ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్లౌడ్ ఆధారిత వెబ్ యాక్సెసబిలిటీ రిపోర్టింగ్ సొల్యూషన్ పై ఇన్నోవేషన్ ఛాలెంజ్విజేతల సన్మాన వేడుకను నిర్వహించిన ఎన్ ఐ సి

Posted On: 21 DEC 2022 11:55AM by PIB Hyderabad

*అవార్డులు పొందిన స్టార్ట్-అప్‌లను సత్కరించిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ , వికలాంగుల సాధికారత శాఖ కార్యదర్శులు

 

*వెబ్ యాక్సెసబిలిటీ రిపోర్టింగ్ సొల్యూషన్ 'సుగమ్య వెబ్' ను అభివృద్ధి చేసినందుకు ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను గెలుచుకున్న సుమటక్ టెక్నాలజీస్ ఎల్ ఎల్ పి,

 

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) క్లౌడ్-ఆధారిత వెబ్ యాక్సెసిబిలిటీ రిపోర్టింగ్ సొల్యూషన్ అభివృద్ధి కోసం డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద జరిగిన ఇన్నోవేషన్ ఛాలెంజ్ సన్మాన వేడుకను నిర్వహించింది.

 

వికలాంగుల సాధికారత శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అమిత్ అగర్వాల్, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ రాజేష్ గెరా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుశీల్ పాల్, ఎన్ఐసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అల్కా మిశ్రా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, మార్గదర్శకులు, జ్యూరీ సభ్యులు, భాగస్వామ్య స్టార్టప్ లు ,పరిశ్రమకు చెందిన వాటాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించుకొని స్టార్టప్ ల యువ బృందాలు చేపట్టే ఇటువంటి చొరవలు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి సహాయపడతాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ అన్నారు.

 

వికలాంగుల సాధికారత విభాగం కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ ఛాలెంజ్ లో పాల్గొన్న వారి చిత్తశుద్ధి ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ రకమైన ఆవిష్కరణ సవాళ్లు వికలాంగుల కోసం స్వదేశీ డిజిటల్ సాధనాలు ,పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో సహాయ పడతాయని అన్నారు. ఈ సవాళ్లు విస్తారమైన , అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కు సేవ చేయడానికి ,ప్రయోజనం చేకూర్చే దేశీయ మేధో సంపత్తి (ఐపి) తో ప్రపంచ ప్రభావాన్ని సృష్టించడానికి భారతదేశానికి సహాయపడతాయి.

 

వికలాంగుల సాధికారత శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్, ఎలక్ట్రానిక్స్ ,ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ విజేతలను సత్కరించారు ఆదర్శప్రాయమైన ,సృజనాత్మక ప్రయత్నాలకు గానూ షార్ట్ లిస్ట్ చేసిన స్టార్టప్ లకు ప్రోత్సాహం తెలిపారు.

 

(క్లౌడ్ ఆధారిత వెబ్ యాక్సెసబిలిటీ రిపోర్టింగ్ సొల్యూషన్ పై ఇన్నోవేషన్ ఛాలెంజ్ విజేతలను సత్కరిస్తున్న ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ వికలాంగుల సాధికారత శాఖల కార్యదర్శులు )

 

వినూత్న ఆలోచనలఆధారంగా ఐదు స్టార్టప్ లను నిపుణులతో కూడిన ఎంపిక బృందం షార్ట్ లిస్ట్ చేయగా, బహుళ దశల ఛాలెంజ్ తరువాత గ్రాండ్ జ్యూరీ తుది విజేతను ఎంపిక చేసింది.

 

ఎంవిపి (కనీస ఆచరణీయ ఉత్పత్తి) ను అభివృద్ధి చేయడానికి ఐడియాషన్ దశలో 5 టీమ్ లను షార్ట్ లిస్ట్ చేశారు మరియు ఫంక్షనల్ ప్రొడక్ట్ ను రూపొందించడానికి 2 టీమ్ లు ఎంపిక చేయబడ్డాయి.

 

కనీస ఆచరణీయ ఉత్పత్తి (మినిమం వయబుల్ ప్రొడక్ట్- ఎంవిపి) ని అభివృద్ధి చేయడానికి, ఐడియేషన్ దశలో ఐదు టీమ్ లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఫంక్షనల్ ప్రొడక్ట్ ను రూపొందించడానికి రెండు టీమ్ లను ఎంపిక చేశారు.

