ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దేశంలో రైతు సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం అనేక చర్యలు అమలు చేస్తోంది.. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
ఆధునిక డిజిటల్ పరిజ్ఞానంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులకు సాధికారత కల్పించారు... శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
డిజిటల్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతుల ప్రయోజనాలు రక్షించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విత్తనం నుంచి మార్కెట్ విధానం నూతన ఒరవడిని సృష్టించింది.. శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
Posted On:
14 DEC 2022 4:26PM by PIB Hyderabad
ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలో రైతులకు సాధికారత కల్పించారని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంక్షేమం కోసం శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం అమలుతో మధ్య దళారుల కబంధ హాస్టల్ నుంచి రైతులకు విముక్తి కలిగిందని అన్నారు. మధ్య దళారీల దోపిడీ నుంచి రైతులు బయటపడ్డారని అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం అమలుతో ప్రభుత్వం అందిస్తున్న సహకారం రైతులకు నేరుగా అందుతోందని శ్రీ ప్రహ్లాద్ సింగ్ తెలిపారు.ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయంతో రైతులు నూతన అవకాశాలపై దృష్టి సారించారు అని మంత్రి అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ వ్యవసాయ మిషన్ ద్వారా మోదీ ప్రవేశపెట్టిన విత్తనం నుంచి మార్కెట్ విధానం నూతన ఒరవడిని సృష్టించింది అని అన్నారు. ఈ మిషన్ రైతుల జీవన స్థితిగతులను మెరుగు పరిచిందని అన్నారు.
ఇ-నామ్ మండి ద్వారా దేశవ్యాప్తంగా 1.74 కోట్ల మందికి పైగా రైతులను అనుసంధానం చేశామని తెలిపిన శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ 2.22 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే 2.36 లక్షల వ్యాపార లావాదేవీలు ఈ-నామ్ ద్వారా జరిగాయని అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశంలోని 11.37 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని, ఈ పథకం ద్వారా 2.16 లక్షల కోట్ల రూపాయలను నేరుగా ఈ రైతుల ఖాతాల్లో జమ చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. డిజిటల్ విప్లవం వల్ల ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరాయన్నారు.ఉపగ్రహం ద్వారా పంటలను పరిశీలిస్తున్నామని చెప్పారు.ఈ పథకానికి 2021-22 సంవత్సరంలో 16,000 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపిన మంత్రి 2016 నుండి 2022 వరకు ఈ పథకంలో 38 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారని అన్నారు. ఈ పథకం కింద 1,28,522 రూపాయలకు మించి క్లెయిమ్‌లు చెల్లించి 25,185 కోట్ల రూపాయలను రైతులు బీమా ప్రీమియం గా విడుదల చేశామని పేర్కొన్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ యూనియన్ కింద 3,855 కంటే ఎక్కువ ఎఫ్‌పిఓలు నమోదయ్యాయని, 22.71 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్‌లను పంపిణీ చేసి దేశవ్యాప్తంగా 11,531 టెస్టింగ్ లేబొరేటరీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని శ్రీ పటేల్ చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కు 6,057 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపిన మంత్రి మోదీ ప్రభుత్వం కేటాయింపులను దాదాపు 136 శాతం పెంచి 15,511 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు.మైక్రో ఇరిగేషన్ ఫండ్ కింద 17.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో .4710.96 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. నాబార్డ్‌లో 5 000 కోట్ల ప్రారంభ మొత్తంతో మైక్రో ఇరిగేషన్ ఫండ్ ఏర్పాటు చేశామని తెలిపిన మంత్రి 10,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ సమకూర్చామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో .7.3 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం 2022-23 లో 18.5 లక్షల కోట్లకు పెంచిందని శ్రీ పటేల్ చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద 6.46 కోట్ల మంది రైతులు ఉంటే నేడు 9.28 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని మంత్రి వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో ఎరువుల సబ్సిడీ గా 41,853 కోట్ల రూపాయలు అందించగా మోదీ ప్రభుత్వం యూరియాపై 62,151 కోట్లు (సంచిత) మరియు నాన్ యూరియాపై 40,073 కోట్లు (సంచిత) సబ్సిడీగా అందించిందని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన కిసాన్ రైలు వ్యవస్థ కింద దేశవ్యాప్తంగా 167 రూట్లలో 2359 రైళ్లు తిరిగాయని, 7.88 లక్షల టన్నులకు పైగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా జరిగిందని శ్రీ పటేల్ చెప్పారు. కిసాన్ ఉడాన్ కింద 33 కార్గో టెర్మినల్ నుంచి 12 కి పైగా వ్యవసాయ ఉత్పత్తులు రవాణా అయ్యాయని ఆయన తెలియజేశారు. డిజిటల్ విప్లవం వల్ల రైతులు బ్యాంకులను సందర్శించాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ప్రతి బ్యాంకు నుంచి ఎన్‌ఓసీ పొందే ఇబ్బందుల నుంచి రైతులు విముక్తి పొందారని శ్రీ పటేల్ అన్నారు.ప్రధాని మోదీ నాయకత్వంలో. భారతదేశం ఆహార ధాన్యాల ఎగుమతి ప్రారంభమైందని తెలిపిన మంత్రి , ముతక ధాన్యాలు, బియ్యం, పంచదార, పాలు తదితర ఎగుమతిలో భారతదేశం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది అని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అగ్రి స్టార్టప్‌లు కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయని అన్నారు. ఇంతకుముందు వ్యవసాయ రంగంలో కేవలం 100 స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని అయితే గత 7-8 ఏళ్లలో వీటి సంఖ్య 4,000కు పైగా పెరిగిందని శ్రీ పటేల్ తెలియజేశారు.ఇంతకుముందు దేశంలో రెండు మెగా ఫుడ్ పార్క్‌లు మాత్రమే ఉండేవని ఇప్పుడు వాటి సంఖ్య 23కి పెరిగిందని ఆయన అన్నారు. గడువు కంటే చాలా ముందుగానే 2021-22 నాటికి 10% ఇథనాల్ కలపడం లక్ష్యాన్ని భారత్ సాధించిందని తెలిపిన శ్రీ పటేల్ దీనివల్ల రైతులకు సకాలంలో 40,600 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని చెప్పారు.
