నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
సౌర, విశేష మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థితిగతులు
Posted On:
13 DEC 2022 5:23PM by PIB Hyderabad
ప్రధానమంత్రి- కుసుమ్ పథకం కింద మొత్తం రూ. 34422 కోట్ల కేంద్ర ఆర్థిక మద్దతును 31.3.2026 దాకా కొనసాగిస్తున్నారు. ఇది డిమాండ్ ఆధారిత పథకం, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతల నుంచి అందుకున్న డిమాండ్ ఆధారంగా పథకం దాని సామర్ధ్యాలను కేటాయంచడం జరుగుతుంది.
ఈ పథకం కింద సోలార్ పార్కులు (సౌర పార్కులు), అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టులు మొత్తం 39. 286 మెగావాట్ల మొత్తం సామర్ధ్యంతో 57 సోలార్ పార్కులను అభివృద్ధి చేసేందుకు 30.11.2022 వరకు మంజూరు చేశారు.
ఇంతవరకూ, 10,027 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ పార్కులలో ప్రారంభించగా, కొన్ని పార్కుల నిదానమైన పురోగతి కారణంగా రద్దు చేశారు. ఈపథకంలో ఎదుర్కొన్న సవాళ్ళను, అనగా, స్పష్టమైన భూమి సేకరణ, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ తరలింపు మౌలిక సదుపాయాల మధ్య కాలక్రమం, గుజరాత్, రాజస్థాన్‌లలో బట్టమేక పక్షి (జిఐబి); కోవిడ్ మహమ్మారి మొదలైన వాటి కారణంగా అమలులో వేగం గణనీయంగా తగ్గడం తదితరాలు.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యుత్, నూతన, పునరావృత ఇంధన శాఖా మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ మంగళవారంనాడు రాజ్యసభకు ఇచ్చిన లిఖిత సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1883279)