కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మారుమూల గ్రామాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటు

Posted On: 21 DEC 2022 2:46PM by PIB Hyderabad

మార్చి 2022 నాటికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టి.ఎస్.పిలు), టెలికాం శాఖ ఫీల్డ్ యూనిట్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందిన సమాచారం ప్రకారం దేశంలోని 6,44,131 గ్రామాలకు  (గ్రామాలు నవంబర్ 2019 నాటికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారంగాను దాదాపు 6,05,230 గ్రామాలకు మొబైల్ కవరేజీని ఉంది. 38,901 గ్రామాలు మొబైల్ టవర్లు మరియు కవరేజీని కలిగి లేవుప్రభుత్వం మరియు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టి.ఎస్.పిలుదేశంలో దశలవారీగా టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీని అందిస్తాయియూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యు.ఎస్.ఎఫ్.నిధుల ద్వారా ప్రభుత్వం దేశంలోని అన్ని కనెక్టివిటీ లేని  గ్రామాలలో మొబైల్ నెట్వర్క్ కవరేజీని అందించడానికి వివిధ పథకాలను అమలు చేస్తోందిప్రధాన యు.ఎస్.ఎఫ్. ప్రధాన పథకాలు కింది విధంగా ఉన్నాయి:

• దేశవ్యాప్తంగా కనెక్టివిటీ లేని గ్రామాలలో 4జీ మొబైల్ సేవల సంతృప్తతప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 26,316 కోట్లు

• లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం (ఎల్.డబ్ల్యుఈప్రభావిత ప్రాంతాల్లో 4జీ మొబైల్ సేవలను అందించడం దశ-II. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2211 Cr.

• అన్ని ఎల్.డబ్ల్యుఈ ఫేజ్-I సైట్ 2జీ నుండి 4జీ మొబైల్ టెక్నాలజీకి అప్గ్రేడేషన్ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2425 కోట్లు.

• ఎన్..ఆర్ కోసం సమగ్ర టెలికాం అభివృద్ధి కార్యక్రమం కింద దేశంలోని ఈశాన్య ప్రాంతంలో 4జీ మొబైల్ సేవలను అందించడంపథకాల అంచనా వ్యయం రూ. 3637 కోట్లు.

• ఆస్పిరేషనల్ జిల్లాలలోని 7,287గ్రామాల్లో  (ఆంధ్రప్రదేశ్ఛత్తీస్గఢ్జార్ఖండ్మహారాష్ట్ర మరియు ఒడిశా) 4జీ మొబైల్ కనెక్టివిటీని అందించడం మరియు నాలుగు రాష్ట్రాల్లో (అవి ఉత్తరప్రదేశ్బీహార్మధ్యప్రదేశ్ & రాజస్థాన్ఆస్పిరేషనల్ జిల్లాల్లోని 502 కనెక్టివిటీ లేదని కనుగొనిన గ్రామాలలో 4G మొబైల్ కనెక్టివిటీని అందించడం). ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 7152 కోట్లు.

 

• జమ్ము మరియు కాశ్మీర్లద్ధాఖ్హిమాచల్ ప్రదేశ్ఉత్తర ప్రదేశ్బీహార్రాజస్థాన్గుజరాత్ఉత్తరాఖండ్సరిహద్దు ప్రాంతం & ఇతర ప్రాధాన్యతా ప్రాంతాలలోని 354 గ్రామాల్లో 4జీ మొబైల్ కనెక్టివిటీని అందించడంప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 337 కోట్లు

• అండమాన్ & నికోబార్ దీవులలో గుర్తించి 85 గ్రామాలలో 4జీ మొబైల్ కవరేజీ మరియు ఎన్.హెచ్223 యొక్క నిరంతరపు 4జీ మొబైల్ కవరేజీని అందించడంప్రాజెక్టు అంచనా వ్యయం 130 కోట్లుఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ మరియు బండా జిల్లాల కోసం బి.ఎస్.ఎన్.ఎల్ మొబైల్ టవర్ల ఏర్పాటు కోసం ప్రజల నుండి ఎటువంటి డిమాండ్ పెండింగ్లో లేదుచిత్రకూట్ జిల్లాలోని 657 గ్రామాలలో, 635 గ్రామాలకు మొబైల్ నెట్వర్క్‌ కవరేజ్లో ఉన్నాయి. 22 గ్రామాలు యు.ఎస్.ఎఫ్. పథకాల కింద మొబైల్ కనెక్టివిటీతో కవర్ చేయబడుతున్నాయిబందా జిల్లాలోని మొత్తం 734 గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ ఉందిరాజస్థాన్ రాష్ట్రంలో 46,077 గ్రామాలకు గాను 42,761 గ్రామాలు మొబైల్ కవరేజీని కలిగి ఉన్నాయిమిగిలిన గ్రామాలకు దశలవారీగా ప్రభుత్వం మరియు టి.ఎస్.పి లచే కవరేజీ అందించబడుతున్నాయి. 5జీ స్పెక్ట్రమ్ వేలం మరియు లైసెన్స్ షరతుల కోసం 15-06-2022 నాటి నోటీసు ఆహ్వానిత దరఖాస్తు (ఎన్ఐఏప్రకారంకేటాయింపు తేదీ నుండి దశలవారీగా ఐదేళ్ల వ్యవధిలో రోల్ అవుట్ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందితప్పనిసరి రోల్అవుట్ బాధ్యతల కంటే మొబైల్ నెట్వర్క్ విస్తరణటి.ఎస్.పిల సాంకేతిక-వాణిజ్య పరిశీలనపై ఆధారపడి ఉంటుంది.  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ మరియు బందా జిల్లాలతో సహా దేశంలో దశలవారీగా 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి రోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్  సమాచారాన్ని అందించారు.

    ****


(Release ID: 1885700) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Tamil