బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎన్‌ఎల్‌సి ఇండియా హాస్పిటల్‌లో అత్యాధునిక కార్డియాక్ సెంటర్‌కు ప్రారంభోత్సవం
प्रविष्टि तिथि:
23 DEC 2022 11:43AM by PIB Hyderabad
ఎల్‌ఎల్‌సి ఇండియా హాస్పిటల్‌లో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌తో కూడిన కొత్త హై ఎండ్ కార్డియాక్ సెంటర్‌ను ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ సిఎండీ శ్రీ రాకేష్ కుమార్ ప్రారంభించారు.
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ఏకైక అధునాతన క్యాథ్ ల్యాబ్ ఇది. ఎన్‌ఎల్‌సి ఇండియా హాస్పిటల్ మరియు వాటాదారులచే సూచించబడిన రోగులకు కార్డియాలజీ ఔట్ పేషెంట్ సేవలు మరియు ఇన్‌పేషెంట్ చికిత్సను ఈ కేంద్రం అందిస్తుంది. కరోనరీ యాంజియోగ్రామ్, ఎమర్జెన్సీ మరియు ఎలక్టివ్ కరోనరీ పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ, పేస్-మేకర్ ఇంప్లాంటేషన్ వంటి చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

అన్ని వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి కేంద్రం సన్నద్ధమవుతుంది. క్యాథ్ ల్యాబ్ అన్ని సౌకర్యాలతో (3 ఈఆర్, 6 సిసియు, 2 రికవరీ, 5 వార్డులు, 6 సెమీ ప్రైవేట్ మరియు 3 సింగిల్ రూమ్ బెడ్‌లు) 25 పడకల కార్డియాక్ సౌకర్యంతో ఏర్పాటు చేయబడింది. వచ్చే నెల నాటికి ఈ సదుపాయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
నెయ్‌వేలి టౌన్‌షిప్ ఏరియాలో ఐపీ ఆధారిత నిఘా వ్యవస్థ ప్రాజెక్ట్‌ను సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లో శ్రీ కుమార్ ప్రారంభించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా నెయ్‌వేలి టౌన్‌షిప్‌లో భద్రతను మెరుగుపరచడం ఈ వ్యవస్థ యొక్క లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 13.40 కోట్ల వ్యయంతో 322 బుల్లెట్ కెమెరాలు మరియు 14 ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ కెమెరాలు, వ్యూహాత్మక మరియు కీలకమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయబడ్డాయి.
****
(रिलीज़ आईडी: 1886101)
आगंतुक पटल : 134