ప్రధాన మంత్రి కార్యాలయం
‘మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’కు నాగ్‌పూర్‌లో ప్రధానమంత్రి ప్రారంభోత్సవం
Posted On:
11 DEC 2022 2:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నాగ్‌పూర్‌లో ‘హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’ ఫేజ్-1ను ప్రారంభించారు. మొత్తం 520 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నాగ్‌పూర్-షిర్డీలను కలుపుతుంది. ఈ సందర్భంగా ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“అత్యున్నత నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు మేం కట్టుబడి ఉన్నాం. నాగ్‌పూర్-షిర్డీ మధ్య మహామార్గం మా కృషి ఒక నిదర్శనం. ఈ ఆధునిక రహదారి ప్రాజెక్టును ప్రారంభించడమేగాక ఈ మార్గంలో నేను ప్రయాణించాను. మహారాష్ట్ర మరింత ఆర్థిక ప్రగతి సాధించడంలో ఇది ఎంతగానో తోడ్పడగలదని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం వచ్చిన ప్రధానమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సాదర స్వాగత సత్కారాలు చేశారు. అనంతరం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్, కేంద్ర రహదారులు-రోడ్డురవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
నాగ్‌పూర్-షిర్డీల మధ్య 520 కిలోమీటర్ల పొడవైన ‘హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’ ఫేజ్-1ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలో అనుసంధానం మెరుగుపై ప్రధానమంత్రి దూరదృష్టికి అనుగుణంగా ముందడుగులో ఈ సమృద్ధి మార్గం లేదా నాగ్‌పూర్-ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ ప్రెస్ రహదారి ప్రాజెక్టు ఒక భాగం. కాగా, రూ.55,000 కోట్లతో 701 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారి దేశంలోని అత్యంత పొడవైన ఎక్స్ ప్రెస్ మార్గాల్లో ఒకటి. ఇది మహారాష్ట్రలోని 10 జిల్లాల మీదుగా సాగుతుంది. అలాగే ప్రసిద్ధ అమరావతి, ఔరంగాబాద్, నాసిక్ నగరాలను తాకుతూ వెళ్తుంది. మరోవైపు పరిసర 14 జిల్లాలతో అనుసంధానం మెరుగుపరుస్తుంది. తద్వారా విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్రసహా రాష్ట్రంలోని 24 జిల్లాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.
ప్రధానమంత్రి గతిశక్తి కింద సమీకృత ప్రణాళిక, మౌలిక సదుపాయాల అనుసంధాన ప్రాజెక్టుల సమన్వయంపై ప్రధాని దృక్కోణానికి అనుగుణంగా ఈ రహదారి రూపొందింది. ఈ నేపథ్యంలో సదరు సమృద్ధి మహామార్గం ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్‌వే, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, అజంతా-ఎల్లోరా గుహలు, షిర్డీ, వెరుల్, లోనార్ తదితర పర్యాటక ప్రదేశాలతోనూ అనుసంధానం అవుతుంది. మొత్తంమీద మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలో సమృద్ధి మహామార్గ్ కీలకపాత్ర పోషిస్తుంది.
*****
DS/TS
******
(Release ID: 1882697)
Visitor Counter : 211
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam