జల శక్తి మంత్రిత్వ శాఖ

సహజ ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి మొదటి 10 ప్రపంచ పునరుద్ధరణ ఫ్లాగ్ షిప్ లలో ఒకటిగా నమామి గంగే చొరవను గుర్తించిన ఐక్యరాజ్యసమితి


కెనడాలోని మాంట్రియల్ లో జీవవైవిధ్యంపై కన్వెన్షన్ కు పార్టీల 15వ సదస్సులో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్న ఎన్ ఎమ్ సి జి డిజి

Posted On: 15 DEC 2022 12:30PM by PIB Hyderabad

భారతదేశ పవిత్ర గంగా నదిని పునరుజ్జీవింపజేయడానికి చేపట్టిన నమామి గంగే చొరవను సహజ ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి ప్రపంచ పునరుద్ధరణ ఫ్లాగ్ షిప్ లలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి (యుఎన్) గుర్తించింది.

ప్రపంచ పునరుద్ధరణ దినోత్సవం సందర్భంగా 2022 డిసెంబర్ 14 న కెనడాలోని మాంట్రియల్ లో జీవవైవిధ్యంపై కన్వెన్షన్ (సిబిడి) కు 15 వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఓపి 15) లో జరిగిన కార్యక్రమంలో నమామి గంగే డైరెక్టర్ జనరల్ శ్రీ జి అశోక్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల నుండి 150 కి పైగా అటువంటి కార్యక్రమాల నుండి నమామి గంగే ఎంపిక అయింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ఇపి), యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి దశాబ్దపు పర్యావరణ పునరుద్ధరణ అనే ప్రపంచ ఉద్యమం కింద వీటిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం భూగోళం అంతటా సహజ ప్రదేశాల క్షీణతను నివారించడానికి , తిప్పికొట్టడానికి రూపొందించబడింది.

నమామి గంగేతో సహా గుర్తింపు పొందిన కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి మద్దతు, నిధులు లేదా సాంకేతిక నైపుణ్యాన్ని పొందడానికి అర్హత కలిగి ఉంటాయి.

—-------------------------------------------

*ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు చెందిన 150కి పైగా కార్యక్రమాల నుంచి నమామి గంగే ఎంపిక

 

నదీ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ద్వారా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సాక్ష్యం ఈ గుర్తింపు: డిజి, ఎన్ఎంసిజి శ్రీ జి అశోక్ కుమార్

 

*ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గంగానది పునరుజ్జీవం అవసరాన్ని గుర్తించి, 2014 లో నమామి గంగే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  నది పరిశుభ్రంగా ఉండేలా చూడటానికి ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఖర్చుకు సిద్ధంగా ఉన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన గల జాతీయ గంగా మండలి ద్వారా నిశిత పర్యవేక్షణ,  కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నిరంతర సమీక్ష నమామి గంగే కార్యక్రమం పట్ల ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం.

 

*ప్రధాన మంత్రి అందుకున్న బహుమతుల వార్షిక బహిరంగ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని గంగా నదిని శుభ్ర పరిచే ప్రభుత్వ ప్రయత్నంలో ప్రజల విరాళాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లీన్ గంగా నిధికి ఇస్తారు.

—--------------------------------------------

నమామి గంగే డైరెక్టర్ జనరల్ శ్రీ జి.అశోక్ కుమార్ మాట్లాడుతూ, "నమామి గంగేను ప్రపంచంలోని టాప్ -10 పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కార్యక్రమాలలో ఒకటిగా గుర్తించడం నదీ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా చేస్తున్న సమిష్టి ప్రయత్నాలకు నిదర్శనం. మన ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఇతర జోక్యాలకు రోడ్ మ్యాప్ ను అందిస్తాయని నేను ఆశిస్తున్నాను‘‘ అని అన్నారు.

 

ఈ సందర్భంగా కెనడా లోని మాంట్రియల్ లో యుఎన్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ యూత్ టాస్క్ ఫోర్స్ నిర్వ హించిన ఒక సమావేశంలో కూడా శ్రీ కుమార్ పాల్గొన్నారు. భారత దేశ ప్రజలు,

