పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
Posted On:
08 DEC 2022 2:45PM by PIB Hyderabad
గుర్తించిన ఒక్కసారి మాత్రమే వినియోగించగల ప్లాస్టిక్ వస్తువులపై 12 ఆగస్టు 2021న నిషేధం విధించగా, అది 1 జులై 2022న అమలులోకి వస్తుంది. నిషేధిత ఒక్కసారి మాత్రమే వినియోగించగల ప్లాస్టిక్ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలకు ప్రత్యామ్నాయాలకు మారేందుకు సమయాన్ని ఇవ్వడం జరిగింది. ఎంఎస్ ఎంఇ యూనిట్లకు మద్దతునిచ్చేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ పథకాలను అమలు చేస్తుంది. ఇంతకు ముందు, నిషేధిత ఒక్కసారి మాత్రమే వినియోగించగల ప్లాస్టిక్ వస్తువులను ఉత్పత్తి చేసిన సంస్థలు ప్రత్యామ్నాయాలు / ఇతర వస్తువుల ఉత్పత్తిలోకి మళ్ళేందుకు మద్దతును అందించడం కూడా ఇందులో భాగమే. ఈ పథకాల మార్గదర్శనాల ప్రకారం సాంకేతికతను ఆధునికీరించడం, తాజా పరచడం, అవగాహనను సృష్టించడం, మార్కెటింగ్ మద్దతు, మౌలిక సదుపాయాల మద్దతును అందిస్తాయి. ప్రత్యామ్నాయ ఉత్పత్తి కొత్త ఉపాధి అవవకాశాలను, వాణిజ్య నమూనాలను సృష్టిస్తాయి. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయాలను అనుసరించడాన్ని పెంచేందుకు జిఎస్‌టి రేట్లను సవరించవలసిందిగా జిఎస్‌టి కౌన్సిల్ సెక్రటేరియేట్‌కు సూచించడం జరిగింది.
ఈ సమాచారాన్ని పర్యావరణ, అటవీ & పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే రాజ్యసభకు గురువారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1882007)
Visitor Counter : 149