సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎస్సీ,ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడం కోసం ఒడిశాలోని మయూర్ భంజ్ లోని బరిపడాలో సదస్సు నిర్వహించిన నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్

Posted On: 27 DEC 2022 5:46PM by PIB Hyderabad

 వ్యవస్థాపక త్వం సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు ఎన్ఎస్ఎస్ హెచ్ పథకం,మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న  ఇతర పథకాలపై  అవగాహన కల్పించి, వ్యవస్థాపక సంస్కృతి ప్రోత్సహించడం కోసం ఒడిశాలోని మయూర్ భంజ్ లోని బరిపడాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఇ)  జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ (ఎన్ఎస్ఎస్హెచ్) సదస్సు నిర్వహించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ గిరీష్ చంద్ర ముర్ము మరియు ఎమ్ఎస్ఎంఇ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  కార్యక్రమంలో సుమారు ౭౦౦ మంది ఎస్సీ- ఎస్టీ ఔత్సాహిక వ్యవస్థాపకులు, ఇప్పటికే పరిశ్రమలు స్థాపించిన  వారు పాల్గొన్నారు.

 

ఈ సమావేశంలో శ్రీ ముర్ము ప్రసంగిస్తూ  స్థూల దేశీయోత్పత్తి మరియు మొత్తం ఎగుమతుల రంగంలో  సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు కీలక  పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కేంద్ర ఎమ్ఎస్ఎంఇ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ   మాట్లాడుతూ  తక్కువ పెట్టుబడితో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు  పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. గ్రామీణ , వెనుక బడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ కు ఎంఎస్ఎంఇ రంగం కీలక పాత్ర ను పోషిస్తుందని పేర్కొన్నారు. ఎంఎస్ఎమ్ఇ రంగంలో  సాధికారత సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలను ఆయన వివరించారు. ఈ సదస్సు  ద్వారా రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త లు వినూత్నమైన ఆలోచనలు, పరస్పర వ్యాపార అవకాశాలను అన్వేషించి, ఈ పథకాల నుంచి గరిష్ట ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు. 

 

భారతదేశ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం  సలహాదారు / శాస్త్రవేత్త 'జి' డాక్టర్ కేతకి బాపట్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సాంకేతిక సదస్సు జరిగింది.  ఔత్సాహిక మరియు ఇప్పటికే ఉన్న ఎస్సీ-ఎస్టీ వ్యవస్థాపకులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు , రుణ సంస్థలతో చర్చించడానికి సదస్సు అవకాశం కల్పించింది ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు,. సరఫరాదారులను గుర్తించడానికి, సేకరిస్తున్న ఉత్పత్తులు, సేవలు పొందడానికి తమ సంస్థ అనుసరిస్తున్న విధానం, ప్రక్రియ అంశాలను సంస్థల ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో యుకో బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ఆర్థిక సంస్థలు కూడా పాల్గొన్నాయి.   ఎంఎస్ఎంఇ రంగానికి సంబంధించిన వివిధ రుణ పథకాలను ఆర్థిక సంస్థల ప్రతినిధులు వివరించారు.  ఐఐటీ ఖరగ్పూర్, సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, భువనేశ్వర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వంటి శిక్షణా సంస్థలు కూడా స్టాల్ ఏర్పాటు చేసి వారి సాంకేతిక మరియు వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను  ఈ కార్యక్రమంలోవివరించారు. ఉదయం పధకంలో సులువుగా ఎస్సీ,ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకోవడానికి సదస్సులో ఏర్పాటు చేశారు.  . 

 

 

ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఒడిశా రాష్ట్ర  సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సమ్మిళిత వృద్ధి కోసం, ఎస్ సి-ఎస్ టి వర్గాలలో వ్యవస్థాపకత సంస్కృతిని ప్రోత్సహించడానికి ఎన్ఎస్ఎస్ హెచ్ పథకం కింద అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, సేకరణలో  4% ఉత్పత్తులను ఎస్సీ-ఎస్టీ వర్గాలకు చెందిన సంస్థల నుంచి తప్పనిసరిగా సేకరించాలన్న ఆదేశాలు కూడా సదస్సులో చర్చకు వచ్చాయి. 

***


(Release ID: 1886965) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Marathi , Hindi