కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సి-డాట్, డాట్ మరియు టీ ఎస్ డీ ఎస్ ఐ సహకారంతో రెండు రోజుల ప్రపంచ ఐ ఓ టీ / ఎం 2 ఎం సమావేశాన్ని నిర్వహిస్తోంది.


‘ప్రామాణిక అమలుల ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రగతి/మెషిన్ టు మెషిన్ (M2M) పర్యావరణ వ్యవస్థ వృద్ధి అనే అంశంపై ఈ సదస్సు జరుగుతోంది.

Posted On: 15 DEC 2022 9:05AM by PIB Hyderabad

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT)  టెలికమ్యూనికేషన్స్ శాఖ, భారత ప్రభుత్వం మరియు టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ సొసైటీ ఇండియా (TSDSI)తో కలిసి రెండు రోజుల  ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రగతి/మెషిన్ టు మెషిన్ (M2M) ప్రపంచ సమావేశాన్ని నిన్నటి నుంచి ఇక్కడ నిర్వహిస్తోంది. కాన్ఫరెన్స్ 'ప్రామాణిక అమలుల ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రగతి/మెషిన్ టు మెషిన్ (M2M)  పర్యావరణ వ్యవస్థ వృద్ధి' అనే అంశంపై సదస్సు జరుగుతోంది.

 

ఆర్ అండ్ డి, విద్యాసంస్థలు, ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్‌లు, గ్లోబల్ టెలికాం అసోసియేషన్‌లు మరియు స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లలో విస్తరించి ఉన్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రగతి/మెషిన్ టు మెషిన్ (M2M)  పర్యావరణ వ్యవస్థ యొక్క ముఖ్య లబ్దిదారుల మధ్య విస్తృత సహకారం  వుమ్మడి ప్రయోజనం అనే చట్రం ను రూపొందించడం ఈ సమావేశం లక్ష్యం. ఇది విభిన్న ప్రాంతాలలో విస్తృత-శ్రేణి అనువర్తనాల కోసం వినూత్నమైన, ప్రామాణికమైన మరియు బహుళ పక్షంలో పనిచేసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రగతి/మెషిన్ టు మెషిన్ (M2M) పరిష్కారాల  వేగవంతమైన అభివృద్ధిని సులభతరం చేస్తుంది.

 

నూతన ఉపయోగ అవకాశాల  కోసం కృత్రిమ మేధ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రగతి/మెషిన్ టు మెషిన్ (M2M)  ఆధారిత స్వయం చలిత పరిష్కారాల వృద్ధిని వేగవంతం చేసిన 5జీ ఆవిర్భావంతో ప్రపంచం సాంకేతిక విప్లవం యొక్క కొత్త శకాన్ని చూస్తోంది. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీలను నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిష్టాత్మక మిషన్ వెలుగులో కూడా ఈ సదస్సు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

 

కాన్ఫరెన్స్ యొక్క సాంకేతిక సెషన్‌లు పాల్గొనేవారిని ప్రపంచవ్యాప్తంగా ఐ ఓ టీ / ఎం 2 ఎం అభ్యాసాలు బహుళ పక్షం పనిచేసే స్థిరమైన ఐ ఓ టీ పర్యావరణ వ్యవస్థ, ఐ ఓ టీ భద్రత మరియు ఇతర అంతర్లీన సవాళ్లు, 5జీ కోసం  కృత్రిమ మేధ , ఐ ఓ టీ కోసం ప్రామాణీకరణ, స్మార్ట్ సిటీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం కార్యక్రమాలతో సహా విభిన్న సమకాలీన ఇతివృత్తాలపై తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి. వ్యవసాయం  గ్రామీణ అభివృద్ధి కోసం సి-డాట్ కామన్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్ అనువర్తనాలపై భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన గౌరవనీయమైన ఉపన్యాసకులు నిపుణులు అంతర్దృష్టితో కూడిన చర్చలు జరిపారు 

 

