పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

టికెట్ డౌన్‌గ్రేడ్ చేయడం వల్ల ప్రభావితమైన విమాన ప్రయాణికుల హక్కులను పరిరక్షించేందుకు తన నిబంధనలను సవరించే ప్రక్రియలో డీజీసీఏ

Posted On: 23 DEC 2022 2:19PM by PIB Hyderabad

భారతదేశంలో విమాన సేవలను వేగంగా విస్తరించడం, భారతదేశానికి/అంతర్జాతీయ మార్గాల్లో, ప్రయాణీకుల రద్దీ పెరుగుదల దృష్ట్యా, కొన్నిసార్లు ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులను (టికెట్లు) డౌన్‌గ్రేడ్ చేయడం గమనించాం . ఉదాహరకు, ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ లేదా ప్రీమియం ఎకానమీలో తన టిక్కెట్‌ను బుక్ చేసుకున్న ప్రయాణీకుడు, సీట్ సర్వీస్ చేయలేమనో, ఎయిర్‌క్రాఫ్ట్ మారిందనో, ఓవర్‌బుకింగ్ అయిందనో మొదలైన అనేక కారణాల వల్ల చెక్-ఇన్ సమయంలో దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితులకు సరైన పరిష్కారం చూపేందుకు, వారి టిక్కెట్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం ద్వారా ప్రభావితమైన విమాన ప్రయాణికుల హక్కులను రక్షించడానికి.డీజీసీఏ  తన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ (సిఏఆర్) సెక్షన్-3, సిరీస్ఎం పార్ట్ IV “నిరాకరించిన బోర్డింగ్విమానాల రద్దు మరియు విమానాల ఆలస్యం కారణంగా విమానయాన సంస్థలు ప్రయాణికులకు అందించాల్సిన సౌకర్యాలను సవరించే ప్రక్రియలో ఉంది. ." 

ఈ సవరణ వల్ల తన బుక్ చేసిన తరగతి టిక్కెట్ నుండి అసంకల్పితంగా డౌన్‌గ్రేడ్ కు గురయ్యే ప్రయాణీకుడు, ఎయిర్‌లైన్ నుండి వాపసుగా పన్నులతో సహా టిక్కెట్  పూర్తి విలువను స్వీకరించడానికి అనుమతిస్తుంది. అందుబాటులో ఉన్న తదుపరి తరగతిలో విమానయాన సంస్థ ప్రయాణీకులను ఉచితంగా తీసుకువెళుతుంది. అయితే, ఈ ప్రతిపాదనపై వాటాదారుల సంప్రదింపులు చేసి  తుది నియంత్రణ ప్రచురించి, కొత్త నియమాన్ని వర్తింపజేస్తారు. 

కింద పేర్కొన్న విధంగా పరిహారం అందించే సిఏఆర్ లో పేర్కొన్న ప్రస్తుత నిబంధనలు మారవు:

బోర్డింగ్ నిరాకరణ: 

 

క్రమ సంఖ్య  ఎటువంటి పరిస్థితుల్లో 

నష్టపరిహారం 

1

విమానంలో ఎయిర్‌లైన్ ఓవర్‌బుకింగ్ చేసినట్లయితే

ప్రయోజనాల మార్పిడి కోసం స్వచ్ఛందంగా ఇచ్చే వారిని  ఎయిర్‌లైన్ కోరుతుంది 

2

విమానంలో ప్రయాణించడానికి కంఫర్మ్డ్ బుకింగ్‌ ఉన్న ప్రయాణికుడిని విమానంలో బోర్డింగ్ నిరాకరించినట్లయితే

ఒరిజినల్ గా బయలుదేరిన 1 గంటలోపు విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తే పరిహారం ఉండదు

3

విమానంలో ప్రయాణించడానికి, ధృవీకరించబడిన బుకింగ్‌ను కాదని విమానయాన సంస్థ ప్రయాణీకుడికి బోర్డింగ్ నిరాకరించినట్లయితే

  • ప్రత్యామ్నాయ విమానం బయలుదేరిన అసలు సమయానికి  24 గంటలలోపు ఉంటే పరిహారం: వన్ వే ఛార్జీలో 200% + ఇంధన ఛార్జీ (గరిష్టంగా రూ. 10,000/-)
  • బయల్దేరాల్సిన అసలు సమయం కన్నా 24 గంటల తర్వాత ప్రత్యామ్నాయ విమానం అయితే పరిహారం: 400% వన్ వే ఛార్జీ + ఇంధన ఛార్జీ (గరిష్టంగా రూ. 20,000/-)
  • ఒకవేళ ప్రయాణీకుడు ప్రత్యామ్నాయ విమానాన్ని ఎంచుకోకపోతే: పూర్తి వాపసు మరియు 400% వన్ వే ఛార్జీ + ఇంధన ఛార్జీ (గరిష్టంగా రూ. 20,000/-)

 

విమానం రద్దు *

క్రమ సంఖ్య 

                  ఎటువంటి పరిస్థితుల్లో..  

                                          నష్టపరిహారం 

1

విమానయాన సంస్థ విమానాన్ని రద్దు చేయాలని భావిస్తే

విమానయాన సంస్థ కనీసం రెండు వారాల ముందుగానే ప్రత్యామ్నాయ విమానాన్ని తెలియజేయాలి & ఏర్పాటు చేయాలి

2

ఎయిర్‌లైన్ బుక్ చేసిన ఫ్లైట్‌కి రెండు వారాల కంటే ముందు మరియు 24 గంటల వరకు విమానాన్ని రద్దు చేస్తే

ఎయిర్‌లైన్ బయలుదేరే అసలు సమయానికి 2 గంటలలోపు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తుంది లేదా టిక్కెట్‌ను తిరిగి చెల్లించాలి.

3

బుక్ చేసిన ఫ్లైట్‌లో 24 గంటల కంటే తక్కువ సమయంలో ఎయిర్‌లైన్ విమానాన్ని రద్దు చేస్తే

ఎయిర్‌లైన్స్ విమాన టిక్కెట్‌ను రీఫండ్ చేసి ఈ క్రింది విధంగా పరిహారం అందించాలి:

  • బ్లాక్ టైం  1 గం. లోపైతే : వన్ వే ఛార్జీ + ఇంధన ఛార్జీ (గరిష్టంగా రూ. 5,000/-)
  • గంట-రెండు గంటల మధ్య బ్లాక్ టైం అయితే  : వన్ వే ఛార్జీ + ఇంధన ఛార్జీ (గరిష్టంగా రూ. 7,000/-)
  • బ్లాక్ టైం 2 గంటల కన్నా ఎక్కువైతే : వన్ వే ఛార్జీ + ఇంధన ఛార్జీ (గరిష్టంగా రూ. 10,000/-)

* ఫోర్స్ మేజర్ ఈవెంట్ విషయంలో ఎటువంటి బాధ్యత లేదు.

****(Release ID: 1886287) Visitor Counter : 84


Read this release in: English , Urdu , Hindi , Malayalam