సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
డీఈపీడబ్ల్యూడీ కింద పనిచేస్తున్న జాతీయ సంస్థలు /సీఆర్ సీల్లో 2023 జనవరి 1 నుంచి దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ /డయాగ్నోస్టిక్స్ /ట్రీట్ మెంట్ ఫీజు రద్దు
అంగవైకల్యం శాతం తో సంబంధం లేకుండా వైకల్య ధృవపత్రాలు మరియు యుడిఐడి పోర్టల్ లో నమోదు చేసుకున్న వారికి కూడా ఈ ప్రయోజనం విస్తరించబడుతుంది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇతర ప్రభుత్వ సంస్థలకు యుడిఐడి కార్డును వికలాంగుల ప్రయోజనాలతో అనుసంధానించడానికి మార్గం సుగమం చేస్తుంది... కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్
Posted On:
24 DEC 2022 7:09PM by PIB Hyderabad
వికలాంగులందరికి జీవన సౌలభ్యం అందించి ఈ రంగంలో విద్య / పునరావాస నిపుణుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడానికి వికలాంగుల సాధికారత విభాగం (డిఇపిడబ్ల్యుడి) ఏర్పాటు అయ్యింది. అవసరమైన చర్యలు మరియు నిర్ణయాలు అమలు చేస్తున్న డిఇపిడబ్ల్యుడి నిరంతరం లక్ష్య సాధన కోసం కృషి చేస్తోంది.
దీనిలో భాగంగా 2023 జనవరి 1 నుంచి డీఈపీడబ్ల్యూడి కింద పనిచేస్తున్న అన్ని జాతీయ సంస్థలు (ఎన్ఐలు) (డిఇపిడబ్ల్యుడి కింద స్వయం ప్రతిపత్తి గల సంస్థలు) మరియు కాంపోజిట్ రీజినల్ సెంటర్ (సీఆర్సి) (ఎన్ఐల విస్తరణ విభాగాలు) లలో యుడిఐడి కార్డులు కలిగిన వారందరికీ రిజిస్ట్రేషన్ / డయాగ్నోస్టిక్స్ / చికిత్స ఫీజులు రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైకల్యం శాతం తో సంబంధం లేకుండా యుడిఐడి పోర్టల్ లో నమోదు చేసుకున్న వారికి 2023 జనవరి 1 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
అంతేకాకుండా, ఎన్ఐలు / సిఆర్సిలలో యుడిఐడి కార్డులు, వైకల్యం సర్టిఫికెట్ కలిగి యుడిఐడి పోర్టల్ లో నమోదు చేసుకున్న వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వైకల్యం శాతం తో సంబంధం లేకుండా పూర్తి కోర్సు ఫీజు మాఫీ చేయబడుతుంది. ఇది 2022-23 బ్యాచ్ విద్యార్థులు (రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కోర్సులు చేస్తున్న మరియు వారి 2 / 3 / 4 వ సంవత్సరంలో ఉన్న వారితో సహా) వర్తిస్తుంది.అంతేకాకుండా, ప్రతి ఎన్ఐ మరియు సిఆర్సిలు యుడిఐడి దరఖాస్తులను దాఖలు చేయడంలో పిడబ్ల్యుడిలకు సహాయపడటానికి ప్రత్యేక కౌంటర్ ను కలిగి ఉండాలని మరియు శని మరియు ఆదివారం కూడా వ్యక్తులందరికీ చికిత్స సౌకర్యాలు అందించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇతర ప్రభుత్వ సంస్థలకు యుడిఐడి కార్డును వికలాంగుల ప్రయోజనాలతో అనుసంధానించడానికి మార్గం సుగమం చేస్తుందన్నారు.
***
(Release ID: 1886444)
Visitor Counter : 186