నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
దేశంలో పైకప్పు సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలు
Posted On:
20 DEC 2022 3:40PM by PIB Hyderabad
దేశంలో పైకప్పు సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలు:
-
-
- నివాస విభాగం కోసం సీఎఫ్‌ఏతో పైకప్పు సౌర పథకం రెండో దశను ప్రారంభించడం, గత సంవత్సరం సాధించిన ఆర్‌టీఎస్ సామర్థ్యం కంటే ఒక సంవత్సరంలో అదనపు ఆర్‌టీఎస్ సామర్థ్యాన్ని సాధించడం కోసం డిస్కంలకు స్లాబ్ విధానంలో ప్రోత్సాహకాలు
- ఈ పథకం కింద, దేశంలో ఏ ప్రాంతంలో నివశించేవారైనా పైకప్పు సౌర ఫలకాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవడం, నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి రాయితీలను పొందేలా జాతీయ పోర్టల్ ప్రారంభం
- డిస్కం స్థాయిలో ఆన్‌లైన్ పోర్టళ్ల అభివృద్ధి, ఆర్‌టీఎస్ ప్రాజెక్టులకు సంబంధించిన డిమాండ్ సమీకరణ
- ప్రభుత్వ రంగంలో ఆర్‌టీఎస్ ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి నమూనా ఎంవోయూ, పీపీఏ, కాపెక్స్ ఒప్పందాలు
- 500 కిలోవాట్‌ల వరకు లేదా విద్యుత్ మంజూరు చేసిన లోడ్ వరకు, ఏది తక్కువైతే దాని నెట్-మీటరింగ్ కోసం విద్యుత్ (వినియోగదారుల హక్కులు) నిబంధనలు-2020 జారీ
- ప్రాజెక్టు ఆమోదం, నివేదిక సమర్పణ, ఆర్‌టీఎస్ ప్రాజెక్టుల అమలు పురోగతిని పర్యవేక్షించడం కోసం ఆన్‌లైన్ పోర్టల్ రూపకల్పన
- ప్రపంచ బ్యాంకు వంటి ప్రపంచ స్థాయి సంస్థల నుంచి రాయితీకి రుణాల సౌలభ్యం
- ఆర్‌బీఐ ప్రాధాన్యత రంగ రుణ మార్గదర్శకాల కిందకు పునరుత్పాదక ఇంధనం చేర్చడం
- 2030 సంవత్సరం వరకు పునరుత్పాదక ఇంధనం కొనుగోలు బాధ్యత (ఆర్‌పీవో) కోసం విధాన ప్రకటన
- సౌర విద్యుత్ ఫలక వ్యవస్థలు/పరికరాల విస్తరణ కోసం నాణ్యత ప్రమాణాలు ప్రకటన
- ఆర్‌టీఎస్ కోసం ఆవిష్కరణాత్మక వ్యాపార రీతులు
- వివిధ మాధ్యమాల ద్వారా సమాచారం వెల్లడించడం, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఇవాళ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1885254)
Visitor Counter : 119