ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పంటల కోతల తరువాత నష్టం
Posted On:
20 DEC 2022 2:02PM by PIB Hyderabad
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు పంట అనంతర మౌలిక సదుపాయాలు ప్రాసెసింగ్ సౌకర్యాలు, పంట అనంతర నష్టాలను తగ్గించడంతోపాటు విలువ జోడింపును పెంపొందించడం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మొత్తం అభివృద్ధిని పెంచడం తప్పనిసరి. ప్రాథమిక సర్వేల ఆధారంగా వివిధ అధ్యయనాల ద్వారా వివిధ వ్యవసాయ వస్తువులలో పంటకోత అనంతర నష్టాలను మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. (i) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్-హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐకార్–సిఫెట్) ద్వారా మంత్రిత్వ శాఖ రెండు అధ్యయనాలను ప్రారంభించింది, "భారతదేశంలోని ప్రధాన పంటలు వస్తువుల పరిమాణాత్మక హార్వెస్ట్ పోస్ట్ హార్వెస్ట్ నష్టాల అంచనా" ( 2015); (ii) నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్(నాబ్కాన్స్) "భారతదేశంలో వ్యవసాయోత్పత్తుల పంట అనంతర నష్టాలను నిర్ణయించడానికి అధ్యయనం" (2022).
ఈ రెండు అధ్యయనాల తులనాత్మక ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి:
ప్రధాన పంటలు సరుకుల కోత అనంతర నష్టాలు
పంటలు/సరకులు
|
నష్టం (%)
|
ఐకార్–సిఫెట్అధ్యయనం (2015) ప్రకారం*
|
నాబ్కాన్స్ అధ్యయనం (2022) ప్రకారం**
|
ధాన్యాలు
|
4.65 - 5.99
|
3.89-5.92
|
పప్పులు
|
6.39 - 8.41
|
5.65-6.74
|
నూనె గింజలు
|
3.08 - 9.96
|
2.87-7.51
|
పండ్లు
|
6.70-15.88
|
6.02-15.05
|
కూరగాయలు
|
4.58-12.44
|
4.87-11.61
|
తోటల పంటలు & సుగంధ ద్రవ్యాలు
|
1.18-7.89
|
1.29-7.33
|
పాలు
|
0.92
|
0.87
|
ఫిషరీస్ (లోతట్టు)
|
5.23
|
4.86
|
ఫిషరీస్ (మెరైన్)
|
10.52
|
8.76
|
మాంసం
|
2.71
|
2.34
|
పౌల్ట్రీ
|
6.74
|
5.63
|
గుడ్డు
|
7.19
|
6.03
|
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1885305)
Visitor Counter : 173