సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సిఎస్‌ఈ-2022 నుండి సిఎస్‌ఈ-2030 వరకు ప్రతి సంవత్సరం డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ అధికారులను సిఫార్సు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర తెలియజేసారు.
Posted On:
14 DEC 2022 1:32PM by PIB Hyderabad
సిఎస్‌ఈ-2022 నుండి సిఎస్‌ఈ-2030 వరకు ప్రతి సంవత్సరం డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ అధికారులను తీసుకోవాలని సిఫార్సు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; ఎర్త్ సైన్సెస్; ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలియజేశారు.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ సీఎస్‌ఈ ద్వారా తీసుకునే ఐపీఎస్‌ల సంఖ్య సీఎస్‌ఈ-2020 నుండి 200కి పెంచబడిందని అలాగే ఐఎస్‌ఎస్‌ల సంఖ్య 2022లో 150కి పెరిగిందని తెలియజేశారు.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సిఎస్‌ఇ) ద్వారా సిఎస్‌ఇ-2021 వరకు ఐఎఎస్ అధికారుల వార్షిక ప్రవేశాన్ని ప్రభుత్వం 180కి పెంచింది.
01.01.2022 నాటికి మంజూరైన బలం మరియు అఖిల భారత సర్వీసు అధికారుల హోదాలో ఉన్న అధికారుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
సర్వీస్
|
మంజూరైన పోస్టులు
|
అధికారుల సంఖ్య
|
ఐఏఎస్
|
6789
|
5317
|
ఐపీఎస్
|
4984
|
4120
|
ఐఎఫ్‌ఎస్
|
3191
|
2134
|
భారత ప్రభుత్వంలోని వివిధ శాఖలు మరియు మంత్రిత్వ శాఖలలో డిప్యూటీ సెక్రటరీలు/డైరెక్టర్లు/జాయింట్ సెక్రటరీలు/అడిషనల్ సెక్రటరీలు/సెక్రటరీల పోస్టులను భర్తీ చేయడానికి సిఎస్‌ఎస్ వివిధ అనుబంధసేవల అధికారులను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ అధికారులలో డిప్యుటేషన్ కోసం ఎంపిక చేసిన వారిని ఈ పోస్టుల నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు.
ఖాళీలు ఏర్పడటం మరియు భర్తీ చేయడం అనేది నిరంతర ప్రక్రియ. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) ప్రతి సంవత్సరం ఐఏఎస్,ఐపీఎస్ మరియు ఐఎస్‌ఎస్‌లలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రమోషన్ కోటాలో ఖాళీలను భర్తీ చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) సెలక్షన్ కమిటీ సమావేశాలను నిర్వహిస్తుంది.
***
(Release ID: 1883553)
Visitor Counter : 157