కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికాం పరికరాల తయారీ సంస్థలకు మార్కెట్ మద్దతును అందించడానికి నిపుణుల బృందం
Posted On:
23 DEC 2022 1:27PM by PIB Hyderabad
చైనా నుంచి టెలికాం పరికరాల దిగుమతికి సంబంధించి టెలికాం పరికరాల తయారీ సంస్థల నుంచి ఫిర్యాదులు అందాయి. పరికరాలను సమకూర్చుకునే వేలంలో పాల్గొనడానికి అర్హత పొందేందుకు, స్థాపిత లేదా భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునే దేశాల్లో ప్రయోజనకరమైన యాజమాన్యాన్ని కలిగి ఉన్న కంపెనీల నమోదును భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అలాగే, దిగుమతి చేసుకున్న వస్తువుల గురించి తప్పుడు సమాచారం అందించడాన్ని నివారించడానికి హెచ్‌ఎస్ కోడ్‌లను క్రమబద్ధీకరించడానికి, వర్గీకరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ), ప్రజా సేకరణలు (భారత్‌లో తయారీకి ప్రాధాన్యత) (పీపీపీ-ఎంఐఐ) వంటి పథకాల ద్వారా దేశీయ టెలికాం తయారీ పరిశ్రమ ప్రోత్సాహకాలు అందుకుంటోంది. దేశంలో టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం పీఎల్‌ఐ పథకం లక్ష్యం. అదే సమయంలో పీపీపీ-ఎంఐఐ విధానం దేశీయ తయారీదారులకు ప్రజా సేకరణల విషయంలో ప్రాధాన్యత ఇస్తుంది. దేశీయంగా తయారైన పరికరాల ఎగుమతిని ప్రోత్సహించే చర్యలను సిఫార్సు చేసేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం ఒక నిపుణుల కమిటీని నియమించింది.
10.03.2021న, టెలికాం లైసెన్స్‌లలో ఒక సవరణను టెలికమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసింది. లైసెన్స్‌దారులంతా తమ టెలికాం నెట్‌వర్కుల ద్వారా విశ్వసనీయ ఉత్పత్తులను మాత్రమే 15.06.2021 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని ఆ సవరణలో ఆదేశించడం జరిగింది. టెలికమ్యూనికేషన్ పరికరాలు విశ్వసనీయ ఉత్పత్తులో, కాదో అంచనా వేయడానికి, లైసెన్సుదార్లకు తెలియజేయడానికి వీలు కల్పించేలా ఒక పోర్టల్‌ను (www.trustedtelecom.gov.in) కూడా ప్రారంభించడం జరిగింది.
రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ ఇవాళ ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1886102)
Visitor Counter : 118