ఆయుష్
azadi ka amrit mahotsav

ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా డబ్ల్యూహెచ్‌వో-జీసీటీఎం

प्रविष्टि तिथि: 13 DEC 2022 5:05PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ నిధులతో నడుస్తున్న డబ్ల్యూహెచ్‌వో-హెచ్‌క్యూ (జెనీవా) వెలుపలి కేంద్రం డబ్ల్యూహెచ్‌వో-జీసీటీఎం. డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పరచడంలో ఇది సాయపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా డబ్ల్యూహెచ్‌వో-జీసీటీఎం ఉద్భవిస్తుంది. సాంప్రదాయ ఔషధాల అభివృద్ధి, పరిశోధనలను ఇది ప్రోత్సహిస్తుంది. సాంప్రదాయ ఔషధాల గురించి సాక్ష్య సహిత పరిశోధన, శిక్షణ, అవగాహనను బలోపేతం చేస్తుంది.

డబ్ల్యూహెచ్‌వో-జీసీటీఎం కార్యకలాపాలు/పరిధి ఇది:

  1. ఆరోగ్య పరిశోధన విధానాల అభివృద్ధి, రూపకల్పన; అంతర్జాతీయ నిబంధనలు, ప్రమాణాల ఏర్పాటు; దేశాలకు సాంకేతిక సహాయాన్ని అందించడం; సాంప్రదాయ ఔషధాల కోసం ఆరోగ్య చికిత్సల్లో మార్పులను పర్యవేక్షించడం, అంచనా వేయడం వంటి వాటికి మార్గదర్శిగా వ్యవహరించడం
  2. పరిశోధన విధానాల ప్రమాణాలను రూపొందించడం, సాంప్రదాయ వైద్యంలో వైద్య శిక్షణ, విధానాల కోసం ప్రమాణాలను అభివృద్ధి చేయడం.
  3. సాంప్రదాయ ఔషధాల నాణ్యత, భద్రత, సమర్థత, అందుబాటు, హేతుబద్ధమైన వినియోగాన్ని నిర్ధరించడం.
  4. సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి, ప్రభావాన్ని అంచనా వేయడానికి సంబంధిత సాంకేతిక అంశాలు, సాధనాలు, పద్ధతుల్లో నిబంధనలు, ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించడం.
  5. డబ్ల్యూహెచ్‌వోతో పాటు, ప్రత్యేక కార్యక్రమాలు (ఐఏఆర్‌సీ, డబ్ల్యూహెచ్‌వో అకాడమీ, టీడీఆర్‌, అలయన్స్‌ ఫర్‌ హెల్త్‌ పాలసీ రీసెర్చ్, స్పెషల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ పీహెచ్‌సీ), ఇతర యూఎన్‌ సంస్థలు, డబ్ల్యూహెచ్‌వో సహకార కేంద్ర నెట్‌వర్క్‌లు, అంతర్జాతీయ సంస్థలు, ప్రొఫెషనల్‌ అసోసియేషన్లు, లక్ష్య నిర్దిష్ట న్యాయవాద బృందాల మధ్య లక్ష్యాలకు సంబంధించిన అంశాల్లో భాగస్వామ్యాలు మరియు సహకారాలను నిర్మించడం.
  6. లక్ష్యాలకు సంబంధించిన అంశాల్లో నిర్దిష్ట సామర్థ్యం పెంపు, శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం; ప్రాంగణం, నివాసం లేదా వెబ్ ఆధారితంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ; డబ్ల్యూహెచ్‌వో అకాడమీ, ఇతర వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం
  7. సాంప్రదాయ ఔషధాల కోసం ఆరోగ్య సాంకేతికత అంచనా, ఆరోగ్య ఆర్థిక మార్గదర్శకాలను అభివృద్ధి చేయడంలో మార్గదర్శిగా వ్యవహరించడం, దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలకు మద్దతు ఇవ్వడం.

ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్‌ ఇవాళ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు తెలిపారు.

 

****


(रिलीज़ आईडी: 1883300) आगंतुक पटल : 138
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi