ఆయుష్
azadi ka amrit mahotsav

సంప్రదాయ వైద్య విజ్ఞానం మీద పరిశోధన

Posted On: 20 DEC 2022 4:03PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలోని ‘ఆయుర్వేద శాస్త్రాల కేంద్ర పరిశోధన మండలి’ ఆయుర్వేద విజ్ఞానానికి సంబంధించిన పురాతన రాతప్రతులను, గ్రంథాలను వెలికి తీసే పునరుద్ధరించే బాధ్యత నిర్వహిస్తుంది.  హైదరాబాద్ లోని ఎన్ఐఐఏంహెచ్ సంస్థ  వైద్య చరిత్ర సంబంధ గ్రంధాలయాన్ని నిర్వహిస్తుంది. ఈ గ్రంధాలయ నిర్వహణ లక్ష్యాలు ప్రధానంగా రెండు:   

             i.    వైద్య విద్యార్థులకు, అధ్యాపకులకు, ఆసక్తి ఉన్న ప్రజలకు వైద్య చరిత్ర పట్ల అవగాహన కల్పించటం

            ii.    పురాతన, మధ్య యుగ, ఆధునిక కాలాల్లో భారతీయ వైద్య చరిత్రలో పరిశోధనను ప్రోత్సహించటం, భారతదేశంలో వైద్యం ఎదిగిన తీరుతెన్నులను అధ్యయనం చేయించటం,  వివిధ నాగరికతలలో వైద్యంలో వచ్చిన మార్పుల తులనాత్మక పరిశీలన  

ఈ గ్రంధాలయంలో వైద్య చరిత్రకు సంబంధించిన  వివిధ శాఖలకు చెందిన 10,384 గ్రంధాలుండగా అందులో 448 అత్యంత అరుడైనవి. ఆయుష్ వ్యవస్థలకు, యూరీపీయన్ వైద్యానికి  చెందిన అనేక తొలినాళ్ళ శాస్త్రీయ గ్రంధాలు ఇందులో ఉన్నాయి. ఇందులో 285 తాళపత్ర గ్రంధాలు కాగా అందులో 173 ఆయుర్వేదానికి చెందినవి. 106 యునానీ వైద్యానికి, 6 సిద్ద వైద్యానికీ సంబంధించినవి. ఈ సంస్థలో 2700 వైద్య రాత ప్రతులు డిజిటల్ రూపంలోను, వేరు వేరు రాతప్రతుల భాండాగారాలు, ప్రభుత్వ మ్యూజియంలు, విద్యా సంస్థలు, గ్రంధాలయాలు, వ్యక్తుల సేకరణల నుంచి తెచ్చిన మరో 1335 అరుదైన గ్రంధాలు  భద్రపరచబడ్డాయి. దక్షిణ భారతదేశంతోబాటు మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వీటిని సేకరించారు. ఈ 2700 డిజిటల్ రాత ప్రతులలో 1335  ఆయుర్వేదానికి, 542 యునానీకి,  598 సిద్ద వైద్యానికీ, 49 యోగాకు, 176 ఇతర అంశాలకు సంబంధించినవి.  మరో 1679 రాత ప్రతులు/అరుదైన పుస్తకాలను డిజిటైజ్ చేశారు.

న్యూ ఢిల్లీలోని ఆయుర్వేద శాస్త్రాల కేంద్ర పరిశోధన మండలి రాతప్రతుల ఎడిటింగ్, అనువాదం, లిపియంతరీకరణ, ప్రచురణ లాంటి పనులు చేపడుతుంది. అఅ విధంగా అరుదైన పుస్తకాలను, ప్రాచీన, మధ్య యుగానికి చెందిన రచనలను విస్తృతంగా ప్రచారం చేసేలా విశ్వవ్యాప్తం చేస్తూ అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తోంది. అదే విధంగా సిద్ధ వైద్యంలో కేంద్ర పరిశోధనామండలి తమిళంలో లభించిన ప్రాచీన  సిద్ద సాహిత్యాన్ని వాడుక తమిళ, ఇంగ్లీష్ భాషలలోకి అనువదింపజేసింది. ఆయుష్ మంత్రిత్వశాఖ కింద వివిధ జాతీయ స్థాయి సంస్థలు, పరిశోధనామండలులు క్రమం తప్పకుండా జర్నల్స్ ప్రచురిస్తూ ఉన్నాయి. వీటిద్వారా పరిశోధనా ఫలాలను అందరికీ అందజేస్తాయి.

హైదరాబాద్ లో ఉన్న భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ వారి  భారత వైద్య సంప్రదాయ జాతీయ సంస్థ ఆయుర్వేద శాస్త్రాల కేంద్ర పరిశోధనామండలి కింద పనిచేస్తూ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుంది: 

                                        i.          అందుబాటులోని సాహిత్య పరిశోధన, గ్రంధస్థం చేయటం

                                      ii.          పురాతన రాతప్రతులు, అరుదైన పుస్తకాల నుంచి తీసుకున్న అంశాల పునరుద్ధరణ

                                    iii.           సమాచార శోధన, సేకరణ, అంశాల నమోదు, ఎడిటింగ్, ఆయుష్ మీద అరుదైన పుస్తకాల ప్రచురణ,

                                     iv.          డాక్యుమెంటేషన్

                                      v.           ఆయుర్వేద విజ్ఞాన సర్వస్వం  

                                     vi.          వైద్య చరిత్ర మీద మ్యూజియం  

                                   vii.          ఆయుష్ వైద్య విధానం, ఆధునిక వైద్యం మీద రిఫరల్  లైబ్రరీ

                                 viii.           ఆయుష్ పరిశోధన పోర్టల్  

                                     ix.          సీసీఆర్ఏఎస్ – రీసెర్చ్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్

                                      x.           నేషనల్ ఆయుష్ మారబిడీటీ అండ్ స్టాండర్డైయిజ్డ్ టెర్మినాలజీస్ ఎలక్ట్రానికి ( నమస్తే) పోర్టల్  

                                     xi.          ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి  ఇంటర్నేషనల్ టెర్మినాలజీస్ ఆఫ్ ఆయుర్వేద, సిద్ధ, యునానీ అభివృద్ధి చేయటం 

                                   xii.          ఆయుర్వేద, సిద్ధ, యునానీ కోసం సనోమెడ సీటీ నేషనల్ ఎక్స్ టెన్షన్ ను అభివృద్ధి పరచటం

ఈ సంస్థకు తోడు ఆయుష్ మంత్రిత్వశాఖ కింద ఉన్న మొత్తం ఐదు  పరిశోధనామండలులు కూడా సంబంధిత సాహిత్యం మీద పరిశోధన సాగిస్తాయి.  

ఆయుష్ శాఖా మంత్రి శ్రీ శరబానంద సోనోవాల్ ఈ రోజు రాజ్య సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన  లిఖిత పూర్వక సమాధానం లో ఇచ్చిన సమాచారం ఇది. 

***


(Release ID: 1885176)
Read this release in: Kannada , English , Urdu , Tamil