ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
800 మిలియన్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద 'కనెక్ట్' దేశంగా భారతదేశం .. కేంద్ర సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ 2022 ముగింపు సమావేశంలో ప్రసంగించిన శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
12 DEC 2022 9:11AM by PIB Hyderabad
800 మిలియన్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద 'కనెక్ట్' దేశంగా భారతదేశం అవతరించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. నిన్న జరిగిన ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ 2022 ముగింపు సమావేశంలో శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రసంగించారు. 'సాధికారత కలిగిన భారతదేశం అభివృద్ధికి సాంకేతిక వినియోగం' అనే అంశంపై సమావేశం జరిగింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి శ్రీ ఆల్కేష్ కుమార్ శర్మ,ఇతర ప్రముఖులు సమావేశానికి హాజరయ్యారు.
ముగింపు సమావేశంలో మాట్లాడిన శ్రీ చంద్రశేఖర్ దేశంలో 800 మిలియన్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం వినియోగిస్తున్నారని అన్నారు. 800 మిలియన్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద 'కనెక్ట్' దేశంగా భారతదేశం గుర్తింపు పొందిందని అన్నారు. 5జి మరియు భారత్ నెట్ అందిస్తున్న అతి పెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ నెట్ వర్క్ ను 1.2 బిల్లియన్లకు పైగా ప్రజలు వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో భారతదేశం మాత్రమే వినియోగదారులను కలిగి ఉందని మంత్రి వివరించారు. పరిస్థితికి అనుగుణంగా సాంకేతిక ఆవిష్కరణలు తీసుకువస్తున్నామని దీనికి అనుగుణంగా నియంత్రణ విధానాలను రూపొందిస్తున్నామని శ్రీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ గ్లోబల్ స్టాండర్డ్ సైబర్ లా వ్యవస్థ మూడవ దశలో సంబంధిత వర్గాలు పాల్గొంటాయని పేర్కొన్న మంత్రి దీనివల్ల భారతదేశ ఇంటర్నెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్థిక పురోభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు.
ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో అభివృద్ధి చెందిన విధంగా దక్షిణ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను డిజిలీ కరణ చేయలేక పోయాయని శ్రీ చంద్రశేఖర్ అన్నారు. ఈ రంగంలో ప్రపంచ దేశాలకు అవసరమైన సహకారం, సాంకేతిక అంశాలను అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. గుర్తింపు ప్రమాణీకరణ అంశంలో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించిందని అన్నారు. తమ ఆర్థిక వ్యవస్థలను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న అన్ని దేశాలకు భారతదేశం సహకరిస్తుందని జీ20 అధ్యక్ష హోదాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన అంశాన్ని మంత్రి గుర్తు చేశారు. భారతదేశ తరహాలో పరిపాలన సాగించాలని భావిస్తున్న అన్ని దేశాలకు భారతదేశం అండగా ఉంటుందని అన్నారు. అనేక ప్రయత్నాలు జరిగిన తర్వాత భారతదేశం తన ఇంటర్నెట్ వ్యవస్థకు బహుముఖ రూప వ్యవస్థగా అభివృద్ధి చేయడంలో విజయం సాధించిందని మంత్రి పేర్కొన్నారు. రానున్న సంవత్సరాల్లో బహుముఖ రూప వ్యవస్థ కేవలం మేధావుల చర్చకు పరిమితం కాకుండా మరింత వృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరగాలని అన్నారు. సురక్షిత, నమ్మదగిన వినూత్న ఆవిష్కరణలు, జవాబుదారీతనం వృద్ధికి దోహదపడతాయని అన్నారు. డిజిటల్ విధానాలు నమ్ముతున్న ప్రజలకు వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలని మంత్రి అన్నారు.
డిజిటల్ అక్షరాస్యతలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి శ్రీ ఆల్కేష్ కుమార్ శర్మ అన్నారు. డిజిటల్ రంగంలో అవసరమైన నైపుణ్య అభివృద్ధికి డిజిటల్ ఇండియా మిషన్ కృషి చేస్తుందని అన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సాధించిన అభివృద్ధితో నవ భారతదేశ నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రతి ఒక్కరికి కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో 'సాధికారత కలిగిన భారతదేశం అభివృద్ధికి సాంకేతిక వినియోగం' అనే అంశంపై ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ 2022 జరిగిందని అన్నారు. దీనివల్ల లక్ష్య సాధన దిశలో భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని శ్రీ ఆల్కేష్ కుమార్ శర్మ అన్నారు. గోప్యత, రక్షణ, డేటా, భద్రత, సంరక్షణ అంశాలపై పదునైన చట్టాలు రూపొందించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. రాబోయే మూడేళ్లలో ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారించి పని చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్:
ఐక్యరాజ్య సమితి ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ కి అనుబంధంగా ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ పనిచేస్తోంది. ఇంటర్నెట్ రంగంతో సంబంధం కలిగిన వివిధ వర్గాలను ఒక వేదిక పైకి తీసుకు రావడానికి ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ కృషి చేస్తోంది. వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులను ఒక వేదిక పైకి తెచ్చి ఇంటర్నెట్ సంబంధిత విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ సహకారం అందిస్తోంది.
***
(Release ID: 1882743)
Visitor Counter : 199