పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

10 అంతర్జాతీయ భాషలతో సహా 12 భాషల్లో 24x7 బహుభాషా పర్యాటక సమాచార-సహాయ కేంద్రాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది: శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 12 DEC 2022 4:07PM by PIB Hyderabad

 పర్యాటకుల భద్రత మరియు రక్షణ   అనేది  రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. అయితే,  పర్యాటకులకు కల్పించాల్సిన  భద్రతపై పర్యాటక మంత్రిత్వ శాఖకు పూర్తి అవగాహన ఉంది. పర్యాటకులకు సురక్షితమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి   పర్యాటక మంత్రిత్వ శాఖ సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంది.

 

పర్యాటకులకు భద్రత మరియు రక్షణ కల్పించే అంశంలో గతంలో పర్యాటక మంత్రిత్వ శాఖ  అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల (UT) యంత్రాగాలతో చర్చలు జరిపింది. పర్యాటకులకు భద్రత మరియు రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. పర్యాటకులకు ఊహించని విధంగా  అవాంఛనీయ సంఘటన జరిగిన సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి, పర్యాటకులకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించడానికి పటిష్టమైన శాంతి భద్రతల వ్యవస్థ అభివృద్ధి చేయాలని  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పర్యాటక శాఖ సూచించింది. 

 పర్యాటక మంత్రిత్వ శాఖ సూచనకు  ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించాయి.   రంగంలోకి దిగాయి.పర్యాటకుల భద్రత, రక్షణ కోసం పోలీసు వ్యవస్థను సిద్ధం చేశాయి. 

 

పర్యాటకులకు అవసరమైన పోలీసు యంత్రాంగం పనిచేయాల్సిన తీరు తెలుసుకుని, పర్యాటకుల అవసరాలపై పోలీస్ శాఖకు అవగాహన కల్పించి దీనికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి అన్న అంశంపై తన అధీనంలో స్వయంప్రతిపత్త సంస్థగా పనిచేస్తున్నఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ ద్వారా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ అధ్యయన నివేదిక నకలును  "రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పర్యాటక  పోలీసుల పని, అత్యుత్తమ అభ్యాసాల నివేదిక " పేరుతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది.  సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో  ప్రత్యేక పోలీసు విభాగాన్ని నెలకొల్పి, పర్యాటకుల అవసరాలపై వారికి అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. 

  ఈ అంశాన్నిరాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖ సహాయాన్ని కోరింది.

 సమగ్ర పోలీసు వ్యవస్థ అభివృద్ధిపై  బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPR&D) పర్యాటక పోలీసు యంత్రాంగంపై అధ్యయనాన్ని నిర్వహించింది.జాతీయ స్థాయిలో ఒకే విధమైన పర్యాటక పోలీసు వ్యవస్థను అభివృద్ధి చేసి, అమలు చేయడానికి 2022 అక్టోబర్ 19 న న్యూఢిల్లీలో టూరిజం మంత్రిత్వ శాఖ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల  పోలీస్డీజీలు/ఐజీల జాతీయ సదస్సును నిర్వహించింది.

 పర్యాటక మంత్రిత్వ శాఖ 10 అంతర్జాతీయ భాషలు (జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, చైనీస్,జపనీస్, కొరియన్, అరబిక్)  సహా 12 భాషల్లో టోల్ ఫ్రీ నంబర్ 1800111363 లేదా షార్ట్ కోడ్ 1363లో 24x7 బహుళ-భాషా పర్యాటక సమాచారం-సహాయం-లైన్‌ను ఏర్పాటు చేసింది. స్వదేశీ పర్యాటకుల కోసం హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ సౌకర్యం ద్వారా దేశ,  విదేశీ పర్యాటకులు  భారతదేశంలో ప్రయాణానికి సంబంధించిన సమాచారం, సహాయ సేవలు పొందవచ్చు.  భారతదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆపదలో ఉన్న పర్యాటకులకు తగిన మార్గదర్శకత్వం అందించడానికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది. 

అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక శాఖ లతో సహా పర్యాటక రంగంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల సహకారంతో భారతదేశంలో 'సురక్షితమైన, గౌరవనీయమైన పర్యాటకం కోసం ప్రవర్తనా నియమావళి' ని  పర్యాటక మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.  గౌరవం,భద్రత, రక్షణ పర్యాటకుల  ప్రాథమిక హక్కుగా పర్యాటక శాఖ గుర్తించింది. మార్గదర్శకాలకు అనుగుణంగా పర్యాటకులు, స్థానిక నివాసితులు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల దోపిడీకి గురి కాకుండా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయి. 

 ఈ విషయాన్ని పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

 

***

 


(Release ID: 1882872) Visitor Counter : 158