కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

నేషనల్ కెరీర్ సర్వీస్

Posted On: 15 DEC 2022 12:40PM by PIB Hyderabad

ఉద్యోగాల శోధన, ఉద్యోగ కౌన్సెలింగ్, వృత్తిపరమైన మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి కోర్సుల మీద సమాచారం వంటి అనేక రకాల ఉపాధి సంబంధిత సేవలను డిజిటల్ వేదిక [www.ncs.gov.in] ద్వారా అందించడానికి నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్‌) ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగార్థులు, సంస్థల యజమానులను ఎన్‌సీఎస్‌ పోర్టల్ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది.

20 రాష్ట్రాలు/యూటీల రాష్ట్ర ఉపాధి పోర్టళ్లతో ఎన్‌సీఎస్‌ పోర్టల్‌ అనుసంధానం పూర్తయింది. ఉద్యోగార్థులను గుర్తించడానికి  7 రాష్ట్రాలు/యూటీలు ఎన్‌సీఎస్‌ పోర్టల్‌ను నేరుగా ఉపయోగిస్తున్నాయి. రూపకల్పన/నవీకరణ వంటి వివిధ కారణాల వల్ల తొమ్మిది రాష్ట్రాలు/యూటీల్లో రాష్ట్ర పోర్టళ్ల అనుసంధానం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఆగి ఉంది.

ఉద్యోగార్థులు ఇచ్చిన వివరాల ప్రకారం, 11 డిసెంబర్ 2022 వరకు ఎన్‌సీఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న మొత్తం 2.76 కోట్ల మంది ఉద్యోగార్థుల్లో 15-29 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ యువత 1.15 కోట్ల మంది (42%) ఉన్నారు.

కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి ఇవాళ లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని రాజ్యసభకు తెలిపారు.

 

******(Release ID: 1883957) Visitor Counter : 81


Read this release in: English , Urdu , Tamil , Malayalam