అణుశక్తి విభాగం
కుదంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌కు మరింత అధునాతన ఇంధన ఎంపికను రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని అణు ఇంధన సంస్థ రోసాటమ్ అందిస్తున్నట్టు తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
టివిఎస్-2ఎం ఫ్యూయెల్ అసెంబ్లీల తొలి బ్యాచ్‌ను మే-జూన్ 2022న రష్యా నుంచి పొంది, కుదంకుళం ప్లాంట్ యూనిట్-1లో లోడ్ చేయగా, అవి సంతృప్తికరంగా పని చేస్తున్నాయి
Posted On:
21 DEC 2022 1:19PM by PIB Hyderabad
కుదంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌కు మరింత అధునాతన ఇంధన ప్రత్యామ్నాయాన్ని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని అణు ఇంధన కార్పొరేషన్ రోసాటామ్ ఇచ్చేందుకుముందుకు వచ్చినట్టు కేంద్ర శాస్త్ర&సాంకేతిక (ఇండిపెండెంట్ చార్జి) సహాయమంత్రి, ఎర్త్ సైన్సెస్ (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయమంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ , సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శామంత్రిత్వశాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
బుధవారంనాడు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, తొలి టివిఎస్-2ఎం ఫ్యూయెల్ అసెంబ్లీస్ (సన్నని పొడవైన ఇంధన కడ్డీల) ను మే-జూన్ 2022లో రష్యన్ ఫెడరేషన్ నుంచి అందుకుని, యూనిట్ -1లో లోడ్ చేశారని, అవి సంతృప్తికరంగా పని చేస్తున్నాయని తెలిపారు.
కెకెఎన్‌పిపి రియాక్టర్లలో ప్రస్తుతం యూనిట్ -2లో ఉపయోగిస్తున్న యుటివిఎస్ ఫ్యూయెల్ అసెంబ్లీతో 12 నెలల నిర్వహణా ఆవృతాలకు బదులుగా 18 నెలల నిర్వహణ ఆవృతాలకు టివిఎస్-2 ఎం ఫ్యూయెల్ అసెంబ్లీలు అనుమతిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
కుదంకుళం యూనిట్ 1& 2 రియాక్టర్లలో ఉపయోగిస్తున్న యుటివిఎస్ రకానికి బదులుగా మరింత అధునాతన ఇంధనం, అనగా టివిఎస్-2ఎం రకాన్ని ఇచ్చేందుకు రష్యా అంగీకరించిందని మంత్రి తెలిపారు. నిపుణులతో వివరణాత్మక చర్చల తర్వాత, టివిఎస్-2ఎం రకం ఫ్యూయెల్ అసెంబ్లీల మెరుగైన నిర్వహణా పనితీరును పరిగణనలోకి తీసుకున్న తర్వాత కుదంకుళం యూనిట్లు 1 &2లో యుటివిఎస్ అసెంబ్లీల స్థానంలో టివిఎస్-2ఎం ఇంధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.
***
(Release ID: 1885465)
Visitor Counter : 196