విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అస్సాంలో 'బిజిలీ ఉత్సవ్' నిర్వహించిన ఆర్ఈసీ

Posted On: 28 DEC 2022 3:25PM by PIB Hyderabad
  1. విద్యుత్ వినియోగదారుల హక్కులు, విద్యుత్ ప్రయోజనాలు మరియు మారుమూల ప్రాంతాల్లో విద్యుద్దీకరణ సమయంలో ఎదుర్కొనే సవాళ్లు అలాగే విద్యుత్తు రాకతో జీవన నాణ్యత ఎలా మెరుగుపడుతుందనే అంశాలు వినియోగ అధికారుల స్పీకర్ సెషన్‌లలో వెలువడ్డాయి.
  2. విద్యుత్ వినియోగదారుల హక్కులు, ఇంధన పొదుపు మరియు విద్యుత్ ప్రయోజనాలు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు క్విజ్ పోటీలు మరియు నుక్కడ్ నాటక్ నిర్వహించారు.
  3. పోటీల్లో విజేతలకు బహుమతులుగా ఎల్‌ఈడీ బల్బుల పంపిణీతో కార్యక్రమం ముగిసింది

image.png

 

అస్సాంలో ‘బిజిలీ ఉత్సవ్’ నిర్వహించిన ఆర్‌ఈసీ లిమిటెడ్


భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో మహారత్న కంపెనీ అయిన ఆర్‌ఈసీ లిమిటెడ్ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా  75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని అస్సాంలోని బక్సా జిల్లా ఆనందపూర్ మరియు చుట్టుపక్కల గ్రామాలలో 'బిజిలీ ఉత్సవ్'ను నిర్వహించింది. కార్యక్రమంలో బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ స్పీకర్ శ్రీ కతిరామ్ బోరో, బక్సా అదనపు డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్ అష్రాఫుల్ అమీన్, ఆనందపూర్ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్  శ్రీ ఖగేంద్రనాథ్ సరనియా, నెహ్రూ అంచాలిక్ హైస్కూల్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ నాగేన్ చంద్ర దాస్, అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కో. లిమిటెడ్ (ఏపిడిసిఎల్) బక్సా ఏజీఏ (ఆర్‌ఈ) శ్రీ మానస్జ్యోతి పాఠక్ మరియు గౌహతిలోని ఆర్‌ఈసీ ప్రాంతీయ కార్యాలయం నుండి అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

విద్యుత్ వినియోగదారుల హక్కులు, విద్యుత్ ప్రయోజనాలు మరియు మారుమూల ప్రాంతాల్లో విద్యుద్దీకరణ సమయంలో ఎదురయ్యే సవాళ్లను మరియు విద్యుత్తు అందుబాటులోకి రావడంతో జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మరియు గౌరవనీయ అతిథులు ప్రసంగించారు. గ్రామాల నుండి లబ్ధిదారులను వేదికపైకి ఆహ్వానించి వారి అనుభవాలు మరియు విద్యుత్ వారి జీవితాలను ఎలా మార్చింది అనే దానిపై అభిప్రాయాలను పంచుకున్నారు.

గ్రామస్తులు, చిన్నారులతో ముచ్చటిస్తూ పలు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ వినియోగదారుల హక్కులు, ఇంధన పొదుపు మరియు విద్యుత్ ప్రయోజనాలు వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు నుక్కడ్ నాటక్ కూడా ప్రదర్శించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎల్ ఈడీ బల్బులు, జామెట్రీ బాక్సులను బహుమతులుగా పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.

ఆర్‌ఈసీ లిమిటెడ్ గురించి: ఆర్‌ఈసీ లిమిటెడ్ అనేది భారతదేశం అంతటా పవర్ సెక్టార్ ఫైనాన్సింగ్ మరియు డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించే ఎన్‌బిఎఫ్‌సి. 1969లో స్థాపించబడిన ఆర్‌ఈసీ లిమిటెడ్ తన కార్యకలాపాల నిర్వహణలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర/రాష్ట్ర విద్యుత్ వినియోగాలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు, గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు మరియు ప్రైవేట్ రంగ వినియోగాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీని వ్యాపార కార్యకలాపాలు పూర్తి పవర్ సెక్టార్ వాల్యూ చైన్‌లో జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీతో సహా వివిధ రకాల ప్రాజెక్ట్‌లకు ఫైనాన్సింగ్ అందిస్తుంది. ఆర్‌ఈసీ నిధులు భారతదేశంలోని ప్రతి నాల్గవ బల్బును ప్రకాశింపజేస్తున్నాయి.


 

***



(Release ID: 1887095) Visitor Counter : 125