వివిధ సంస్థలు విడుదల చేసిన నివేదికలు రైతుల మొత్తం ద్రవ్యోల్బణం-సర్దుబాటు ఆదాయం రెండింతలు లేదా చాలా రాష్ట్రాల్లో దాదాపు రెట్టింపు అయిందని స్పష్టంగా తెలియజేస్తున్నాయని మంత్రి వివరించారు. ప్రపంచంలో అత్యధిక వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తిలో నేడు భారతదేశం మొదటి లేదా రెండవ స్థానంలో ఉందని, రికార్డు స్థాయిలో రూ.3.75 లక్షల కోట్ల వ్యవసాయోత్పత్తుల ఎగుమతి జరిగిందని అన్నారు. కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షల మంది రైతులు లబ్ది పొందారని, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి నుంచి లక్ష కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది అని శ్రీ పటేల్ చెప్పారు. డ్రోన్ టెక్నాలజీలో మోదీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్‌ఓపీ వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం మరియు మోడీ ప్రభుత్వ విధానాలలో వ్యవసాయ రంగానికి సంబంధించిన తులనాత్మక వివరణ
గత ప్రభుత్వం మరియు మోడీ ప్రభుత్వ విధానాలలో వ్యవసాయ రంగానికి సంబంధించిన తులనాత్మక వివరణ
-
|
విషయం
|
సంవత్సరం ( 2006 నుంచి 2014)
|
సంవత్సరం ( 2014 నుంచి 2022)
|
-
|
వ్యవసాయ బడ్జెట్
|
1 ,48,162.16 కోట్లు ( 2006 నుంచి 2014 వరకు)
|
6 ,21,940.92 కోట్లు ( 2014 నుంచి 2022 వరకు)
|
-
|
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
|
00
|
2 .16 లక్షల కోట్లు
|
-
|
కిసాన్ సమ్మాన్ నిధి )లబ్ధిదారులు (
|
00
|
11 .37 కోట్ల మంది రైతులు
|
-
|
ఈ-నామ్ మండి
|
00
|
1260 ఈ-నామ్ మండీలు
2022 అక్టోబర్ వరకు 1 .74 కోట్లకు మించి రైతులు నమోదు.2 36 లక్షల వ్యాపార లావాదేవీలు రూ. 2 .22 లక్షల కోట్ల వ్యాపారం
|
-
|
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
|
00
|
2021-22లో రూ. 16,000 కోట్లు కేటాయింపు. 1,24,223 కోట్ల క్లైములు చెల్లింపు.
రైతుల నుంచి బీమా ప్రీమియం గా అందిన రూ. 25 ,185 కోట్లు.
|
-
|
రైతు ఉత్పత్తిదారుల సంఘం
|
00
|
10,000 మంది రైతులు
2022 అక్టోబర్ వరకు 3855 FPOలు నమోదయ్యాయి
|
-
|
సాయిల్ హెల్త్ కార్డులు
|
00
|
22 .71 కోట్లు
|
-
|
పరీక్ష
|
171
|
11 ,531 ల్యాబ్‌లకు ఆమోదం
|
-
|
ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన
|
రూ. 6057 కోట్లు
|
రూ. 15 ,511 కోట్లు( 136% పెరుగుదల)
|
-
|
మైక్రో ఇరిగేషన్ ఫండ్
|
-
|
17 .09 లక్షల హెక్టార్ల భూమి, రూ. 4710 .96 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు ఆమోదం
|
-
|
వ్యవసాయ రుణ పరపతి
|
రూ. 7 .3 లక్షల కోట్లు
|
రూ. 18 .5 లక్షల కోట్లు ( 2022 -23 )
|
-
|
కిసాన్ క్రెడిట్ కార్డ్
|
6 .46 కోట్ల మంది రైతులు
|
9 .50 కోట్ల మంది రైతులు
|
-
|
కిసాన్ రైళ్లు -
మొత్తం మార్గాలు
|
-
-
|
2359
167
|
-
|
కిసాన్ ఉడాన్ -వ్యవసాయ ఉత్పత్తుల కార్గో టెర్మినల్
|
-
-
|
33
12
|
***
(Release ID: 1883560)
Visitor Counter : 300