యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖేలో ఇండియా పథకం కింద 21 క్రీడా విభాగాల్లో దేశవ్యాప్తంగా 2841 మంది క్రీడాకారులు ఖేలో ఇండియా అథ్లెట్లుగా ఎంపిక: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
ఖేలో ఇండియా అథ్లెట్లు ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ ఛాంపియన్‌షిప్‌లు / ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో ప్రదర్శించిన ఆట తీరు ద్వారా ఎంపిక
సాయ్ నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్టల్ ద్వారా ప్రాధాన్యత కలిగిన క్రీడా విభాగాలలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడానికి ఒక వేదికను అందుబాటులోకి
రాజ్యసభలో శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడి
Posted On:
22 DEC 2022 3:39PM by PIB Hyderabad
ఖేలో ఇండియా స్కీమ్ “స్పోర్ట్స్ కాంపిటీషన్ అండ్ టాలెంట్ డెవలప్‌మెంట్” కాంపోనెంట్ కింద, అథ్లెట్లు ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ ఛాంపియన్‌షిప్‌లు / ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో వారి ప్రదర్శన ఆధారంగా ఖేలో ఇండియా అథ్లెట్లుగా ఎంపిక అయ్యారు. ఇంకా, నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్టల్ ద్వారా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడానికి ఒక వేదికను అందిస్తుంది, దీనిలో దేశానికి ప్రయోజనాలు ఉన్న ప్రాధాన్యత కలిగిన క్రీడా విభాగాల్లో ఉన్నాయి. గుర్తించిన క్రీడాకారులు జాతీయ/అంతర్జాతీయస్థాయికి ఎదగడానికి, రాణించడానికి వివిధ శిక్షణా సౌకర్యాలలో అనుభవజ్ఞులైన కోచ్‌ల మార్గదర్శకత్వం ఉంటుంది.
ప్రస్తుతం, ఖేలో ఇండియా స్కీమ్ కింద 2841 మంది క్రీడాకారులు దేశవ్యాప్తంగా 21 క్రీడా విభాగాల్లో ఖేలో ఇండియా అథ్లెట్లుగా ఎంపికయ్యారు.
*******
(Release ID: 1885997)