విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు/ కేంద్రాలలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అభివృద్ధి, అమలు కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఇంధన మంత్రిత్వ శాఖ

Posted On: 27 DEC 2022 12:27PM by PIB Hyderabad

1. అవగాహన ఒప్పందం పై సంతకం చేసిన ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్, రక్షణ శాఖ కార్యదర్శి , డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్

2. హిమపాతం, కొండచరియలు, హిమానీనదాలు, హిమ నదీ సరస్సులు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో జరిగే నష్టాల నివారణకు అమలు చేయాల్సిన చర్యలపై   విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు డిఆర్డిఓ సంయుక్తంగా పనిచేస్తాయి.

3. కొండ ప్రాంతాల్లో ఉన్న జల విద్యుత్  ప్రాజెక్టులు/ విద్యుత్ కేంద్రాల్లో సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కూడా డిఆర్డిఓ యొక్క నైపుణ్యం ఉపయోగించబడుతుంది. 

... 

జల విద్యుత్  ప్రాజెక్టులు/ విద్యుత్ కేంద్రాలలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అమలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) తో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంఒయు పై విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి షి అలోక్ కుమార్, రక్షణ శాఖ కార్యదర్శి , డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ సంతకం చేశారు. 

 

ఒప్పందం కింద హిమపాతం, కొండచరియలు, హిమానీనదాలు, హిమనదీయ సరస్సులు మరియు ఇతర భౌగోళిక ప్రమాదాలకు వ్యతిరేకంగా తగిన ఉపశమన చర్యలను అభివృద్ధి చేయడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు డిఆర్డిఓ సంయుక్తంగా పనిచేస్తాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న జల ప్రాజెక్టులు/ పవర్ స్టేషన్ల కోసం సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కూడా డిఆర్డిఓ  నైపుణ్యం ఉపయోగించబడుతుంది.  ఈ ఎంఒయు కింద సంబంధిత ప్రాజెక్ట్ డెవలపర్లు,డిఆర్డిఓ  విస్తృత అవగాహనతో పనిచేసి  ప్రత్యేక మరియు నిర్దిష్ట అభివృద్ధి  పనులు అమలు చేయడం జరుగుతుంది. 

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ సూచనల మేరకు  జల విద్యుత్ ప్రాజెక్టులు ముఖ్యంగా కొండ ప్రాంతం ఎగువ ప్రాంతాల్లో ఉన్న వాటిలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (ఈడబ్ల్యూఎస్) అమలు చేయడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.  విపత్తు పర్యవేక్షణ, ముందస్తు అంచనా, విపత్తు ప్రమాద మదింపు, కమ్యూనికేషన్ మరియు ప్రమాదకర ఘటనలకు ముందస్తుగా విపత్తుల ప్రమాదాలను తగ్గించడానికి సకాలంలో చర్య తీసుకోవడానికి సంసిద్ధత  సమగ్ర వ్యవస్థగా ఈడబ్ల్యూఎస్ పనిచేస్తుంది. ఈడబ్ల్యూఎస్ అమలు కోసం సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ, ఐఎండీ, వీఐహెచ్ జీ, ఎన్ఆర్ఎస్సీ-ఇస్రోతో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

 

***

 



(Release ID: 1886861) Visitor Counter : 144