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరుఫున నమామి గంగేను మొదటి 10 పునరుద్ధరణ కార్యక్రమాల్లో ఎంపిక చేయడం ద్వారా భారతదేశానికి గౌరవం ఇచ్చినందుకు వరల్డ్ రిస్టోరేషన్ ఫోరం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్ఇపి), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కు శ్రీ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. 'జీ20 దేశాల అధ్యక్ష పదవి భారత్ కు చాలా సరైన సమయంలో వచ్చింది. వసుధైక కుటుంబ  నిజమైన స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు 'ఒకే భూమి ఒకే కుటుంబం ఒక భవిష్యత్తు' అనే నిబద్ధతను అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు మన ప్రధాని పునరుద్ఘాటించారు‘‘ అని ఆయన పేర్కొన్నారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గంగానదిని పునరుజ్జీవింప చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 2014 లో నమామి గంగే కార్యక్రమాన్ని ప్రారంభించారని, నదిని పరిశుభ్రంగా ఉంచడానికి ఐదు బిలియన్ డాలర్లకు పైగా వ్యయానికి కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు. ‘‘భారతదేశ జనాభాలో 40% మంది, 2500 జాతుల వృక్ష ,జంతుజాలం, 8.61 బిలియన్ చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం ఉన్నందున గంగా నది భారతదేశానికి చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక కోణంలో కూడా గంగా నది చాలా ముఖ్యమైనది' అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది మన సంప్రదాయం, నాగరికతతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఇంకా ఇది భారతదేశ ప్రజల విశ్వాసం, మనోభావాలు ,సామూహిక చైతన్యానికి చిహ్నం‘‘ అన్నారు.

 

ఎన్ ఎం సి జి సమగ్ర , బహుళ రంగాల విధానాన్ని అవలంబించిందని, ఇది నదీ జీవావరణ శాస్త్రం , దాని ఆరోగ్య సమగ్ర పరిరక్షణ కోసం వినూత్న నమూనాలను ప్రవేశపెట్టిందని శ్రీ కుమార్ చెప్పారు. శుద్ధి చేయని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు గంగానదిలోకి వెళ్లకుండా చూసేందుకు ప్రాజెక్టులు రూపొందించబడ్డాయి. రోజుకు 5000 మిలియన్ లీటర్లకు పైగా శుద్ధి చేయగల సామర్థ్యం కలిగిన 176 ఎస్టిపిలను నిర్మిస్తున్నారు. మిషన్ సంఘటిత ప్రయత్నాలు గంగా బేసిన్ లో మురుగునీటి, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి; నదీజల నాణ్యత ,జీవవైవిధ్యంలో మెరుగుదల, డాల్ఫిన్లు ,దాని చిన్న పిల్లలు, తాబేళ్లు, ఒట్టర్స్, ఘరియల్స్, హిల్సా వంటి చేపల జనాభా పెరగడం ద్వారా వ్యక్తమవుతుంది; ఇంకా 30,000 హెక్టార్లకు పైగా అడవులను నాటారు" అని ఆయన అన్నారు.

 

సామాజిక ఆర్థిక- నదీ ప్రాంత ప్రజల అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ఆర్థ్ గంగా నమామి గంగేలో అంతర్భాగం అని, ,ఇది మిషన్ ను జన ఆందోళన్ లేదా ప్రజా ఉద్యమంగా మార్చిందని  ఎన్ఎంసిజి డిజి అన్నారు. హెచ్ ఎ ఎం, వన్ సిటీ వన్ ఆపరేటర్ వంటి అనేక వినూత్న ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ విధానాలు విజయవంతంగా అభివృద్ధి చెందడంతో, దేశంలోనీ, ప్రపంచంలోని ఇతర నదులను శుభ్రం చేయడానికి

ఎన్ఎంసిజి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది.

 

నమామి గంగే కార్యక్రమం మన అగ్ర రాజకీయ కార్యనిర్వాహకుల పూర్తి నిబద్ధతతో నడుస్తోందని, ఇంత పెద్ద ఎత్తున పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ఇది అవసరమని డిజి నొక్కిచెప్పారు. నమామి గంగే కార్యక్రమం పట్ల అచంచలమైన నిబద్ధత ఎంతగా ఉందంటే, దీనిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్న జాతీయ గంగా మండలి నిశితంగా పర్యవేక్షిస్తొందని , మరోవైపు కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ క్రమం తప్పకుండా సమీక్షి స్తున్నారని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి అందుకున్న బహుమతుల వార్షిక బహిరంగ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని గంగా నదిని శుభ్ర పరిచే ప్రభుత్వ ప్రయత్నంలో ప్రజల విరాళాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లీన్ గంగా నిధికి ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.

 

ఈ కార్యక్రమం కోసం యువతతో అనుసంధానం ప్రాముఖ్యత గురించి ఆయన మాట్లాడుతూ, భారతదేశం అత్యధిక యువ జనాభా కలిగిన యువ దేశం అని, వ్యర్థ నీటి నిర్వహణ సమస్యను పరిష్కరించేలా చూడటానికి యువత , మహిళలను భాగస్వాములను చేయాలని అన్నారు. భారత దేశం లోని యువత , మహిళలకు నీటి భద్రత

సమస్యల గురించి తెలుసని, నీటిని గౌరవించాలని వారికి బోధిస్తున్నారని ఆయన అన్నారు. ‘‘యువత నీటిని గౌరవించేలా చేయగలిగితే, అది మన నీటి వనరుల దుర్వినియోగం, లోపభూయిష్టమైననిర్వహణను సులభంగా అరికడుతుంది.‘‘ అన్నారు.

