శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బయోటెక్నాలజీ శాఖ సమకూర్చిన నిధులతో ఉత్తమ శాస్త్రవేత్తలు, సంస్థలతో రైతులను అనుసంధానం చేసేందుకు 51 బయో టెక్ కిసాన్ కేంద్రాల ఏర్పాటుకు . కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
సాంకేతిక అంశాల వినియోగం, ఉత్తమ వ్యవసాయ విధానాల అమలుతో సన్న, చిన్న మరియు సన్న కారు రైతులతో రైతులతో కలిసి పనిచేసి పంట దిగుబడి ఎక్కువ చేయడం లక్ష్యంగా కార్యక్రమం అమలు.. డాక్టర్ జితేంద్ర సింగ్
దిగుబడి పెరిగి ఆదాయం పెరగడంతో కార్యక్రమం వల్ల నాలుగు లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం
గ్రామీణ ప్రాంతాల్లో 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నూతన అవకాశాలు
Posted On:
14 DEC 2022 12:30PM by PIB Hyderabad
బయోటెక్నాలజీ శాఖ సమకూర్చిన నిధులతో ఉత్తమ శాస్త్రవేత్తలు, సంస్థలతో రైతులను అనుసంధానం చేసేందుకు దేశంలో 51 బయో టెక్ కిసాన్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించామని కేంద్ర శాస్త్ర సాంకేతిక,భూ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు,అణు శాస్త్రం,అంతరిక్ష శాఖ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు తెలిపారు. వీటిలో 44 బయో టెక్ కిసాన్ కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయని అన్నారు. దేశంలో 15 వ్యవసాయ వాతావరణ మండలాల్లో ఉన్న 169 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో డాక్టర్ జితేంద్ర సింగ్ రైతుల-కేంద్రీకృత మిషన్ 'బయోటెక్-కృషి ఇన్నోవేషన్ సైన్స్ అప్లికేషన్ నెట్‌వర్క్' (బయోటెక్-కిసాన్)ను బయోటెక్నాలజీ శాఖ (డిబిటి) అమలు చేస్తున్నాదని తెలిపారు. ఈ కార్యక్రమం భారతీయ రైతులను ఉత్తమ శాస్త్రవేత్తలు మరియు సంస్థలతో అనుసంధానం చేస్తుంది.
సాంకేతిక అంశాల వినియోగం, ఉత్తమ వ్యవసాయ విధానాల అమలుతో సన్న, చిన్న మరియు సన్న కారు రైతులతో రైతులతో కలిసి పనిచేసి పంట దిగుబడి ఎక్కువ చేయడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుంది అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. స్థానిక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం, అందుబాటులో ఉన్న సాంకేతికతలు/పరిష్కార మార్గాలు గుర్తించడం, ప్రదర్శన మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం, శాస్త్రవేత్తలు-రైతుల మధ్య దృఢమైన సంబంధాలు కల్పించేందుకు ఒక వేదికను అభివృద్ధి చేయడం, రైతులకు శిక్షణ కార్యక్రమాలు అమలు చేయడం, రైతులతో కలిసి పనిచేసే అంశంలో శాస్త్రవేత్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, రేడియో/టీవీ మరియు సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడం, ఎంపిక చేసిన రైతులకు ఫెలోషిప్ మరియు మహిళా రైతులకు ప్రత్యేక పరిష్కార-ఆధారిత థీమాటిక్ ఫెలోషిప్‌లు అందించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుంది.
సాంకేతిక అంశాలను అమలు చేయడం రైతుల ఆదాయాన్ని ఎక్కువ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో బయో ఆధారిత సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుంది. పంట దిగుబడి ఎక్కువ చేయడం, ఆదాయ వనరులను పెంపొందించడం ద్వారా కార్యక్రమం కింద ఇప్పటికే నాలుగు లక్షల మంది రైతులకు ప్రత్యక్షంగా/పరోక్షంగా ప్రయోజనం కలిగింది. కార్యక్రమం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 200 పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలు ప్రారంభించారు. కార్యక్రమం కింద ఇంతవరకు 9554.146 రూపాయల సహకారాన్ని అందించింది.
శాస్త్రవేత్తలు, రైతుల మధ్య అనుసంధానం సాధించేందుకు వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు/శాఖలు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. 731 కృషి విజ్ఞాన కేంద్రాలకు (కేవీకె ) వ్యవసాయ పరిశోధన,విద్య శాఖ (డేర్)/ భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఆర్) సహకారం అందిస్తున్నాయి. మేరా గావ్ మేరా గౌరవ్ ( MGMG), షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్ (SCSP) ప్రోగ్రామ్ మరియు ఫార్మర్ ఫస్ట్ వంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలను అందించేందుకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, లక్నో అందిస్తున్నాయి. దీనికోసం వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక లాంటి వివిధ అంశాలపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. వీటికి అదనంగా బయోటెక్-కోసం ద్వారా మంత్రిత్వ శాఖ రైతులకు సామాజిక సహకారం అందిస్తోంది.
***
(Release ID: 1883476)
Visitor Counter : 147