విద్యుత్తు మంత్రిత్వ శాఖ
'జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం' జరుపుకున్న ఎన్‌టీపీసీ బొంగాయ్‌గావ్
Posted On:
14 DEC 2022 6:04PM by PIB Hyderabad


వివిధ కార్యక్రమాలతో 'జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం' జరుపుకున్న ఎన్‌టీపీసీ బొంగాయ్‌గావ్
ఎన్‌టీపీసీ బొంగాయ్‌గావ్ కర్మాగారం ప్రాంగణంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఆ సంస్థ నిర్వహించింది.
వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను తగ్గించడంలో ఇంధనం పరిరక్షణ ఒక ముఖ్యమైన అంశం. పునరుత్పాదక శక్తితో పునరుత్పాదకేతర వనరుల స్థానాన్ని భర్తీ చేయడానికి ఇది సాయపడుతుంది. ఇంధన కొరతకు తక్కువ ఖర్చుతో చూపే పరిష్కారం ఇంధన పరిరక్షణ. దీంతోపాటు, ఇంధన ఉత్పత్తిని పెంచడాన్ని నిరోధించే పర్యావరణహిత ఎంపిక కూడా. 'జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం'లో భాగంగా బొంగాయ్‌గావ్ టౌన్‌షిప్‌లోని ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, చిన్నారులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు, నినాదాలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఇంధనం ప్రాముఖ్యత గురించి, ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించడం ద్వారా దానిని ఆదా చేయవలసిన అవసరం గురించి అవగాహన పెంచడానికి మన దేశంలో ఏటా డిసెంబర్ 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుతారు.
ఈ సందర్భంగా, ఇంధన పరిరక్షణ కోసం ఎన్‌టీపీసీ బొంగాయ్‌గావ్ సీజీఎం శ్రీ కరుణాకర్ దాస్ ప్రతిజ్ఞ చేశారు. జీఎం (ఓ&ఎం) శ్రీ ఉమేష్ సింగ్, జీఎం (ఎఫ్‌ఎం) శ్రీ ఎస్‌కే ఝా, జీఎం (నిర్వహణ) శ్రీ ఇందూరి ఎస్ రెడ్డి, జీఎం (ప్రాజెక్ట్) శ్రీ అరుణాహ్సిస్ దాస్, ఏజీఎం (ఈఈఎంజీ) శ్రీ సుసోవన్ దాస్, ఈఈఎంజీ విభాగం సీనియర్ అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజువారీ జీవితంలో ఇంధనాన్ని తెలివిగా ఎలా వాడాలో, వృథాను ఎలా నివారించాలో, ఆరోగ్యకరమైన పర్యావరణం & సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఇంధనాన్ని ఆదా చేయడం ఎంత ముఖ్యమో శ్రీ దాస్ వివరించారు.
***
(Release ID: 1883666)