జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అందరికీ అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు

Posted On: 22 DEC 2022 3:22PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌ను (గ్రామీణ్‌) [ఎస్‌బీఎం(జీ)] 2 అక్టోబర్ 2014 నుంచి ప్రారంభించింది. దేశ గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు మరుగుదొడ్లను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్రాంతాలుగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఎస్‌బీఎం(జీ) కింద, గ్రామీణ కుటుంబాల కోసం వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు (ఐహెచ్‌హెచ్‌ఎల్‌) నిర్మించడం జరిగింది, ఆ ఇంటి మహిళలు సహా అందరు కుటుంబ సభ్యులు ఉపయోగించుకుంటారు. ఆన్‌లైన్ సమీకృత నిర్వహణ సమాచార వ్యవస్థ (ఐఎంఐఎస్‌) ద్వారా రాష్ట్రాలు/యూటీలు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమం కింద 11 కోట్లకు పైగా ఐహెచ్‌హెచ్‌ఎల్‌లు నిర్మించడం జరిగింది. దేశంలోని గ్రామాలన్నీ ఇప్పటికే ఓడీఎఫ్‌లుగా స్వయంగా ప్రకటించుకున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2022 ప్రకారం, దేశంలో, మహిళలు ఉన్న కుటుంబాలు సహా 95.4% గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి.

ఐహెచ్‌హెచ్‌ఎల్‌ నిర్మించడానికి స్థలం లేని కుటుంబాలకు, వలస జనాభా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండే ప్రదేశాల్లో పారిశుద్ధ్య అవసరాల తీర్చడం కోసం, గ్రామ పంచాయతీలు సామూహిక మరుగుదొడ్లను నిర్మించేందుకు ఎస్‌బీఎం(జీ) మార్గదర్శకాలు అందించింది. అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా, తగిన నీటి లభ్యత ఉన్న అనువైన ప్రదేశంలో నిర్మించేలా మార్గదర్శకాలు ఇచ్చింది. సీఎస్‌సీలలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా సౌకర్యాలు కూడా ఉండాలి. రాష్ట్రాలు/యూటీలు నివేదించిన ప్రకారం, ఈ కార్యక్రమం కింద 2.19 లక్షల సీఎస్‌సీలు నిర్మించడం జరిగింది.

కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇవాళ ఈ సమాచారాన్ని లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో తెలిపారు.

 

***


(Release ID: 1885779)
Read this release in: English , Urdu , Tamil