కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈపీఎఫ్‌ఓ పేరోల్ డేటా: 2022 అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో చేరిన 12.94 లక్షల నికర సభ్యులు

Posted On: 20 DEC 2022 5:09PM by PIB Hyderabad

ఈపీఎఫ్‌ఓలో 2022 అక్టోబర్ నెలలో  12.94 లక్షల మంది నికర సభ్యులుగా చేరారు. తాత్కాలిక సభ్యుల వివరాలను  ఈపీఎఫ్‌ఓ 2022 డిసెంబర్ 20న విడుదల చేసింది. ఏడాది వారీగా కొత్తగా చేరిన సభ్యుల వివరాలు పరిశీలించినప్పుడు అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో చేరిన సభ్యుల సంఖ్య 21,026 పెరిగింది. 2021 అక్టోబర్ నెల తో 2022 అక్టోబర్ నెల వివరాలు పోల్చి చూసినప్పుడు ఈ పెరుగుదల నమోదైంది. దాదాపు 2,282 కొత్త సంస్థలు తమ ఉద్యోగులకు సామాజిక భద్రతకు భరోసా కల్పిస్తూ ఉద్యోగుల భవిష్య నిధి  ఇతర నిబంధనల చట్టం, 1952 కింద మొదటిసారిగా నమోదు అయ్యాయి. 

నెలలో  ఈపీఎఫ్‌ఓలో చేరిన మొత్తం 12.94 లక్షల మంది సభ్యులలో దాదాపు 7.28 లక్షల మంది కొత్త సభ్యులు మొదటిసారిగా సామాజిక భద్రత పరిధిలోకి వచ్చారు. కొత్తగా చేరిన మొత్తం సభ్యుల్లో 18-21 సంవత్సరాల వయస్సు గల  2.19 లక్షల మంది సభ్యులు అత్యధికంగా  నమోదు చేసుకున్నారు. దీని తర్వాత  22-25 సంవత్సరాల వయస్సు గల 1.97 లక్షల మంది సభ్యులు ఉన్నారు. చేరిన మొత్తం కొత్త సభ్యుల సంఖ్యలో 18-25 సంవత్సరాల వయస్సు గల వారి సంఖ్య దాదాపు 57.25% గా ఉంది. 

అక్టోబర్  నెలలో దాదాపు 5.66 లక్షల మంది  సభ్యులు ఈపీఎఫ్‌ఓ సభ్యత్వం వదులుకున్నారు. అయితే, ఈపీఎఫ్‌ఓ  పరిధిలోకి వచ్చిన సంస్థల్లో ఉద్యోగాల్లో చేరిన వీరు తిరిగి ఈపీఎఫ్‌ఓ లో చేరారు. సభ్యత్వం తుది పరిష్కారం చేసుకోకుండా వీరు తమ నిధులను గత ఖాతా నుంచి ప్రస్తుత ఖాతాకు బదిలీ చేసుకుని సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. 

అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో ఎక్కువగా సభ్యులుగా చేరారు. అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో 2.63 మంది మహిళలు సభ్యులుగాచేరారు. వీరిలో 1.91 లక్షల మంది మహిళలు మొదటిసారిగా ఈపీఎఫ్‌ఓలో చేరారు. 

 ఇది నెలలో నికర మహిళా సభ్యుల చేరికలు 72.73%గా ఉంది. 

రాష్ట్రాల వారీగా చేరిన సభ్యుల సంఖ్య పరిశీలిస్తే  కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ మొదలైన రాష్ట్రాల్లో చేరిన  నికర సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడైంది.  నెలలో కొత్తగా చేరిన సభ్యుల సంఖ్య పరిశీలించినప్పుడు  మొదటి ఐదు రాష్ట్రాలు నుంచి చేరిన సభ్యుల సంఖ్య  దాదాపు 60.15% గా ఉంది. కొత్తగా చేరిన వారిలో అన్ని వయస్సుల వారు ఉన్నారు.  మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన 7.78 లక్షల మంది  ఈ నెలలో సభ్యత్వం పొందారు. .

పరిశ్రమల వారీగా  విశ్లేషణ జరిపినప్పుడు  ‘నిపుణుల సేవలు’  (ఇందులో ప్రధానంగా మానవ వనరుల సంస్థలు, ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు  మరియు చిన్న కాంట్రాక్టర్లు ), వాణిజ్య సంస్థల రంగంలో ఈపీఎఫ్‌ఓలో చేరిన చందాదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రంగాల్లో ఉపాధి పొందుతూ ఈపీఎఫ్‌ఓలో చేరిన చందాదారుల సంఖ్య మొత్తం చందాదారుల్లో  48% వరకు ఉంది. గత నెల వివరాలతో పోల్చి చూస్తే ఈ ఏడాది వార్తాపత్రికలు, చక్కెర బియ్యం మిల్లులు  రంగాల నుంచి కూడా ఈపీఎఫ్‌ఓలో చేరిన చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

ఈపీఎఫ్‌ఓ పేరోల్ వివరాలు తాత్కాలిక ప్రాతిపదికన రూపొందించడం జరుగుతుంది. ఉద్యోగుల రికార్డులను ఎప్పటికప్పుడు నవీనీకరణ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో పేరోల్ వివరాలు మారుతుంటాయి. 2018 మే నెల నుంచి పేరోల్ వివరాలను  ఈపీఎఫ్‌ఓ 2017 నవంబర్ నుంచి ఈ వివరాలను విడుదల చేయడం జరుగుతోంది. తొలిసారిగా ఆధార్ వివరాల ఆధారంగా ఈపీఎఫ్‌ఓ సభ్యత్వం వదులుకొని తిరిగి చేరిన వారి సంఖ్య లెక్క వేసి  నెలవారీ వివరాలు సిద్ధం చేయడం జరిగింది. 

సంఘటిత రంగంలో పని చేస్తూ సంస్థ సభ్యత్వం పొందిన వారికి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్,బీమా లాంటి సామాజిక భద్రత సౌకర్యాలను ఈపీఎఫ్‌ఓ కల్పిస్తోంది. 

***


(Release ID: 1885255) Visitor Counter : 150


Read this release in: English , Urdu , Marathi , Hindi