 

సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా నీటి రీసైక్లింగ్ చాలా కఠినంగా ముందుకు సాగుతోందని, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, స్ప్రింగ్ షెడ్లు మొదలైన వాటిని రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

‘‘గంగా ప్రహారీలు, గంగా దూత్స్, గంగా క్వెస్ట్ వంటి శిక్షణ పొందిన స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా యువత వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు.వారు గంగా నది జీవవైవిధ్యాన్ని రక్షించడంలో మనతో కలిసి ఉన్నారు. గంగా బేసిన్ లో ఈ వాలంటీర్లు డాల్ఫిన్లను రక్షించడం ఒక విశేషం, దీని ఫలితంగా నదిలో జల జాతులు ఎక్కువగా కనిపిస్తాయి" అని ఆయన అన్నారు.

 

యువ తరాన్ని ఆకర్షించడానికి ర్యాఫ్టింగ్ యాత్ర, సైకిలాథాన్లు, హ్యాకథాన్లు, 'యువ మనస్సులను పునరుజ్జీవింపజేయడం: నదులను పునరుజ్జీవింపజేయడం' అనే అంశంపై వెబినార్ వంటి వివిధ కార్యకలాపాలు చేపట్టామని, నమామి గంగే కింద ప్రజలను ముఖ్యంగా యువతను భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకత గురించి తెలుసు కుంటున్నామని శ్రీ కుమార్ తెలిపారు.

నమామి గంగే మనకు ఒక ప్రేరణ మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ , పునరుద్ధరణ కోసం నేటి , తరువాతి తరం యువత కోసం మెరుగైన ప్రపంచాన్ని అందించే మన ప్రయత్నంలో గంగా మాతకు వినయపూర్వక సమర్పణ అని ఆయన ముగించారు.

 

యుఎన్ఇపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఇంగర్ అండర్సన్ మాట్లాడుతూ, "నమామి గంగే భారతదేశంలో మిలియన్ల మంది ప్రజలకు జీవనాడి అయిన గంగానదిని పునరుజ్జీవింపజేయడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రయత్నం. ప్రకృతితో మన దోపిడీ సంబంధాన్ని మార్చడం చాలా క్లిష్టమైన సమయంలో, ఈ పునరుద్ధరణ సానుకూల ప్రభావాలను తక్కువగా అంచనా వేయలేము‘‘ అనిఅన్నారు.

 

ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యు మాట్లాడుతూ, "పర్యావరణ పునరుద్ధరణపై ఐక్యరాజ్యసమితి దశాబ్దానికి సహ-సారథిగా యుఎన్ఇపితో కలిసి ఎఫ్ఎఓ, 2022 ప్రపంచ పునరుద్ధరణ ఫ్లాగ్ షిప్ గా 10 అత్యంత ప్రతిష్టాత్మకమైన, దూరదృష్టి గల ,ఆశాజనక పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కార్యక్రమాలకు అవార్డులు ప్రదానం చేయడం సంతోషంగా ఉంది. ఈ ఫ్లాగ్ షిప్ ల ప్రేరణతో, మెరుగైన ఉత్పత్తి, మెరుగైన పోషకాహారం, మంచి వాతావరణం ,అందరికీ మెరుగైన జీవితం కోసం మన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం నేర్చుకోవచ్చు‘‘

ఆన్నారు.

 

యుఎన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ కోసం కెనడాలోని మాంట్రియల్ లో సమావేశమైన ప్రపంచవ్యాప్తంగా నాయకులు ఈ ప్రకటన చేశారు, అక్కడ ప్రభుత్వాలు రాబోయే దశాబ్దంలో ప్రకృతి కోసం కొత్త లక్ష్యాలకు అంగీకరించాయి.

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసిజి) గతంలో గ్లోబల్ వాటర్ ఇంటెలిజెన్స్ 3 ద్వారా 2019 గ్లోబల్ వాటర్ అవార్దు లలో "పబ్లిక్ వాటర్ ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్" ను గెలుచుకుంది.

నేషనల్ జియోగ్రాఫిక్ ఇండియాతో కలిసి నిర్మించిన 'గంగా: రివర్ ఫ్రమ్ ది స్కైస్' డాక్యుమెంటరీ ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్, 2022 లో ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ కరెంట్ అఫైర్స్, బెస్ట్ నేచురల్ హిస్టరీ లేదా వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్ అనే మూడు విభాగాల కింద అవార్డులను అందుకుంది.

 

(కెనడాలోని మాంట్రియల్ లో జీవవైవిధ్యంపై కన్వెన్షన్ కు పార్టీల 15వ సదస్సులో అవార్డు అందుకున్న డిజి, ఎన్ ఎమ్ సి జి)

Image

*****



(Release ID: 1883956) Visitor Counter : 167