బతీసే తీవ్రవాద-వేర్పాటువాద ప్రచారానికి సహాయపడే, ప్రోత్సహించే మరియు కొనసాగించే అంశాలతో కూడిన ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థను ద్వంసం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అన్నారు.

***



(Release ID: 1887177) Visitor Counter : 107