కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
6జీ సాంకేతికత
Posted On:
21 DEC 2022 2:47PM by PIB Hyderabad
2021 నవంబర్ 1వ తేదీన, వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, పరిశోధన & అభివృద్ధి సంస్థలు, విద్యాసంస్థలు, ప్రామాణికత సంస్థలు, టెలికాం సేవల కంపెనీలు, పరిశ్రమకు చెందిన సభ్యులతో 6జీ మీద ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్‌ను (టీఐజీ-6జీ) కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం ఏర్పాటు చేసింది. భారతదేశంలో 6జీ దృక్పథం, లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ బృందం బాధ్యత. టెలికాం పరిశ్రమ, విద్యాసంస్థలు, ఆర్&డి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సభ్యులతో ఆరు కార్యనిర్వాహక బృందాలను టీఐజీ-6జీ ఏర్పాటు చేసింది. బహుళాంశ సృజనాత్మక పరిష్కారాలు, బహుళాంశ తర్వాతి తరం నెట్‌వర్క్‌లు, తర్వాతి తరం అవసరాలకు తగ్గ స్పెక్ట్రం, పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, పరిశోధన & అభివృద్ధి సంస్థలకు నిధులు అంశాల మీద ఈ ఆరు కార్యనిర్వాహక బృందాలు ఏర్పాటయ్యాయి. 6జీని ఆచరణలోకి తీసుకొచ్చే కార్యక్రమాల్లో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్‌కు (ఐటీయూ) కూడా భారతదేశం సహకారం అందిస్తోంది.
లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ ఇవాళ లోక్‌సభకు ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1885466)