వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎస్.ఇ.జెడ్ యూనిట్లకు ఇంటినుంచి పనిచేసే నిబంధనలను
సరళతరం చేస్తూ, సవరణలు తీసుకువచ్చిన వాణిజ్యవిభాగం
వర్క్‌ఫ్రం హోంకు 31.12.2023 వరకు అనుమతి.
ఎస్.ఇ.జెడ్‌యూనిట్‌కు చెందిన ఉద్యోగులు అందరికీ వర్క్‌ఫ్రం హోం వర్తింపు.
प्रविष्टि तिथि:
09 DEC 2022 2:29PM by PIB Hyderabad
ఎస్.ఇ.జెడ్ యూనిట్లకు వర్క్ ఫ్రం హోం కు సంబంధించి నిబంధనలను మరింత సరళతరం చేస్తూ వాణిజ్య విభాగం , ఎస్‌ఇజెడ్ నిబంధనలకు సవరణలు తీసుకువచ్చింది.దీనితోపాటు వాణిజ్య విభాగం, ఇందుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఒపి)ని 12.08.2022 తేదీతో జారీచేసింది. అన్ని ఎస్.ఇ.జెడ్ లలో ఈ నిబంధనల అమలును క్రమబద్ధీకరించేందుకు వీటిని జారీచేశారు.
రూల్ 43 ఎ నోటిఫికేషన్ అనంతరం,12.08.2022 తేదీతో మార్గదర్శకాల జారీ తర్వాత, నాస్‌కామ్‌నుంచి వాణిజ్య విభాగం పలు విజ్ఞప్తులను అందుకుంది. ఇవి వర్క్‌ఫ్రం హోం సదుపాయాన్ని మరింత సరళతరం చేయాల్సిందిగా వినతి పత్రాలు సమర్పించాయి. ఈ అంశాన్ని వాణిజ్యవిభాగం పరిశీలించి, వివిధ స్టేక్‌హొల్డర్లతో సంపద్రించిన అనంతరం,రూల్ 43 ఎ ను కొత్త నిబంధన జిఎస్‌ఆర్ 868(ఇ) తేదీ 08.12.2022 తో మార్చారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి న ముఖ్యమైన అంశాలు కింది విధంగా ఉన్నాయి.
స్టేక్‌హొల్డర్లతో సమావేశం అనంతరం వర్క్‌ఫ్రం హోం నిబంధనలను గణనీయంగా సరళతరం చేయడంజరిగింది.గతంలో అనుమతుల ఆధారిత కాలం ఉండగా, ప్రస్తుతం దానిని సమాచారం అందించే ఆధారిత కాలంగా మార్చడం జరిగింది.
ఎస్.ఇ.జెడ్ లోని నూరుశాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించడం జరుగుతుంది.
వర్క్‌ఫ్రం హోం సదుపాయం 31.01.2023 వరకు అనుమతిస్తారు.
భవిష్యత్తులో వర్క్‌ఫ్రం హోం సదుపాయం కోరుకునే సంస్థలు వర్క్‌ఫ్రం హోం ను ప్రారంభించే ముందు గా ఈ మెయిల్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందిచవచ్చు.
హైబ్రిడ్ పద్ధతిలో పనిచేయడం అనేది సాధారణ విధానంగా ఉంది. ప్రత్యేకించి ఐటి, ఐటిఇఎస్ రంగాలలో పనికి కోవిడ్ మహమ్మారి కారణంగా అంతరాయం కలిగింది. ఐటి, ఐటిఇఎస్ రంగాలకు చెందిన ప్రతినిధులు ఈ విషయమై వాణిజ్య విభాగానికి విజ్ఞప్తులు పంపుకుంటూ, ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (ఎస్.ఇ.జెడ్)లలో హైబ్రిడ్‌పద్ధతిలో పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని, ఎస్.ఇ.జెడ్ సిబ్బందికి వర్క్‌ఫ్రం హోంకు వీలు కల్పించాలని కోరాయి. ఎస్.ఇ.జెడ్ రంగం వాస్తవ అవసరాలను దృష్టిలోఉంచుకుని టైర్ `2, టైర్ 3నగరాలకు జరిగే ఆర్థికవ్యవస్థలకు కలిగే ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని వర్క్‌ఫ్రం హో సదుపాయాన్నికల్పించడం జరిగింది.
***
(रिलीज़ आईडी: 1883068)
आगंतुक पटल : 212