రైల్వే మంత్రిత్వ శాఖ
బిహెచ్‌యు, ఐఐటి, బిహెచ్‌యు విద్యార్దులతో ముచ్చటించిన శ్రీ అశ్విని వైష్ణవ్
నగర గుర్తింపును ప్రతిఫలిస్తూ స్టేషన్ల పునరభివృద్ధిః శ్రీ వైష్ణవ్
వెయిటింగ్ లిస్టుల అవాంతరాలను తొలగించేందుకు సామర్ధ్యాల పెంపు - రైల్వే మంత్రి
Posted On:
10 DEC 2022 6:28PM by PIB Hyderabad
కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ బిహెచ్ యు, ఐఐటి బిహెచ్‌యు విద్యార్ధులతో శనివారం నాడు ముచ్చటించారు.
ప్రధానమంత్రి నాయకత్వంలో భారతీయ రైల్వేలు నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ (ముందు దేశం, ఎప్పుడూ మొదటే) అన్న స్ఫూర్తితో తన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు పని చేస్తోందని, ఆయన విద్యార్ధులతో ముచ్చటిస్తూ చెప్పారు. వివిధ నగరాల రైల్వే స్టషన్లలో ఆ నగర గుర్తింపు స్పష్టంగా ఉండాలన్నది ప్రధానమంత్రి కోరిక ఆయన అన్నారు.
రైల్వే స్టేషన్ నగరంలోని రెండు భాగాలనూ అనుసంధానం చేసేదిగా ఉండాలని ఉద్ఘాటించారు. దీనిని సాధించేందుకు రైల్వే స్టేషన్ విస్తరణ చేస్తున్నామన్నారు. దీనితో పాటుగా, ప్రజలు వెయిటింగ్ లిస్ట్‌లు, అడ్డంకులు, రైలు కదలికలలో జాప్యాల నుంచి విముక్తి పొందేందుకు సామర్ధ్యాలను పెంచుతున్నామని ఆయన వివరించారు.
పదేళ్ళ కింద దేశంలో రైలు, ఎలక్ట్రానిక్స్ సహా ఇతర రంగాలలో తక్కువ ఉత్పత్తి జరిగేదన్నారు. నేడు, భారతీయ ఇంజనీర్ల తోడ్పాటుతో దేశంలోనే భారీ ఎత్తున ఉత్పాదన జరుగుతోందన్నారు.
ఆధునిక వసతులు కలిగిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లు దేశవ్యాప్తంగా తిరుగుతాయని శ్రీ వైష్ణవ్ చెప్పారు. దీనిని సాధించేందుకు పని జరుగుతోందన్నారు. వారణాసి జంక్షన్‌ను, కాశీ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. రానున్న 50 ఏళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, గాంధీనగర్, చారబాఘ్, లక్నో, చెన్నై, బెంగళూరు కంటోన్మెంట్, మధురై సహా 50 రైల్వే స్టేషన్లను పునరభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపిందన్నారు. ఇందులో 45 రైల్వే స్టేషన్లకు పని ప్రారంభమైందన్నారు.
***
(Release ID: 1882630)
Visitor Counter : 115