సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఆగ్రా, బారాబంకీలలో చెప్పుల తయరా మెషీన్లు & 200 తేనెటీగల పెట్టెలను పంపిణీ చేసిన కెవిఐసి చైర్మన్
Posted On:
14 DEC 2022 10:34AM by PIB Hyderabad
ఆగ్రా జిల్లాలోని లెదర్ పైలట్ ప్రాజెక్టు కింద చెప్పుల తయారీ యంత్రాలను, గ్రామీణ పరిశ్రమాభివృద్ధి పథకం కింద బారాబంకి జన్‌పద్ లో తేనెటీగల పెట్టెలను డిజిటల్ మాధ్యమం ద్వారా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ శ్రీ మనోజ్‌కుమార్ 13 డిసెంబర్ 2022న పంపిణీ చేశారు.
హనీ మిషన్ కింద బుధవారం 200 తేనెటీగల పెట్టెలను, పరికరాల కిట్లను అందుకున్న లబ్ధిదారులకు బారాబంకీ జిల్లాలోని వైష్ణవ్, జ్ఞాన్ అన్న రెండు స్వయం సహాయక బృందాలు 5 రోజుల శిక్షణను ఇచ్చాయి.
ఈ సందర్భంగా, కెవిఐసి చైర్మన్ తేనెటీగల పెంపకం పనిలో వచ్చే సమస్యల గురించి లబ్ధిదారులతో ముచ్చటించి, వారి ప్రాంతంలో తేనెటీగల పెంపకం పనిని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రోత్సహించారు. అనంతరం, వారి గురించి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుని, వారు చేస్తున్న పనిని ముందుకు తీసుకుపోవలసిందిగా ప్రోత్సహించారు.
ఇందుకు అదనంగా, లెదర్ క్రాష్ట్ మిషన్ కింద ఆయన చెప్పుల తయారీ మెషీన్లను, పరికరాలను 10 మంది లబ్ధిదారులకు అందించారు. వారు దీనికి సంబంధించి ఆగ్రా జిల్లాలోని సిఎఫ్‌టిఐ ఆగ్రా లో 50 రోజుల శిక్షణ పొందారు. లబ్ధిదారులతో ముచ్చటిస్తూ, వారి వద్ద నుంచి వారికందించిన శిక్షణ గురించి ప్రాథమిక సమాచారాన్ని తీసుకోవడమే కాక, ఈ ప్రాజెక్టు సహాయాన్ని తీసుకుని లెదర్ పరిశ్రమను ఏర్పాటు చేయవలసిందిగా వారికి ప్రేరణను ఇచ్చారు. ప్రధానమంత్రి దార్శనికత అయిన స్వావలంబన కలిగిన భారత్‌ను అన్న కలను నెరవర్చేందుకు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా, స్వయం ఉపాధికి సంబంధించి నూతన అవకాశాలను సృష్టించే ప్రయత్నం చేస్తోందని చైర్మన్ ఉద్ఘాటించారు. ప్రధాన రాష్ట్ర కార్యాలయం లక్నో, మీరట్ డివిజనల్ ఆఫీస్ అధికారులు, ఉత్తర్‌ప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, సిఎస్ఐఆర్ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1883668)
Visitor Counter : 128