ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఐవైఓఎం, మెగా ఫుడ్ ఈవెంట్ 2023కి సంబంధించిన కార్యకలాపాలపై రెసిడెంట్ కమిషనర్‌లతో ఎఫ్‌పిఐ కార్యదర్శి రౌండ్ టేబుల్
Posted On:
10 DEC 2022 9:13AM by PIB Hyderabad
రెసిడెంట్ కమీషనర్‌లతో ఎఫ్‌పిఐ కార్యదర్శి డిసెంబర్ 8న జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రతిపాదిత మెగా ఫుడ్ ఈవెంట్ కోసం మంత్రిత్వ శాఖ కార్యాచరణ ప్రణాళికను తెలియజేయడం, సహకారానికి సాధ్యమైన రంగాలను చర్చించడం రౌండ్ టేబుల్ ఎజెండా.
ప్రధాన ప్రసంగం సందర్భంగా, 2023 అక్టోబర్‌లో మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు, మంత్రిత్వ శాఖ ఇంతకుముందు నిర్వహించిన కార్యక్రమాల కంటే చాలా పెద్ద స్థాయిలో ఇది జరగనున్నట్టు ఎఫ్‌పిఐ సెక్రటరీ ఆర్‌సిలకు వివరించారు. ఈ ఈవెంట్ రాష్ట్రాలు, యుటిలకు రాష్ట్ర / యుటి-నిర్దిష్ట అవకాశాలను ప్రదర్శించడానికి, ప్రపంచ, దేశీయ వ్యాపార నాయకులు, సరఫరాదారులు, కొనుగోలుదారులు, సాంకేతిక ప్రదాతలతో పరస్పర సహకారం కోసం, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఫుడ్ రిటైల్ రంగాలలో పెట్టుబడి & సోర్సింగ్ ఆసక్తులను రూపొందించడానికి వేదికను అందిస్తుంది.
ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు ఫీడ్‌బ్యాక్ / సూచనలను పంచుకోవాలని అన్ని రాష్ట్రాలు / యుటిలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని, అలాగే అవగాహన కల్పించడంలో మంత్రిత్వ శాఖకు మద్దతు ఇవ్వాలని, సీనియర్ పాలసీ మేకర్స్, అగ్రి-ఫుడ్ కంపెనీలు, ఎఫ్‌పిఓలు / ఎస్‌హెచ్‌జిలు, మెగా ఫుడ్ ఈవెంట్‌లో సంబంధిత వాటాదారులందరి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి కూడా వారిని అభ్యర్థించారు.
చిరుధాన్యాలు, చిరుధాన్యాల ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తుల అనేక ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి మంత్రిత్వ శాఖ ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’లో భాగంగా అనేక కార్యక్రమాలను ప్లాన్ చేస్తుందని కూడా పాల్గొనేవారికి తెలియజేసారు.
2023 సంవత్సరం పొడవునా, మెగా ఫుడ్ ఈవెంట్ 2023 సమయంలో ప్లాన్ చేసిన కార్యకలాపాలలో పాల్గొంటామని ఆర్‌సిలు, ఎంఓఎఫ్పిఐకి మద్దతునిస్తున్నట్టు హామీ ఇచ్చాయి. కొన్ని సూచనలు / ఫీడ్‌బ్యాక్‌లలో మెగా ఫుడ్ ఈవెంట్ ఫోకస్డ్ క్యాంపెయిన్ అవసరాలు అలాగే దేశీయంగా & అంతర్జాతీయ ఎక్స్‌పోలో ఉంటాయి. సూక్ష్మ వ్యాపారవేత్తలు, ఎఫ్ పి ఓలు, ఎస్ హెచ్ జిలకు సహాయపడే ప్రణాళికాబద్ధమైన శిఖరాగ్ర సమావేశాలు, జిల్లా స్థాయి శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడం; సాంప్రదాయక అంశాలను ప్రదర్శించడం, మెగా ఈవెంట్ ప్రచారం కోసం పర్యాటక పరిశ్రమతో సాధ్యమైన అనుబంధం మొదలైనవి ఈ మెగా కార్యక్రమంలో ప్రధాన అంశాలు.
.
ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ సెల్ (ఇన్వెస్ట్ ఇండియా) గుర్తించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకోవాలని, రాష్ట్రాలు / యుటిల క్రియాశీల భాగస్వామ్యాన్ని కలిపిస్తూ అవసరమైన మద్దతును నిర్ధారించాలని సూచించారు.
భారతీయ ఆహార ప్రాసెసింగ్ రంగం బలాన్ని ప్రదర్శించడానికి అలాగే మెగా ఈవెంట్ గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు చురుకుగా పాల్గొనడానికి మంత్రిత్వ శాఖతో నిమగ్నమవ్వాలని ఎఫ్‌పిఐ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, యూటీ లను కోరారు.
***
(Release ID: 1882631)
Visitor Counter : 148