గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు ముఖ్యమైన రాజ్యాంగ (ఎస్టీ) ఉత్తర్వుల సవరణ బిల్లులు మారుమూల నివసించే గిరిజన తెగలకు న్యాయం చేయటం మీదనే కేంద్ర ప్రభుత్వ దృష్టి: శ్రీ అర్జున్ ముండా

Posted On: 27 DEC 2022 4:56PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లులు 

* ఉత్తరప్రదేశ్ కోసం రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు, తెగలు) ఉత్తర్వు (రెండవ సవరణ) బిల్లు, 2022  

* తమిళనాడు కోసం రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఉత్తర్వు (రెండవ సవరణ) బిల్లు, 2022

* కర్ణాటక కోసం రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఉత్తర్వు (నాలుగవ సవరణ) బిల్లు, 2022

మూడు ముఖ్యమైన రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఉత్తర్వు సవరణ  బిల్లులు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందాయి.

తమిళనాడుకు సంబంధించిన  రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఉత్తర్వు (రెండవ సవరణ) బిల్లు, 2022 రాజ్యసభలో 22.12.2022 నాడు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత నరికొరవలు, కురివిక్కారులు షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేరతారు. ఈ బిల్లుకు లోక్ సభ అంతకు ముందే 15.12.2022 నాడు ఆమోదం తెలిపింది.

కర్ణాటకకు సంబంధించి రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఉత్తర్వు (నాలుగవ సవరణ) బిల్లు, 2022 రాజ్యసభలో 22.12.2022 నాడు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.  ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాక  బెట్ట కురుబ అనే కాడు కురుబలు కర్ణాటకలో ఎస్టీల జాబితాలో చేరినట్టవుతుంది. ఈ బిల్లును అంతకు ముందు 2022 డిసెంబర్ 19 న లోక్ సభ ఆమోదించింది.

అంతకు ముందే, ఉత్తరప్రదేశ్ కోసం రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు, తెగలు) ఉత్తర్వు (రెండవ సవరణ) బిల్లు, 2022 ను రాజ్యసభ ఈ శీతాకాల సమావేశాల్లోనే ఏకగ్రీవంగా  అమోదించింది.  ఈ బిల్లు ఆమోదం పొందటంతో ఎస్సీల జాబితాలో ఉన్న గోండులు ఎస్టీలలో చేరటంతోబాటు ఉత్తరప్రదేశ్ కోని నాలుగు మారుమూల జిల్లాలైన సంత్ కబీర్ నగర్, కుషినగర్, ఛందౌలి, భడోహి లోని   ధురియా, నాయక్, ఓఝా, పఠారి,  రాజ్ గోండ్ తెగలు  గిరిజనుల జాబితాలో చేరతాయి.

దీనికి సంబంధించి శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ, “ పేదరికంలో ఉన్న గిరిజనులు, తదితర వర్గాలవారికి తగిన గుర్తింపు నిచ్చి వారి  అభ్యున్నతికి పాటుపడాలని ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. అలా వెనుకబడిన వారిని వదిలేయకుండా ప్రధాన స్రవంతిలో కలపటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన తెగలవారికి న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యం. కంటికి కనిపించే స్థిరమైన ఫలితాలు రాబట్టటానికి కృషి జరుగుతోంది.  అందుకే, రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా భారతదేశణలోని అన్నీ ప్రాంతాల్లో ఉన్న లాంటివారికి ఇప్పుడు న్యాయం చేస్తున్నాం” అన్నారు.

                                                                         

********



(Release ID: 1886989) Visitor Counter : 184


Read this release in: English , Urdu , Hindi , Tamil