మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి కౌశల్ కో కామ్ కార్యక్రమం (పీఎంకేకేకే) పేరును ప్రధాన మంత్రి విరాసత్ కా సంవర్ధన్ (పీఎం వికాస్) పథకంగా పేరు మార్చడం జరిగింది


మంత్రిత్వ శాఖకు చెందిన గత ఐదు పథకాలు సీఖో ఔర్ కమావ్‌, ఉత్సాద్‌, హమారీ ధరోహర్, నయీ రోష్ని, నయీ మంజిల్‌ కలయికగా ఈ సమీకృత పథకం ఉంటుంది

प्रविष्टि तिथि: 15 DEC 2022 2:20PM by PIB Hyderabad

లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇవాళ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ, ప్రధాన మంత్రి కౌశల్ కో కామ్ కార్యక్రమం (పీఎంకేకేకే) పేరును ప్రధాన మంత్రి విరాసత్ కా సంవర్ధన్ (పీఎం వికాస్) పథకంగా పేరు మార్చడం జరిగిందని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం సమయానికి ఈ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

నైపుణ్యాభివృద్ధి, విద్య, మహిళా నాయకత్వం, వ్యవస్థాపకత వంటి అంశాల ద్వారా మైనారిటీల జీవనోపాధిని మెరుగుపరచడం, ముఖ్యంగా చేతివృత్తి కళాకారుల వృత్తులను వృద్ధి చేయడం పీఎం వికాస్‌ లక్ష్యం. లబ్ధిదారుల ఆదాయాలను పెంచడం, రుణాలు & మార్కెట్ అనుసంధానాన్ని సులభతరం చేయడం ద్వారా చేతివృత్తి కళాకారులకు మద్దతు అందించడం వంటి పథకం అంతిమ లక్ష్యంలో ఈ అంశాలన్నీ సంపూర్ణంగా నెరవేరతాయి.

 

******


(रिलीज़ आईडी: 1883832) आगंतुक पटल : 318
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Tamil , Malayalam