భారత ప్రభుత్వ డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ మరియు సెక్రటరీ (టెలికాం) శ్రీ కె రాజారామన్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి, ముఖ్యోపన్యాసం చేస్తూ, పర్యావరణ వ్యవస్థలోని భాగస్వాములు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు అందరూ కలిసి సాంకేతిక ప్రమాణాల పరిణామానికి చురుకుగా  పనిచేయాలని కోరారు. ఇది గ్రామీణ మరియు పట్టణ విస్తరణల యొక్క నిర్దిష్ట అవసరాలను తీర్చడం కోసం సాంకేతిక ఆవిష్కరణల ప్రయోజనాలను అందించని మరియు తక్కువ సేవలందించిన ప్రాంతాలకు కూడా  ప్రగతి ని విస్తరింపజేస్తుంది. 

 

డాక్టర్ మహేష్ శుక్లా, డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్, భారత ప్రభుత్వ సభ్యుడు (సర్వీసెస్), పాల్గొనేవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, స్మార్ట్ సిటీలు మరియు ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌తో సహా వివిధ అప్లికేషన్‌ల కోసం అనూహ్యమైన ఆవిష్కరణలకు దారితీసే ఐ ఓ టీ / ఎం 2 ఎం ను తీవ్రంగా మార్చగల 5జీ మరియు కృత్రిమ మేధ లో తాజా పురోగతి గురించి మాట్లాడారు.

 

శ్రీ సంజీవ్ అగర్వాల్, మెంబర్ (టెక్నాలజీ), డిజిటల్ కమ్యూనికేషన్స్ కమీషన్, భారత ప్రభుత్వం, తన ప్రసంగంలో, ప్రపంచవ్యాప్తంగా కేంద్రీకృత ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించడం ద్వారా సాధించగల భద్రత మరియు ఇంటర్‌ఆపరేబిలిటీపై దృష్టి సారించి స్థిరమైన ఐ ఓ టీ / ఎం 2 ఎం విస్తరణల యొక్క ముఖ్యమైన అంశాలను ప్రస్తవించారు.

 

పమేలా కుమార్, డీ జీ, టీ ఎస్ డీ ఎస్ ఐ భారతదేశంలో ఐ ఓ టీ / ఎం 2 ఎం పర్యావరణ వ్యవస్థ వృద్ధిలో టీ ఎస్ డీ ఎస్ ఐ పాత్ర గురించి మరియు ఐ ఓ టీ / ఎం 2 ఎం ప్రామాణీకరణల కోసం అందించిన సహకారాన్ని గురించి  మాట్లాడారు 

 

ఐ ఓ టీ / ఎం 2 ఎం రంగంలో సహకార ఆర్ అండ్ డి, మరియు ప్రామాణీకరణలను ప్రోత్సహించడానికి సి-డాట్ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి సి-డాట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ పాల్గొనేవారికి వివరించారు. స్టార్టప్‌లు మరియు పరిశ్రమలు తమ ఐ ఓ టీ / ఎం 2 ఎం సొల్యూషన్‌ల అమలు కోసం సి-డాట్ కామన్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవాలని మరియు ఇటీవల ప్రారంభించిన సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో భాగం కావాలని ఆయన కోరారు.

 

భారతదేశం మరియు విదేశాల నుండి ప్రభుత్వం, 

ఆర్ అండ్ డి, విద్యాసంస్థలు, పరిశ్రమలు మరియు స్టార్టప్‌ల నుండి వివిధ ప్రముఖులు, పరిశోధకులు మరియు అధికారులు సదస్సు ప్రారంభ సమావేశానికి హాజరయ్యారు.

 

అనేక స్టార్టప్‌లు, అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు ఇండస్ట్రీ  తమ వినూత్న ఐ ఓ టీ / ఎం 2 ఎం సొల్యూషన్‌లను ఈవెంట్‌లో ప్రదర్శిస్తున్నారు.

 

***



(Release ID: 1883833) Visitor Counter : 129