 

షార్ట్ లిస్ట్ చేయబడ్డ టీమ్ లు:

 

*సుమతక్ టెక్నాలజీస్ ఎల్ఎల్ పి

*యు ఐ ఎ ఐ టెక్నాలజీస్ ఎల్ఎల్ పి

*ఎస్ ఎ ఐ వి బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్

*ఐ ఎస్ టి ఇ ఎం ప్రైవేట్ లిమిటెడ్

*ఇన్ స్టంట్ పోస్ట్ ప్రింటర్స్ అండ్ స్కానర్స్ ప్రైవేట్ లిమిటెడ్

 

స్టార్టప్ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించే స్ఫూర్తితో, ఆరు నెలల్లో వారి పరిష్కారాన్ని (సొల్యూషన్) మెరుగుపరచడానికి , స్వీకరించడానికి ,పరిగణించడానికి, మళ్లీ సమర్పించడానికి రన్నర్ అప్ లను అనుమతించాలని జ్యూరీ నిర్ణయించింది.

 

దివ్యాంగులకు వికలాంగులకు సార్వత్రిక ప్రవేశ లభ్యత కోసం ఉద్దేశించిన దేశవ్యాప్త ప్రచారం - యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ (సుగమ్య భారత్ అభియాన్) కు అనుగుణంగా ఈ సవాలు ఉంది.

 

వివరాలు https://guidelines.india.gov.in

వద్ద చూడవచ్చు.

 

సుమతక్ టెక్నాలజీస్ ఎల్ ఎల్ పి ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ విజేత. టెస్టింగ్ రిపోర్టింగ్ ద్వారా ప్రభుత్వ సంస్థలకు తమ వెబ్ ఉనికి స్థితిని తనిఖీ చేయడానికి అధికారం ఇచ్చే వెబ్ యాక్సెసబిలిటీ రిపోర్టింగ్ సొల్యూషన్ 'సుగమ్య వెబ్' ను ఈ బృందం అభివృద్ధి చేసింది. ఈ సొల్యూషన్ జి ఐ జి డబ్ల్యు వంటి అంతర్జాతీయ ,జాతీయ ప్రమాణాల ఆధారంగా అభివృద్ధి చేయబడింది. ఇంకా వెబ్ సైట్ ప్రవేశ స్థితిపై ఖచ్చితమైన నివేదికను అందిస్తుంది. వెబ్ పేజీలలో ఏదైనా యాక్సెస్ బిలిటీ సమస్యలు గుర్తించిన చోట ఇది కోడ్ స్నిపెట్లను ఖచ్చితంగా గుర్తించగలదు.

 

గుర్తించిన ఏదైనా యాక్సెస్ బిలిటీ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై సుగమ్య వెబ్ సిఫార్సులను కూడా పంచుకుంటుంది. ఇది అన్ని ప్రభుత్వ వెబ్ సైట్లు ,మొబైల్ అనువర్తనాల యాక్సెస్ బిలిటీ స్కోర్లను కూడా పోలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించడం ద్వారా యాక్సెసబిలిటీ రిపోర్టింగ్ వేగం, ఆటోమేషన్ ,ఖచ్చితత్త్వాన్ని పెంచవచ్చు.

 

ఆవిధంగా , ఇది అందరికీ అంతరాయం లేని డిజిటల్ అనుభవాన్ని అందించాలనే కలను సాకారం చేయడంలో ప్రతి ప్రభుత్వ సంస్థ చేతులు కలపడానికి సాధికారత కల్పించగల శక్తివంతమైన సొల్యూషన్.

 

ఈ వెబ్ యాక్సెసబిలిటీ రిపోర్టింగ్ సొల్యూషన్ నెక్ట్స్ జెన్ ఎన్ఐసి నేషనల్ క్లౌడ్ లో సాఫ్ట్ వేర్ నిర్వచిత మౌలిక సదుపాయాలలో చేర్చబడింది. వెబ్ ఇన్ఫర్మేషన్ మేనేజర్లు , నోడల్ ఆఫీసర్లు అన్ని ప్రభుత్వ సంస్థల నుండి ప్రాప్యత కోసం తమ వెబ్ సైట్ల ప్రాప్యత స్థితిని తనిఖీ చేయడానికి నమోదు చేసుకోవాలి.

సొల్యూషన్ ధృవీకరణ సాధనంగా l ఉద్దేశించబడలేదు, అయితే, సర్టిఫైయింగ్సంస్థలు (ఎస్ టి క్యు సి వంటివి) ఈ పరిష్కారాన్ని ఉపయోగించి ధృవీకరణ ప్రక్రియ ఆటోమేటెడ్ రిపోర్టింగ్ దశను నిర్వహించగలవు

 

ఎన్ఐసి డిడిజి శ్రీమతి అల్కా మిశ్రా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చిరస్మరణీయంగా చేసినందుకు అతిథులకు , హాజరైన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

****


(Release ID: 1885369) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi , Tamil