పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ నుంచి 25 విమానాశ్రయాలు 2022 నుంచి 2025 సంవత్సరాలకు లీజుకు కేటాయింపు

Posted On: 19 DEC 2022 2:30PM by PIB Hyderabad

జాతీయ నగదీకరణ విధానం (ఎంఎన్‌పీ) ప్రకారం భువనేశ్వర్, వారణాసి, అమృత్‌సర్, తిరుచ్చి, ఇండోర్, రాయ్‌పుర్, కాలికట్, కోయంబత్తూరు, నాగ్‌పుర్, పట్నా, మధురై, సూరత్, రాంచీ, జోధ్‌పూర్, చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, తిరుపతి, హుబ్లీ, ఇంఫాల్, అగర్తల, ఉదయపూర్, డెహ్రాడూన్, రాజమండ్రి వంటి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ 25 (ఏఏఐ) విమానాశ్రయాలు 2022 నుంచి 2025 సంవత్సరాలకు లీజుకు ఇవ్వడానికి కేటాయించమైనది.

ఏఏఐ తన ఎనిమిది విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద దీర్ఘకాలిక ప్రాతిపదికన నిర్వహణ, అభివృద్ధి కోసం లీజుకు ఇచ్చింది. లీజుకు తీసుకున్న గుత్తేదారులు, విమానాశ్రయాల వివరాలు ఇవి:

(1) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దిల్లీ - ఎం/ఎస్‌ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్‌)

(2) ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై - ఎం/ఎస్‌ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్‌)

(3) చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, లఖ్‌నవూ - ఎం/ఎస్‌ లక్నో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎల్‌ఐఏఎల్‌)

(4) సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అహ్మదాబాద్ - ఎం/ఎస్‌ అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఏఐఏఎల్‌)

(5) మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం - ఎం/ఎస్‌ మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (ఎంఏఐఏఎల్‌)

(6) జైపుర్ అంతర్జాతీయ విమానాశ్రయం - ఎం/ఎస్‌ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జేఐఏఎల్‌)

(7) లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం, గువాహటి - ఎం/ఎస్‌ గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీఐఏఎల్‌)

(8) తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం - ఎం/ఎస్‌ టీవీఆర్‌-కేరళ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (టీఐఏఎల్‌)

 

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ రంగ సామర్థ్యం, పెట్టుబడిని ఉపయోగించుకునేలా, మెరుగైన నిర్వహణ కోసం ఏఏఐ విమానాశ్రయాలు లీజుకు ఇవ్వడం జరిగింది. పీపీపీ కింద లీజుకు తీసుకున్న విమానాశ్రయాన్ని నిర్వహించే, అభివృద్ధి చేసే ప్రైవేట్ భాగస్వామి సృష్టించిన మెరుగైన విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను వినియోగించుకునే అంతిమ లబ్ధిదారులు రాష్ట్రాలు, ప్రయాణీకులు. విమానాశ్రయాలు ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా అవతరించాయి, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల మీద ఎన్నో రెట్ల ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. లీజుకు తీసుకున్న విమానాశ్రయాల నుంచి ఏఏఐకి వచ్చే ఆదాయం దేశవ్యాప్తంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కూడా ఉపయోగిస్తారు.

ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ (రిటైర్డ్) ఈ సమాచారాన్ని ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.

 

*****



(Release ID: 1884901) Visitor Counter : 132


Read this release in: English , Tamil , Urdu , Odia