గనుల మంత్రిత్వ శాఖ
అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు కృషి
Posted On:
14 DEC 2022 12:57PM by PIB Hyderabad
అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు చట్టాలను చేసే అధికారాన్నికేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు నిబంధనలను రూపొందించే అధికారాన్ని గనులు, ఖనిజాలు ( అభివృద్ధి & క్రమబద్ధీకరణ) చట్టం (ఎంఎండిఆర్ యాక్ట్) 1957 లోని సెక్షన్ 23సి అధికారమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక గెజెట్‌లో నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా అక్రమ మైనింగ్, రవాణా, ఖనిజాల నిల్వ చేయడాన్ని, దానికి సంబంధించిన ప్రయోజనాలను నిరోధించేందుకు నిబంధనలను చేయవచ్చు.
చట్టంలోని సెక్షన్ 23 (సి) అంశాలకు అనుగుణంగా మొత్తం 22 రాష్ట్ర ప్రభుత్వాలు - ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ& కాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మఘాలయ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్‌లు అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు నిబంధనలను రూపొందించాయి.
అంతేకాకుండా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గనుల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కార్యాలయమైన ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌కు ఇచ్చిన సమాచారం మేరకు, రాజస్థాన్ సహా దేశంలోని పలు రాష్ట్రాలలో 2019-2020 నుంచి 2021-2022 కాలానికి అక్రమ మైనింగ్ కేసులు, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలనుఅనెక్చర్ -1లో ఇవ్వడం జరిగింది.
***
(Release ID: 1883662)