ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డిజిటల్ అక్షరాస్యతకు ప్రోత్సాహం
Posted On:
23 DEC 2022 1:54PM by PIB Hyderabad
భారతదేశం గత ఏడు సంవత్సరాలుగా తన పౌరుల ప్రయోజనాల కోసం సాంకేతికతలను అమలు చేయడం మరియు వారి జీవితాలలో మార్పు తీసుకురావడానికి ప్రాముఖ్యతనిస్తోంది. ఈ విషయంలో భారత్ ప్రముఖ దేశంగా మారింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని పౌరులకు డిజిటల్ అక్షరాస్యత అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
దీనికి అనుగుణంగా, ప్రభుత్వం ఈ క్రింది విధంగా వివిధ చర్యలు చేపట్టింది:
i. 2014 నుండి 2016 సంవత్సరాలలో, భారత ప్రభుత్వం ప్రజలకు డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి “నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ (ఎన్డీఎల్ఎం)” మరియు “డిజిటల్ సాక్షరత అభియాన్ (దిశ)” అనే రెండు పథకాలను 52.50 లక్షల మంది (ఒకటి) సంచిత లక్ష్యంతో అమలు చేసింది. గ్రామీణ భారతదేశంతో సహా దేశవ్యాప్తంగా) అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి చెందిన వ్యక్తి లక్ష్యంగా దీనిని అమలు చేసింది. ఈ రెండు పథకాల కింద, మొత్తం 53.67 లక్షల మంది లబ్ధిదారులు శిక్షణ పొందారు. వీరిలో 42 శాతం మంది అభ్యర్థులు గ్రామీణ భారతదేశానికి చెందినవారు. ప్రస్తుతం ఈ రెండు పథకాలు ఇప్పుడు మూసివేయబడ్డాయి.
ii. 2017 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలను (ఇంటికి ఒక వ్యక్తి) కవర్ చేయాలనే లక్ష్యంతో గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతను ప్రారంభించేందుకు ''ప్రధాన్ మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ (పి.ఎం.జి.డి.ఐ.ఎస్.హెచ్.ఎ) '' పేరుతో ప్రభుత్వం ఒక పథకాన్ని ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు, మొత్తం 6.62 కోట్ల మంది అభ్యర్థులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. 5.68 కోట్ల మంది శిక్షణ పొందారు, వీరిలో 4.22 కోట్ల మంది అభ్యర్థులు దేశవ్యాప్తంగా పి.ఎం.జి.డి.ఐ.ఎస్.హెచ్.ఎ పథకం కింద ధ్రువీకరించబడ్డారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బాగా అవగాహన ఉన్న అనేక మంది యువకులు, ప్రతిభావంతులైన యువకులు పంచాయితీ స్థాయిలో గ్రామ స్థాయి వ్యవస్థాపకులు (వీఎల్ఈలు)గా ఉమ్మడి సేవా కేంద్రాలను (సీఎస్సీలను) ఏర్పాటు చేశారు. పి.ఎం.జి.డి.ఐ.ఎస్.హెచ్.ఎ పథకం మార్గదర్శకాల ప్రకారం అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సీఎస్సీలు, గ్రామీణ ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత శిక్షణను అందించడానికి కూడా ఆమోదించబడ్డాయి.
పి.ఎం.జి.డి.ఐ.ఎస్.హెచ్.ఎ. కింద ట్రైనర్ కావడానికి అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న యువత డిజిటల్ అక్షరాస్యత శిక్షణను అందించడానికి వీఎల్ఈ లచే నియమించబడ్డారు. అదనంగా, PMGDISHA పథకం కింద శిక్షణ పొందిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను కూడా డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడానికి సహాయం చేస్తున్నారు.
ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ సమాచారాన్ని అందించారు.
******
(Release ID: 1886298)
Visitor Counter : 162