సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఇ రంగంలో విదేశీ పెట్టుబడులు
Posted On:
12 DEC 2022 1:29PM by PIB Hyderabad
యోగ్యత కలిగిన పెట్టుబడి సంస్థల పరిమాణం, స్థాయితో సంబంధం లేకుండా ఏకరీతిగా అమలు అయ్యే సహాయక విధానమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ). ఎఫ్‌డిఐని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెట్టుబడిదారుఅనుకూల విధానాన్ని రూపొందించింది. ఇందులో కొన్ని వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాలు/ కార్యకలాపాలను మినహాయించి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ)సహా పలు రంగాలు / కార్యకలాపాలు ఆ రంగ చట్టాలు, నిబంధనలు, నియమాలు, రక్షణ షరుతులు, రాష్ట్ర/ స్థానిక/ చట్టాలు/ నిబంధనలకు కట్టుబడి యాంత్రిక మార్గం ద్వారా 100% ఎఫ్‌డిఐలను స్వాగతిస్తున్నాయి.
కాగా, ఎంఎస్ఎంఇ రంగంలో విదేశీ పెట్టుబడుల వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలను పోటీతత్వం, సాధ్యత దృష్టికోణంపై మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ధిష్ట అధ్యయనాన్ని నిర్వహించలేదు.
దేశంలో ఎంఎస్ఎంఇ రంగం అభివృద్ధి, ప్రోత్సహించే లక్ష్యంతో అనేక పథకాలు, కార్యక్రమాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.
ఇందులో ఎంఎస్ఎంఇ చాంపియన్ పథకం, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు నిధులను హామీ ఇచ్చే ట్రస్టు (సిజిటిఎంఎస్ఇ), ప్రధానమంత్రి ఉపాధి పథకం (పిఎంఇజిపి), సూక్ష్మ, చిన్న పరిశ్రమలు - సామూహిక అభివృద్ధి కార్యక్రమం (క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం - ఎంఎస్ఇ -సిడిపి) సహా పలు పథకాలు ఉన్నాయి.
ఎంఎస్ ఎంఇ రంగానికి తోడ్పాటును అందించేందుకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంది.
1) ఎంఎస్ఎంఇలు సహా అత్యవసర పరపతి హామీ పథకం ( ఎసిఎల్‌జిఎస్) కింద వ్యాపారం కోసం రూ. 5 లక్షల కోట్ల అనుషంగిత షరతులు లేని యాంత్రిక రుణాలు.
2) ఆత్మనిర్భర భారత్ నిధ ద్వారా రూ. 50,000 కోట్ల ఈక్విటీ పంపిణీ. భారత ప్రభుత్వం నుంచి రూ. 10,000 కోట్ల కార్పస్‌ను కలిగి ఉండే సదుపాయం ఉంది.
3) ఎంఎస్ఎంఇలను వర్గీకరించేందుకు సవరించిన నూతన ప్రమాణాలు.
4) వ్యాపారం చేయడాన్ని సులభతరం చేసందుకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంఎస్ఎంఇల నూతన రిజిస్ట్రేషన్.
5) రూ. 200 కోట్ల వరకు సేకరణ కోసం గ్లోబల్ టెండర్లు ఉండవు.
6) చిల్లర, టోకు వ్యాపారులను 02 జులై, 2021 నుంచి ఎంఎస్ఎంఇలలో చేర్చడం.
7) ఎంఎస్ఎంఇల స్థాయి ఊర్ధ్వముఖంగా మారుతుంటూ పన్నేతర ప్రయోజనాలను 3 ఏళ్ళవరకు కొనసాగింపు.
8) నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఇలు ఉపాధి కోరుతున్నవారి కోసం ఎన్‌సిఎస్‌లో అన్వేషిస్తున్న ఫలితంగా కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఉదయం పోర్టల్, నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సిఎస్)లను విలీనం .
ఈ సమాచారాన్ని సూక్షమ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ భానుప్రతాప్ సింగ్ వర్మ సోమవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
****
(Release ID: 1882870)
Visitor Counter : 136