ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

సామాజిక ప్రయోజనానికి ఏఐకి నాణ్యమైన వ్యక్తిగతేతర డేటా ప్రాముఖ్యతను తెలియజేసిన ఏంఈఐటివై ఏఐ పే చర్చ

Posted On: 22 DEC 2022 9:12AM by PIB Hyderabad

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి డేటా ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఆలోచనపై దృష్టి సారించిన ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (ఏంఈఐటివై) నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఇజీడి) ఇటీవల ఏఐ పే చర్చ (ఏఐ డైలాగ్)ని నిర్వహించింది. దీనిలో ఏఐకి నాణ్యమైన డేటాసెట్‌లను యాక్సెస్ చేయడానికి ప్రాముఖ్యత మరియు విధానాల గురించి ప్యానెలిస్ట్‌లు చర్చించారు.

ఈ సెషన్‌కు ఎన్‌ఇజీడి ప్రెసిడెంట్ మరియు సీఈఓ శ్రీ అభిషేక్ సింగ్ అధ్యక్షత వహించారు. విభిన్న నేపథ్యాల నుండి మాట్లాడిన ప్రభుత్వ అధికారులు, ఏఐ ఔత్సాహికులు, ఏఐ అభ్యాసకులు, యువత మరియు ఉత్ప్రేరకీకరణలో డేటా పాత్రను అర్థం చేసుకోవాలనుకునే వారి కోసం ఒక ఆకర్షణీయమైన సదస్సు జరిగింది. ఈ సెషన్‌కు సంబంధించిన ప్యానెలిస్ట్‌లలో శ్రీ శ్రీకాంత్ వెలమకన్ని, గ్రూప్ సీఈఓ ఫ్రాక్టల్ అనలిటిక్స్, శ్రీ గౌరవ్ గోధ్వానీ, డైరెక్టర్ & కో-ఫౌండర్, సివిక్‌డాటాల్యాబ్స్‌, శ్రీ. ఉమాకాంత్ సోనీ, సహ వ్యవస్థాపకులు మరియు సిఈఓ ఏఆర్‌టి పార్క్‌ పాల్గొన్నారు.

శ్రీ అభిషేక్ సింగ్ తన ప్రారంభ వ్యాఖ్యలలో నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ పాలసీతో  పాటు నాణ్యమైన డేటాసెట్‌ల లభ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక కార్యక్రమాలను వివరించారు. కృత్రిమ మేధస్సు కోసం డేటా యొక్క ప్రాముఖ్యతను తెలిపారు.

ప్రముఖ ప్యానెలిస్ట్‌లు ప్రస్తుత ఓపెన్ డేటా ఎకోసిస్టమ్, ఏఐకి నాణ్యమైన డేటాసెట్‌లకు యాక్సెస్‌ను అందించడంలో సవాళ్లు, ఆవిష్కరణల కోసం డేటాను బాధ్యతాయుతంగా ఉపయోగించడంలో వివిధ వాటాదారుల పాత్ర మరియు భారతదేశం ముందుకు వెళ్లే మార్గం గురించి మాట్లాడారు.

థీమ్  సారాంశాన్ని అనుసరించి ఇటీవల విడుదల చేసిన నివేదిక “అన్‌లాకింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియాస్ ఓపెన్ డేటా” కూడా ఈ సెషన్‌లో చర్చించబడింది. నాస్కామ్‌, ఏంఈఐటివై మరియు పరిశ్రమ భాగస్వాములైన ఫ్రాక్టల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఐడిఎఫ్‌సి ఇన్స్టిట్యూట్, టిసీఎస్, అమెజాన్‌లు 2021లో భారతదేశ ఓపెన్ గవర్నమెంట్ డేటా యొక్క సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి మార్గాలను సూచించడానికి డేటా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి.

డేటా టాస్క్‌ఫోర్స్‌కు అధ్యక్షత వహించిన శ్రీ శ్రీకాంత్ వెలమకన్ని గత 6 నెలలుగా టాస్క్‌ఫోర్స్  అవలోకనాన్ని అలాగే కీలక అంశాలను పంచుకున్నారు. బహిరంగ ప్రభుత్వ డేటాను విధాన ప్రాధాన్యతగా మార్చడం; అధిక విలువ డేటాసెట్‌లపై దృష్టి సారించడం, డేటా అధిక వర్గీకరణను నివారించడానికి మరియు అంతర్జాతీయ ప్రమాణాలు మరియు సాధనాలను స్వీకరించడాన్ని నివారించడానికి సహేతుకమైన డేటా వర్గీకరణ విధానాలను వర్తింపజేయడం వంటి అంశాల ప్రాముఖ్యతను తెలిపారు.

శ్రీ గౌరవ్ గోధ్వానీ ఓపెన్ డేటా ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడంలో తన అనుభవం గురించి మరియు ఓపెన్ యాక్సెస్‌లో అధిక-నాణ్యత డేటాసెట్‌లకు సోర్సింగ్, క్యూరేటింగ్ మరియు యాక్సెస్‌ను నిర్ధారించడంలో ఉన్న సవాళ్ల గురించి మాట్లాడారు. భారత ప్రభుత్వ దార్శనికత మరియు త్వరలో ప్రారంభించబోయే ఇండియా డేటా ప్లాట్‌ఫారమ్‌తో ముందుకు సాగే మార్గాన్ని వివరించారు.

శ్రీ ఉమాకాంత్ సోనీ డేటాకు సంబంధించి వర్ధమాన ఏఐ కంపెనీలు మరియు ఆవిష్కర్తలు  ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సవాళ్ల గురించి మాట్లాడారు. విస్తారమైన నాణ్యమైన డేటాసెట్‌లకు అవకాశం లేకపోవడం ఏఐ పరిష్కారాల వాణిజ్యీకరణ మరియు స్కేలింగ్‌కు నిరోధకంగా ఎలా పనిచేస్తుందో  వివరించారు. భారతదేశంలో ఏఐ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి అవసరమైన సిఫార్సులను అందించారు.

ఈ సెషన్‌ను వీక్షించవచ్చు:

ఏఐ పే చర్చ  సిరీస్ రెస్పాన్స్‌బుల్‌ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్‌మెంట్ (రైజ్‌)లో భాగంగా ప్రారంభించబడింది. ఇది భారతదేశానికి చెందిన మొట్టమొదటి గ్లోబల్ ఏఐ సమ్మిట్. దీనిని 2020లో ఏంఇఐటివై నిర్వహించింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఈ తరహా కార్యక్రమాలు  అవసరమైన ప్రారంభాన్ని అందించాయి. ఏఐతో పాటు మొత్తం ఆర్థిక మరియు సామాజిక రంగంలో నిర్దిష్ట సానుకూల, స్పష్టమైన అర్థవంతమైన మార్పులకు దారి తీస్తుంది.


 

***



(Release ID: 1885790) Visitor Counter : 114