ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య భారత ఔత్సాహిక రైతు - ఫార్మ్‌ప్రెన్యూయర్ గా ప్రేరణ ఇస్తున్న ఓ మహిళా ఐకాన్ -
ఎన్ఈఆర్సిఆర్ఎంఎస్ చొరవతో సాధించిన విజయ గాథ, డోనర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ సొసైటీ.
Posted On:
08 DEC 2022 2:17PM by PIB Hyderabad
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో యాపిల్ సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 2019 సంవత్సరంలో, పాలంపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో-రిసోర్స్ టెక్నాలజీ (సిఎస్ఐఆర్-ఐహెచ్బిటి) సహకారంతో నార్త్ ఈస్టర్న్ రీజియన్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొసైటీ (ఎన్ఈఆర్సిఆర్ఎంఎస్), ఎన్ఈసి, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉఖ్రుల్ జిల్లాలో తక్కువ శీతలీకరణ రకాల ఆపిల్‌లను ప్రవేశపెట్టారు. హిమాచల్ ప్రదేశ్. ఈ కార్యక్రమానికి రైతు సంఘం నుండి, వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల నుండి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లోని పోయ్ విలేజ్‌కు చెందిన శ్రీమతి అగస్టినా అవుంగ్షి షిమ్రే యాపిల్ సాగుకు లబ్ధిదారుగా ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో-రిసోర్స్ టెక్నాలజీ (సిఎస్ఐఆర్-ఐహెచ్బిటి)లో శిక్షణ పొందిన రైతుల్లో ఆమె ఒకరు. కెపాసిటీ-బిల్డింగ్ మద్దతును అనుసరించి, శ్రీమతి షిమ్రే తన తోటలో ఆపిల్‌లను విజయవంతంగా పండించారు. ఆమె మొదటి దిగుబడి దాదాపు 160 కిలోల యాపిల్స్. వాటిని ఆమె లాభదాయకమైన ధర కిలోకి 200/- రూపాయలకు విక్రయించారు.
ఆమె విజయగాథకు స్ఫూర్తి పొంది, మరికొంత మంది రైతులు యాపిల్ తోటల పెంపకాన్ని చేపట్టారు. ఆమె ఆదర్శప్రాయమైన కృషికి, మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ. ఎన్. బీరేన్ సింగ్ ఆమెను సత్కరించారు. యాపిల్ సాగు, ఆ పంట అనంతర నిర్వహణలో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందారు. తన జీవితంలో ఈ గణనీయమైన మార్పుతో ఆర్థికంగా స్వయం-స్థిరత్వం పొందేలా చేసినందుకు ఎన్ఈఆర్సిఆర్ఎంఎస్, ఎన్ఈసి, కేంద్ర ప్రభుత్వానికి షిమ్రే తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు, ఆమె ఆత్మ నిర్భర్త కొత్త అర్థాన్ని గ్రహించారు. ఆమె కథ ఈశాన్య భారతదేశంలోని మొత్తం వ్యవసాయ సమాజానికి ఒక ప్రేరణగా నిలిచింది.
*****
(Release ID: 1882345)
Visitor Counter : 121