బొగ్గు మంత్రిత్వ శాఖ

మిషన్ కోకింగ్ కోల్ కింద ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు

Posted On: 14 DEC 2022 1:01PM by PIB Hyderabad

2030 నాటికి భారతదేశంలో దేశీయ కోకింగ్ బొగ్గు ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంపొందించడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి ప్రభుత్వం 'మిషన్ కోకింగ్ కోల్'ని ఆగస్టు, 2021లో ప్రారంభించింది. కొత్త అన్వేషణ, ఉత్పత్తి పెంపు, వాషింగ్ కెపాసిటీని పెంపొందించడం, కొత్త కోకింగ్ బొగ్గు గనుల వేలం వంటి వాటికి సంబంధించి మిషన్ కోకింగ్ కోల్ డాక్యుమెంట్ సిఫార్సులు చేసింది. దేశీయ ముడి కోకింగ్ బొగ్గు ఉత్పత్తి 2030 నాటికి 140 ఎంటి [సిఐఎస్‌ ద్వారా 105 ఎంటీ మరియు కేటాయించిన కోకింగ్ బొగ్గు బ్లాకుల ద్వారా 35 ఎంటీ]కి చేరుకునే అవకాశం ఉంది. కోకింగ్ కోల్ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమం కింద ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టింది.
 

  • ఇప్పటికే ఉన్న గనుల నుండి 26 ఎంటీ వరకు ముడి కోకింగ్ కోల్ ఉత్పత్తిని పెంచాలని సిఐఎల్ యోచిస్తోంది. 2025 ఆర్ధిక సంవత్సరం నాటికి 22 ఎంటీ పీఆర్‌సీతో పది కొత్త గనులను గుర్తించింది. అలాగే 2 ఎంటీ పీఆర్‌సీ సామర్థ్యం కలిగిన ఎనిమిది కోకింగ్ కోల్ గనులను ఆదాయ భాగస్వామ్య నమూనాపై  ప్రైవేట్ రంగానికి సిఐఎల్ అందించింది.
  • 9 కొత్త కోకింగ్ కోల్ వాషరీలను సిఐఎల్‌ ఏర్పాటు చేస్తోంది. అలాగే వాషింగ్ సామర్ద్యాన్ని పెంపొందించడానికి ఇప్పటికే ఉన్న కోకింగ్ కోల్ వాషరీలను కూడా పునరుద్ధరిస్తోంది.
  • బొగ్గు మంత్రిత్వ శాఖ గత రెండేళ్లలో 22.5 ఎంటీ పిఆర్‌సీతో ప్రైవేట్ రంగానికి 10 కోకింగ్ బొగ్గు బ్లాకులను వేలం వేసింది. వీటిలో చాలా బ్లాక్‌లు 2025 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.
  • నాలుగు కోకింగ్ కోల్ బ్లాకులను కూడా మంత్రిత్వ శాఖ  గుర్తించింది. అలాగే సిఎంపిడిఐ కూడా రాబోయే రెండు నెలల్లో 4 నుండి 6 కొత్త కోకింగ్ కోల్ బ్లాక్‌ల కోసం జీఆర్‌ని ఖరారు చేస్తుంది. దేశంలో దేశీయ ముడి కోకింగ్ బొగ్గు సరఫరా మరింత పెంచడానికి ప్రైవేట్ రంగానికి ఈ బ్లాక్‌లను తదుపరి రౌండ్ల వేలంలో అందించవచ్చు.

22.05.2022 మరియు 19.11.2022 మధ్య, ఆంత్రాసైట్ మరియు కోకింగ్ బొగ్గు దిగుమతులు నిల్  దిగుమతి సుంకాన్ని అందించాయి[ఎన్‌ఐఎల్‌ బిసిడి మరియు ఎన్‌ఐఎల్‌ ఏఐడిసి]. 19.11.2022 నుండి ఆంత్రాసైట్ మరియు కోకింగ్ బొగ్గు దిగుమతులు, ఇతర రకాల బొగ్గుతో పాటు, 2.5% కస్టమ్స్ సుంకం [I% బిసిడి మరియు 1.5% ఏఐడిసి] రాయితీ రేటును ఆకర్షిస్తుంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 10-12% దేశీయ కోకింగ్ బొగ్గును దిగుమతి చేసుకున్న కోకింగ్ బొగ్గుతో కలిపి 30%కి పెంచడానికి మరియు కోకింగ్ బొగ్గు దిగుమతిని తగ్గించడానికి ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంది.
ఇప్పటికే ఉన్న కోకింగ్ బొగ్గు ఉత్పత్తి చేసే గనుల విస్తరణ ద్వారా మరియు కొత్త కోకింగ్ బొగ్గు బ్లాకుల అమలు నుండి సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా కోకింగ్ బొగ్గు ఉత్పత్తిని పెంపొందించడానికి సిఐఎల్ నిరంతర ప్రయత్నాలను చేపడుతుంది. దేశీయ ముడి కోకింగ్ బొగ్గు ఉత్పత్తిని మెరుగుపరచడానికి సిఐఎల్‌కు చెందిన యూజీ గనులలో మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన పెట్టుబడిదారులకు ఉత్పత్తి కోసం కోకింగ్ బొగ్గు గనులను అందించడానికి సిఐఎల్‌ చర్యలు తీసుకుంటోంది.

బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.


 

****



(Release ID: 1883555) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Tamil , Kannada